BigTV English

Kuala Lumpur airport Gas leak: మలేషియా ఎయిర్‌పోర్టులో గ్యాస్ లీక్, 39 మంది..

Kuala Lumpur airport Gas leak: మలేషియా ఎయిర్‌పోర్టులో గ్యాస్ లీక్, 39 మంది..

Kuala Lumpur airport Gas leak: ప్రపంచంలో నిత్యం బిజీగా ఉండే ఎయిర్‌పోర్టుల్లో మలేషియాలోని కౌలాలంపూర్ ఒకటి. అయితే ఆ విమానాశ్రయంలో గ్యాస్ లీక్ కావడం తీవ్ర కలకలం రేపింది. అంతేకాదు దాదాపు 40 మంది వరకు ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.


అసలేం జరిగింది? ప్రతీ నిమిషం అలర్ట్‌గా ఈ ఎయిర్‌పోర్టులో గ్యాస్ ఎలా లీకైంది? అధికారుల లోపమా? లేక మరేదైనా జరిగిందా? ఇవే ప్రశ్నలు ఎయిర్‌పోర్టు అథారిటీని వెంటాడుతున్నాయి. ఎయిర్‌‌పోర్టులోని సదరన్ సపోర్ట్ జోన్ సెపాంగ్ ఎయిర్‌క్రాప్ట్ ఇంజనీరింగ్ ఫెసిలిటీ ఉంది.

ఉదయం పదకొండున్నర గంటల సమయంలో అక్కడ గ్యాస్ లీకైంది. ఈ ఘటన దాదాపు 39 మంది వరకు ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని చికిత్స కోసం మరో ప్రాంతానికి తరలించారు. వారంతా ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు.


ALSO READ:  సీనియర్ అడ్వకేట్.. హిండెన్‌బర్గ్ రిపోర్టుపై కీలక వ్యాఖ్యలు.. ఆపై చైనా..

గ్యాస్ లీక్ గురించి సమాచారం అందుకున్న సెలంగోర్ అగ్రిమాపక సిబ్బంది వెంటనే దాన్ని కంట్రోల్ చేసిందని అధికారులు చెబుతున్నమాట. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదన్నారు. అయితే విడుదలైన గ్యాస్.. మిథైల్ మెర్‌కాప్టాన్‌గా గుర్తించారు. ఈ ఘటన కారణంగా విమాన రాకపోకల విషయంలో ఎలాంటి మార్పులు ఉండవని చెప్పుకొచ్చారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×