E-Paper
Advertisement

Peru bus accident: పెరూలో బస్సు యాక్సిడెంట్, 26 మంది మృతి, 14 మందికి గాయాలు

Peru bus accident: పెరూలో బస్సు యాక్సిడెంట్, 26 మంది మృతి, 14 మందికి గాయాలు
Advertisement

Peru bus accident: పెరులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 26 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరో 14 మంది గాయాలయ్యాయి. రాజధాని లిమా నుంచి 40 మంది ప్రయాణికులతో బస్సు ఆండియన్ ప్రాంతానికి బయలుదేరింది.

అయితే బస్సు లిమా నుంచి చాలా దూరం వెళ్లిన తర్వాత ఘాటు రోడ్డు మొదలైంది. బస్సు టర్నింగ్ కొట్టే సమయంలో స్టీరింగ్ లోపమో.. డ్రైవర్ నిర్లక్షమో తెలీదుగానీ 200 మీటర్ల లోయలో బస్సు పడిపోయింది. ఏం జరిగిందో ఎవరికీ తెలీదు. కొద్దిసేపటికి ప్రయాణికులు తేరుకున్నారు. చాలామంది మృతి చెందినట్టు కనిపించారు. వెంటనే ఈ విషయాన్ని అధికారులకు సమాచారం ఇచ్చారు.

Advertisement

వెంటనే రంగంలోకి దిగిన స్థానిక పోలీసులు ఆ లోయలోకి దిగేసరికి చాలామంది చనిపోయారు. దాదాపు 26 మంది మరణించినట్టు అక్కడి అధికారులు చెబుతున్నమాట. మరో 14 మంది గాయాలయ్యాయి. అందులో పలువురు పరిస్థితి విషమంగా ఉంది. వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

బస్సు డ్రైవర్లను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి క్రిటికల్‌గానే ఉన్నట్లు తెలుస్తోంది.
దక్షిణ అమెరికా గురించి చెప్పనక్కర్లేదు. అక్కడ చాలావరకు పర్వతాల ప్రాంతాల మీదుగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. దీనికితోడు సరైన రోడ్లు ఉండవు. ప్రశాంతంగా ట్రావెల్ చేయాలన్నా చాలా కష్టంతో కూడుకున్న పని.

Advertisement

ALSO READ: ఆయిల్ ట్యాంకర్ బోల్తా..16 మంది మృతి అందులో 13 మంది భారతీయులు

ఒకవేళ వేగంగా వాహనాలు వెళ్లినా ప్రమాదాలు జరగడం ఖాయం. ఆ తరహా ఘటనలు చాలా జరిగాయి కూడా. ప్రపంచంలోని అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశాల్లో పెరూ ఒకటి. గతేదాడి జరిగిన రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 3000 మందికి పైగానే చనిపోయారంటే అక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

 

Tags

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×