BigTV English

International:ఆయిల్ ట్యాంకర్ బోల్తా..16 మంది మృతి అందులో 13 మంది భారతీయులు

International:ఆయిల్ ట్యాంకర్ బోల్తా..16 మంది మృతి అందులో 13 మంది భారతీయులు

13 Indians Among 16 Crew Members Missing After Oil Tanker Capsizes Off Oman
ఒమన్ సముద్ర తీరంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.కొమెరోస్ జెండాతో 16 మంది సిబ్భందితో ప్రయాణిస్తున్న ఆయిల్ ట్యాంకర్ ఒక్కసారిగా బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో మొత్తం 16 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ ఓ ప్రకటన జారీ చేసింది. డుక్మ్ సమీపంలో హఠాత్తుగా ఆయిల్ ట్యాంకర్ బోల్తా పడింది. దీనితో ఆ ట్యాంకర్ లో ప్రయాణిస్తున్న 16 మంది సిబ్బంది మృతి చెందగా అందులో 13 మంది భారతీయులు, ముగ్గురు శ్రీలంకకు చెందిన వారు ఉన్నారని తెలిపింది. ఆయిల్ ట్యాంకర్ లో ఉన్న వారెవారు మొత్తం గల్లంతయ్యారని తెలిపింది.


ట్యాంకర్ తల్లక్రిందులుగా పడి..

ప్రస్తుతం వారి ఆచూకీ దొరకడం కూడా కష్టమవుతోంది. ట్యాంకర్ తల్లక్రిందులుగా పడిపోవడంతో మృత దేహాలను తీయడం కష్టంగా మారిందని చెబుతోంది. అయితే రెస్స్కూ టీమ్ రంగంలో దిగి ఆయిల్ ట్యాంకర్ ను బయటకు లాగే ప్రయత్నం చేస్తోంది. ట్యాంకర్ లో ఉన్న ఆయిల్ మొత్తం సముద్రం పాలయింది. ఈ ట్యాంకర్ ను 2007లో రూపొందించారు. ప్రత్యేకంగా ఆయిల్ ఉత్పత్తుల కోసం ఈ ట్యాంకర్ ను ఉపయోగిస్తున్నారు. చిన్న పాటి సముద్ర తీర ప్రయాణాలకు మాత్రమే దీనిని వినియోగిస్తారని ఒమన్ మారిటైమ్ సెక్యూరిటీ సెంటర్ తెలియజేసింది. రాస్ మద్రాకాకు 25 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.


Tags

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×