E-Paper
Advertisement

Drones Hit Kuwait Oil Refinery: కువైట్ ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ల దాడులు.. ఉత్తర ఇరాక్‌లో అమెరికా స్థావరాలపై..

Drones Hit Kuwait Oil Refinery: కువైట్ ఆయిల్ రిఫైనరీపై డ్రోన్ల దాడులు.. ఉత్తర ఇరాక్‌లో అమెరికా స్థావరాలపై..
Advertisement

Drones Hit Kuwait Oil Refinery: అమెరికా-ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ బెంబేలెత్తిపోతోంది. ఇరాన్ టాప్ నేతలు మృత్యువాతపడడంతో ప్రతీకారం తీర్చుకోవాలని ఆలోచన చేస్తోంది. ఈ క్రమంలో పొరుగుదేశాలపై మిస్సైళ్లు, డ్రోన్ల దాడులతో విరుచుకుపడుతోంది. ఖతార్, కువైట్, ఉత్తర ఇరాక్‌లోని అమెరికా వైమానిక స్థావరాలపై దాడులు తీవ్రతరం చేసింది ఇరాన్.

కువైట్ ఆయిల్ రిఫైనరీపై  ఇరాన్ డ్రోన్ల దాడులు

Advertisement

ప్రతీకారంతో రగిలిపోతున్న ఇరాన్.. ఇజ్రాయెల్ నగరాలు, గల్ఫ్ దేశాల్లో కొన్ని దేశాల చమురు, గ్యాస్ క్షేత్రాలు, మౌలిక సదుపాయాలపై క్షిపణి, డ్రోన్ దాడులు తీవ్రతరం చేసింది. ఒకప్పుడు ఇరాన్-అమెరికా మధ్య జరిగిన ఈ సంఘర్షణ పొరుగు దేశాలకు కూడా విస్తరించింది. మధ్యప్రాచ్యంలో అతి పెద్దది, పురాతన చమురు శుద్ధి కార్మాగారం మీనా అల్-అహ్మది. కువైట్ సిటీకి దక్షిణంగా సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది.

ఇది కువైట్‌లో ఉంది. అక్కడ రోజుకు 730,000 బ్యారెళ్ల ఉత్పత్తి చేస్తుంది. దీనిపై ఇరాన్ డ్రోన్ల దాడి జరిగింది. మరొకటి దాడి సమీపంలో మీనా అబ్దుల్లా శుద్ధి కర్మాగారం చేసింది. అందులో రోజుకు 454,000 బ్యారెళ్ల ఆయిల్ ఉత్పత్తి చేస్తుంది. ఆ దేశ ఎగుమతిలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ ప్రాంతంలో ఇంధన సౌకర్యాలకు ముప్పు అంతకంతకూ పెరుగుతున్న తరుణంలో రెండో దాడి జరిగింది.

Advertisement

ఉత్తర ఇరాక్‌లో అమెరికా స్థావరాలపై కూడా దాడులు

ఈ దాడిలో రిఫైనరీ మంటల్లో చిక్కుకుంది. ఈ దాడుల్లో ఎవరికీ గాయాలు కాలేదు. కాకపోతే భారీగా నష్టం జరిగినట్టు కువైట్ జాతీయ పెట్రోలియం సంస్థ అధికారులు చెబుతున్నారు. మంటలు అదుపు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేసినప్పటికీ మంటలు ఎగిసిపడ్డాయి. దీనికి సంబంధించి వీడియో బయటకు వచ్చింది.

వైమానిక దాడులను ఎదుర్కొన్నట్లు కువైట్ సైన్యం తెలిపింది. దూసుకొస్తున్న క్షిపణులను అడ్డుకునే సమయంలో పలు ప్రాంతాల్లో పేలుళ్లు వినిపించాయి. అధికారులు జారీ చేసిన భద్రతా సూచనలను ప్రజలు పాటించాలని పేర్కొంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఆ దేశంలోని అప్‌స్ట్రీమ్ ఇంధన మౌలిక సదుపాయాలపై జరిగిన మొట్ట మొదటి దాడిగా చెబుతున్నారు.

ALSO READ: భారత్‌కు గ్యాస్ కష్టాలు రెట్టింపు..జలసంధిలో 3.2 లక్షల టన్నుల ఎల్పీజీ

బుధవారం రాత్రి ప్రపంచంలోని అతిపెద్ద సహజ వాయు క్షేత్రాల్లో ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్ ఫీల్డ్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగా గల్ఫ్ దేశాలలోని ఇంధన సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. మధ్యప్రాచ్యంలో యుద్ధ భయాల ప్రభావం ప్రపంచంలోని స్టాక్ మార్కెట్లు కుదిపేస్తోంది. దీంతో క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు అమాంతంగా 110 డాలర్లకు పైగానే చేరింది.

 

 

 

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×