BigTV English

Karachi Fire Accident | పాకిస్తాన్‌ షాపింగ్ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 11 మంది మృతి

Karachi Fire Accident | పాకిస్తాన్‌(Pakistan) కరాచీ నగరంలోని ఒక ప్రముఖ షాపింగ్ మాల్‌లో శనివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షాపింగ్ మాల్ రెండో అంతస్తులో ముందుగా మంటలు చెలరేగాయి. ఆ తరువాత 4, 5, 6 అంతస్తుల్లో మంటలు వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాదంలో 11 మంది చనిపోయినట్లు సమాచారం.

Karachi Fire Accident | పాకిస్తాన్‌ షాపింగ్ మాల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 11 మంది మృతి

Karachi Fire Accident | పాకిస్తాన్‌(Pakistan) కరాచీ నగరంలోని ఒక ప్రముఖ షాపింగ్ మాల్‌లో శనివారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షాపింగ్ మాల్ రెండో అంతస్తులో ముందుగా మంటలు చెలరేగాయి. ఆ తరువాత 4, 5, 6 అంతస్తుల్లో మంటలు వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాదంలో 11 మంది చనిపోయినట్లు సమాచారం. మరో ఆరుగురుకి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం జరగడానికి కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. శనివారం ఉదయం ఈ దుర్ఘటన జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది.


ఉదయం 7 గంటలకు కరాచీ నగరంలోని ఓ షాపింగ్‌ మాల్‌లో రెండో అంతస్తులో మంటలు చెలరేగాయి. ఆ తరువాత వేగంగా పై మూడు అంతస్తులకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మంటలు వ్యాపించకుండా అడ్డుకోవడానికి షాపింగ్ మాల్‌లో కరెంటు సప్లైని నిలిపివేశారు. ఆ తరువాత భవనంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు ప్రయత్నించగా.. లోపల దట్టమైన పొగ పీల్చడం వల్ల 11 మంది చనిపోయారని.. ఆరుగరు తీవ్రంగా గాయపడ్డారని ఒక పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. ఈ ఘటనలో 42 మందిని కాపాడామని ఆయన అన్నారు.

ఈ ప్రదేశంలో ఉన్న భవనాలలో అగ్నిమాపక సిలిండర్లు లేవని.. ఇది బాధ్యతా రాహిత్యమని నగర మేయర్ చెప్పారు. త్వరలోనే విచారణ జరిపి షాపింగ్ నిర్వహకులపై చర్యలు తీసుకుంటామని అన్నారు.


Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×