E-Paper
Advertisement

Epstein Files: బికినీ అమ్మాయిలు.. చేతిలో మద్యం.. స్టీఫెన్ హాకింగ్ ఫొటో కలకలం

Epstein Files: బికినీ అమ్మాయిలు.. చేతిలో మద్యం.. స్టీఫెన్ హాకింగ్ ఫొటో కలకలం
Advertisement

Epstein Files: ఎప్ స్టీన్ ఫైల్స్ కు సంబంధించి తాజాగా విడుదలైన ఓ ఫొటో యావత్ ప్రపంచాన్ని షాక్ కు గురిచేస్తోంది. దివంగత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్.. బికినీ అమ్మాయిల మధ్యలో ఉండటం చూసి ప్రతీ ఒక్కరూ నివ్వెరపోతున్నారు. ఆయన చేతిలో కాక్ టెయిల్ సైతం ఉండటంతో అంతా షాకవుతున్నారు. కొత్తగా బయటపడిన ఫొటో 2006లో సెయింట్ థామస్ లోని రిట్జ్ కార్ట్లస్ హోటల్ (Ritz-Carlton Hotel) లో తీసిందని తెలుస్తోంది.

వివరాల్లోకి వెళ్తే..

2006లో జరిగిన సైన్స్ సింపోజియం సందర్భంగా ఈ ఫొటో తీసినట్లు భావిస్తున్నారు. ఆ సమయంలోనే హాకింగ్.. క్వాంటం కాస్మోలజీ (Quantum Cosmology)పై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సెయింట్ థామస్, ఎప్ స్టీన్ లకు చెందిన 75 ఎకరాల ప్రైవేట్ ద్వీపమైన లిటిల్ సెయింట్ జేమ్స్ ను 21 మంది శాస్త్రవేత్తలు సందర్శించారు. వారిలో స్టీఫెన్ హాకింగ్ సైతం ఉన్నట్లు ది ఇండిపెండెంట్ పత్రిక తాజాగా నివేదించింది.

ఫ్యామిలీ స్పందన ఇదే..

Advertisement

బికినీ అమ్మాయిలతో హాకింగ్ ఉన్న ఫొటోపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆయన కుటుంబం దీనిపై స్పందించింది. యూకేకి చెందిన పత్రికతో హాకింగ్ కుటుంబ సభ్యుడు ఒకరు మాట్లాడుతూ.. బికినీలో ఉన్న ఇద్దరు అమ్మాయిలు హాకింగ్ దీర్ఘకాలిక సంరక్షకులని స్పష్టం చేశారు. ఆయన వ్యక్తిత్వాన్ని అనుమానించే ప్రయత్నం ఎవరూ చేయవద్దని సూచించారు.

250 సార్లకు పైగా హాకింగ్ పేరు

అమెరికన్ న్యాయ శాఖ విభాగం విడుదల చేసిన ఎప్ స్టిన్ ఫైల్స్ లో 250 సార్లకు పైగా హాకింగ్ పేరు ప్రస్తావించబడింది. ఈ క్రమంలోనే బికినీలతో ఆయన ఉన్న ఫొటో సైతం బయటకు రావడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపింది. ఫొటోను పరిశీలిస్తే ఇద్దరు మహిళల మధ్య గాజు గ్లాసు పట్టుకొని హాకింగ్ నవ్వుతూ కనిపించారు.

Advertisement

Also Read: ACs Offers Amazon: అమెజాన్ బంపరాఫర్.. సగం ధరకే టాప్ ఏసీలు.. కొన్నొళ్లకు పండగే!

ఎవరీ స్టీఫెన్ హాకింగ్?

స్టీఫెన్ హాకింగ్ విషయానికి వస్తే.. ఆధునిక కాలంలో అత్యంత ప్రభావంతమైన శాస్త్రవేత్తల్లో ఆయన ఒకరు. ALS వ్యాధి కారణంగా శరీరమంతా చచ్చుబడినా.. ఆయన తన మేధాసంపత్తితో గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగారు. విశ్వం ఆవిర్భావం, బ్లాక్ హోల్స్ (కృష్ణబిలాలు) థర్మోడైనమిక్స్, క్వాంటమ్ గ్రావిటీ పరిశోధనల్లో ముఖ్యభూమిక పోషించారు. 2018 మార్చి 14న ఆయన కన్నుమూశారు.

Also Read: Summer Gadgets 2026: సమ్మర్‌లో తప్పక ఉండాల్సిన.. అధునాతన స్మార్ట్ గ్యాడ్జెట్స్.. వాటి ఫీచర్లు, లాభాలు ఇవే!

Related News

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

రష్యాను కుదిపేసిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలు 7.0 గా నమోదు, నష్టంపై ఇంకా..

బలవంతంగా డ్రగ్స్‌ ఎక్కించి.. ఎఫ్ఐటీ విద్యార్థినిపై అత్యాచారం, అమెరికాలో షాకింగ్ ఘటన

పాఠశాలలో ఓ టీనేజర్ దారుణం.. గన్‌తో కాల్పుల మోత, టీచర్ సహా నలుగురు మృతి, అమెరికాలో ఘటన

హోర్ముజ్ జలసంధిలో బాంబుల శబ్దాలు.. పేలుతున్న మైన్స్-మునిగిన షిప్, అసలేం జరిగింది?

అతిపెద్ద చమురు సంస్థ అరామ్కోపై క్షిపణి దాడి.. హౌతీ దూకుడుతో సౌదీకి వణుకు

Big Stories

Advertisement
×