E-Paper
Advertisement

RailOne App: ఐఆర్‌సీటీసీకి బై బై.. ‘రైల్ వన్’ యాప్‌కు వెళ్లిపోతున్న జనం, ఏంటీ దీని ప్రత్యేకత?

RailOne App: ఐఆర్‌సీటీసీకి బై బై.. ‘రైల్ వన్’ యాప్‌కు వెళ్లిపోతున్న జనం, ఏంటీ దీని ప్రత్యేకత?
Advertisement

ఇండియన్ రైల్వే తీసుకొచ్చిన రైల్ వన్ యాప్ కు ప్రయాణీకుల నుంచి మంచి సపోర్ట్ లభిస్తోంది. గతంలో ఉన్న IRCTC యాప్ తో పోల్చితే, ఈ యాప్ మరింత మెరుగైన సేవలు అందిస్తుండటంతో ఎక్కువ మంది ఈ యాప్ ను ఉపయోగించేందుకు మొగ్గు చూపుతున్నారు. గతంలో ఒక్కో రైలు సేవకు ఒక్కో యాప్ అందుబాటులో ఉండగా, ఇప్పుడు అన్ని సర్వీసులకు రైల్ వన్ యాప్ ఏకైక పరిష్కారంగా మారింది.

అధికారిక ప్రభుత్వ గణాంకాల ప్రకారం, రైల్‌ వన్ యాప్ 2.57 కోట్ల డౌన్‌ లోడ్‌ లను దాటింది. సగటున రోజుకు 7.64 లక్షల టిక్కెట్ల బుకింగ్‌లు జరుగుతున్నాయి. ఇది భారతీయ రైల్వేకు సంబంధించి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. రైల్‌ వన్ యాప్ రిజర్వ్డ్, అన్ రిజర్వ్డ్ టిక్కెట్ బుకింగ్ సేవలను నేరుగా ప్రయాణికుల స్మార్ట్‌ ఫోన్ల ద్వారా పొందే అవకాశం కల్పిస్తుంది. దీనివల్ల ఫిజికల్ కౌంటర్లపై ఆధారపడటం తగ్గి, దేశవ్యాప్తంగా టికెట్ బుకింగ్ సౌకర్యం మెరుగుపడుతుంది.

రైల్‌ వన్: ఒకే చోట అన్ని రైల్వే సేవలు

Advertisement

రైల్‌ వన్ యాప్ ప్రయాణికుల సేవలను సులభతరం చేయడానికి భారతీయ రైల్వే అభివృద్ధి చేసిన ఆల్ ఇన్ వన్ ప్లాట్‌ ఫామ్. ఇది ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS), అన్‌రిజర్వ్‌డ్ టికెటింగ్ సిస్టమ్ (UTS)ను ఒకే యాప్‌ లో మిక్స్ చేస్తుంది.  వినియోగదారులు రిజర్వ్‌ డ్, అన్‌రిజర్వ్‌ డ్, ప్లాట్‌ఫారమ్ టిక్కెట్లను సులభంగా బుక్ చేసుకోవచ్చు. ఇది రైలు విచారణ, PNR స్టేటస్, రైల్‌ మద్దత్ సేవలను కూడా అందిస్తుంది. అన్ని సేవలు ఒకే లాగిన్ సిస్టమ్ ద్వారా అందుబాటులో ఉంటాయి.

 రైల్‌ వన్ గురించి..

ప్రభుత్వం తాజా వివరాల ప్రకారం, ఇప్పటి వరకు ఈ యాప్ డౌన్‌లోడ్లు 2.57 కోట్లకు చేరాయి. సగటు రోజువారీ బుక్ చేయబడిన టిక్కెట్లు 7.64 లక్షలు, ఈ నెంబర్స్ భారతీయ ప్రయాణికులలో డిజిటల్ టికెటింగ్‌ ను బలంగా ఉపయోగించుకుంటున్నట్లు వెల్లడిస్తున్నాయి. 88% రిజర్వ్డ్ టిక్కెట్లు ఇప్పుడు ఆన్‌లైన్‌లో బుక్ అవుతున్నాయి. రైల్వే టిక్కెట్ కౌంటర్ల దగ్గర రద్దీని కూడా తగ్గిస్తుంది.

రైల్‌వన్ యాప్ ఫీచర్లు  

Advertisement

రైల్‌ వన్ యాప్ అనేక యూజర్ ఫ్రెండ్లీ ఫీచర్లను అందిస్తుంది. సింగిల్ సైన్ ఆన్ లాగిన్ సిస్టమ్, లైవ్ ట్రైన్ ట్రాకింగ్, కోచ్ పొజిషన్ వివరాలు, PNR ఎంక్వైరీ, బుకింగ్ హిస్టరీ, రైల్‌ మద్దత్ ఫిర్యాదుల వ్యవస్థ, సురక్షితమైన చెల్లింపులు, ప్రైవసీ ఫీచర్లు ఉన్నాయి.

రైల్ వన్ యాప్ ప్రాముఖ్యత ఏంటి?

రైల్ వన్ యాప్ కారణంగా టికెట్ కౌంటర్ల దగ్గర పొడవైన క్యూలను తగ్గిస్తుంది. గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంతాలకు డిజిటల్ సదుపాయాన్ని అందిస్తుంది. పారదర్శకతను, సేవల పంపిణీని మెరుగుపరుస్తుంది. డిజిటల్ వ్యవస్థల ద్వారా పెద్ద ఎత్తున ప్రయాణీకుల నిర్వహణకు మద్దతు ఇస్తుంది. ప్రయాణీకుల సేవలను డిజిటలైజ్ చేయడం, రైల్వే టికెట్ బుకింగ్ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

Read Also: రైలు టికెట్ ధరలను ఇలా నిర్ణయిస్తారా? వామ్మో పెద్ద కథే!

Related News

స్మశానంలో ప్రేమాయణం.. ఇదేం పిచ్చిరా అయ్యా!

చిప్స్ కోసం రైల్వే స్టేషన్‌లో తొక్కిసలాట.. ఏం చిల్లర గాళ్లు ఉన్నారేంట్రా మీరూ?

దేశంలోని 5 అద్భుతమైన వైల్డ్‌లైఫ్ సఫారీలు.. వన్య ప్రాణులు చూడాలనుకుంటే జూలై బెస్ట్

వేముల‌వాడ రాజ‌న్న‌కు అస‌లు కోడెలను ఎందుకు క‌ట్టేస్తారు ? దీని ర‌హ‌స్యం ఇదే

లావాతో పుట్టిన రంగుల గుహలు.. అక్కడ అడుగుపెడితే ప్రపంచాన్ని మర్చిపోతారు!

భారత్ నుంచి లండన్‌కు బస్సు సర్వీస్.. అమ్మో.. అన్ని రోజుల ప్రయాణమా?

ఒక్క టికెట్ చాలు.. 56 రోజుల పాటు రైల్లో దేశమంతా చుట్టేయొచ్చు!

భారత్‌లో మరో అద్భుతం.. సముద్ర గర్భంలో బుల్లెట్ ట్రైన్.. సరికొత్త హిస్టరీ క్రియేట్ చేస్తున్న ఇండియా!

Big Stories

Advertisement
×