E-Paper
Advertisement

Pak-Afghan Border: పాక్-ఆఫ్ఘాన్ మధ్య యుద్ధం.. 70 మంది ఉగ్రవాదులు, 55 మంది పాక్ సైనికులు మృతి!

Pak-Afghan Border: పాక్-ఆఫ్ఘాన్ మధ్య యుద్ధం.. 70 మంది ఉగ్రవాదులు, 55 మంది పాక్ సైనికులు మృతి!

Pak-Afghan Border: పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు వివాదం తారాస్థాయికి చేరింది. ఫలితంగా ఇరుదేశాల మధ్య యుద్ధానికి దారి తీసింది. ఒకరిపై మరొకరు దాడులు చేసుకునే స్థాయికి వెళ్లింది. ఫలితంగా పాక్ వైమానిక దాడుల్లో 70 మంది ఉగ్రవాదులు హతం కాగా, ఆప్థాన్ దాడిలో 55 మంది పాక సైనికులు మృతి చెందారు.

పాకిస్థాన్-ఆఫ్ఘాన్ దేశాల మధ్య కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు

పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు డ్యూరాండ్ లైన్ వ్యవహారం తారాస్థాయికి చేరింది. కొన్నాళ్లుగా సరిహద్దు వెంబడి ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తోంది పాకిస్థాన్ సైన్యం. ఈ క్రమంలో ఆప్ఘాన్ పౌరులు సైతం మృత్యువాతపడ్డారు. పరిస్థితి గమనించిన ఆప్ఘాన్ పాలకులు ఎదురుదాడికి దిగారు. సరిహద్దు వెంబడి ఆ దేశ సైనిక స్థావరాలు తమ దళాలు స్వాధీనం చేసుకున్నాయని తాలిబన్లు ప్రకటించారు.

అంతేకాదు తాము చేసిన దాడుల్లో 55 మంది పాకిస్థాన్ సైనికులు మృతి చెందినట్టు ప్రకటించింది తాలిబన్లు ప్రకటించాయి. ఈ వ్యవహారం జరిగిన కొన్ని గంటల వ్యవధిలో పాకిస్థాన్ ‘ఆపరేషన్ గజాబ్-లిల్-హక్’ను ప్రారంభించింది. శుక్రవారం తెల్లవారుజామున కాబూల్, కాందహార్ సహా ఆఫ్ఘనిస్తాన్ కీలక నగరాలపై బాంబు దాడులు చేసింది పాకిస్థాన్.

కాబూల్, పాక్టియా, కాందహార్‌లలో ఆఫ్ఘన్ రక్షణ లక్ష్యాలను లక్ష్యంగా చేసుకున్నట్లు పాకిస్తాన్ సమాచార మంత్రి అత్తౌల్లా తరార్ ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ దాడుల్లో 70 మందికి పైగా ఉగ్రవాదులు హతమైనట్టు ప్రకటించింది.  భారీగా ఆయుధ సామాగ్రి ధ్వంసమైందని పాకిస్తాన్ రక్షణ శాఖ తెలిపింది. అందుతున్న సమాచారం మేరకు ఇరుదేశాల సరిహద్దుల్లో టోర్ఖమ్ గేట్ వద్ద కాల్పులు కొనసాగుతున్నాయి.

ఉగ్రవాదులను మట్టుబెట్టిన పాక్ సైన్యం.. ఎదురుదాడుల్లో 55 మంది పాక్ సైనికులు మృతి

గురువారం డ్యూరాండ్ రేఖ వెంబడి నిర్వహించిన ప్రతీకార దాడుల్లో 55 మంది పాకిస్తాన్ సైనికులు మరణించినట్టు ఆఫ్ఘనిస్తాన్ జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. రెండు దేశాల మధ్య దాదాపు 2,611 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. దీన్ని డ్యూరాండ్ లైన్ అని పిలుస్తారు. సరిహద్దును ఆఫ్ఘనిస్తాన్ అధికారికంగా ఎప్పుడూ గుర్తించలేదు.

పాకిస్తాన్ సైనిక దళాలు కొన్నిరోజులుగా ఆఫ్ఘన్ భూభాగంలోకి వెళ్లి దాడులు చేయడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత రంజాన్ ఉపవాస దీక్షలు సమయంలో మసీదు వద్ద బాంబు పేలుడు జరిగింది. దీని వెనుక తాలిబన్లు ఉన్నారని భావించిన పాకిస్తాన్, సరిహద్దుల్లో తాలిబన్ల ఉగ్ర స్థావరాలను నేలకూల్చింది. పరిస్థితి గమనించిన ఆప్ఘాన్ ప్రభుత్వం ఎదురుదాడికి దిగింది.

ALSO READ: బికినీ అమ్మాయిలు.. చేతిలో మద్యం.. స్టీఫెన్ హాకింగ్ ఫొటో కలకలం

పాకిస్థాన్ సైన్యం కాబూల్, కాందహార్, పాక్టియాలతోపాటు కొన్ని ప్రాంతాలలో వైమానిక దాడులు నిర్వహించినట్టు తాలిబన్ ప్రతినిధి జబివుల్లా ముజాహిద్ తెలిపారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ఆస్తి నష్టం భారీ ఉందని తెలిపారు. ఆ దాడులకు ప్రతీకారం ప్రారంభమైందని చెప్పుకొచ్చారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని ఐక్యరాజ్యసమితి విజ్ఞప్తి చేసింది.

 

Related News

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. ఇరాన్‌పై అమెరికా దాడులు.. క్షిపణి ప్రయోగ కేంద్రాలు

Big Stories

×