BigTV English

AP Assembly secretary general: ఏపీ సమావేశాల ముందు.. అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌గా సూర్యదేవర ప్రసన్న

AP Assembly secretary general: ఏపీ సమావేశాల ముందు.. అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌గా సూర్యదేవర ప్రసన్న

AP Assembly secretary general: ఆంధ్రప్రదేశ్‌‌లో కొత్త పాలనకు శ్రీకారం చుట్టారు సీఎం చంద్రబాబు నాయుడు. వైసీపీ ప్రభుత్వానికి తొత్తులుగా మారిన అధికారులకు దూరం పెడుతున్నారు. అంతేకాదు పోస్టింగ్ ఇవ్వకుండా చాలామంది అధికారులను పెండింగ్‌లో పెట్టారు. సీనియర్ అధికారులను రాష్ట్రానికి రప్పిస్తున్నారు. ఇప్పటికే సీఎం పేషీ, ఆర్థికశాఖ ఇలా ఏశాఖ చూచినా కొత్త అధికారులు దర్శన మిస్తున్నా రు. తాజాగా అసెంబ్లీ సెక్రటరీ జనరల్ వంతైంది.


ఏపీ అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌గా సూర్యదేవర ప్రసన్నకుమార్ నియమితులయ్యారు. శాసన‌సభ కార్యాల యంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు సమక్షంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు తీసుకున్న తర్వాత స్పీకర్ అయ్యన్నపాత్రుడ్ని ఆయన కలిశారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగానికి సంబందించి పుస్తకాన్ని ఆయనకు బహుకరించారు.

భారత ప్రభుత్వంలో వివిధ హోదాల్లో 30 ఏళ్లపాటు పని చేసిన అనుభవం సూర్యదేవర ప్రసన్నకుమార్ సొంతం. లోక్‌సభ స్పీకర్‌కు ఓఎస్డీగా పని చేసిన ఆయన, లోక్‌సభ టీవీ చానెల్ ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు. రాజ్యసభ ఛైర్మన్ కార్యాలయంలో ఆరేళ్లపాటు పనిచేశారు. రాజ్యసభ టీవీ ఛానెల్ ఏర్పాటుకు నియమించిన కమిటీలో ఆయన ఒకరు.


అంతేకాదు సీజేఐ కార్యాలయంలో ఓఎస్డీగా, సుప్రీంకోర్టులో కొంతకాలం రిజిస్ట్రార్‌గా విధులు నిర్వహించారు. సుమారు మూడేళ్లపాటు ఢిల్లీ శాసనసభ కార్యదర్శి పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. శాసన, కార్య నిర్వాహక, న్యాయవ్యవస్థలపై అవగాహన ఉండడంతో సూర్యదేవర ప్రసన్నకుమార్‌ను అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌గా స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఎంపిక చేశారు.

ALSO READ: కేంద్రమంత్రి అమిత్ షాతో సీఎం చంద్రబాబు సమావేశం

సూర్యదేవర నియామకాన్ని మండలి ఛైర్మన్ మోషేన్‌రాజు, సీఎం చంద్రబాబు, శాసనసభా వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ ధ్రువీకరించారు. మరోవైపు ఏపీ అసెంబ్లీకి కొత్త సెక్రటరీ జనరల్ రావడంతో రామాచార్యులు పదవీ విరమణ సందర్భంగా వారిని సన్మానించారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. అసెంబ్లీ ఉద్యోగులతో కలిసి ఆయనకు వీడ్కోలు పలికారు. మొత్తానికి అసెంబ్లీ సమావేశాలకు ముందు సెక్రటరీ జనరల్‌ను నియమించింది కూటమి ప్రభుత్వం.

 

Tags

Related News

Amaravati News: వైసీపీ స్కెచ్ మామూలుగా లేదు.. సీఎం చంద్రబాబుకు ఆ పోలీసు నోటీసు,అసలు మేటర్ అదే?

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

AP Rains: ఏపీ వాసులకు అలర్ట్.. రాగల 3 గంటల్లో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

GST Official Suspended: సోషల్ మీడియా పోస్ట్ తో ఉద్యోగం ఊడింది.. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు

Prakasam District: గిద్దలూరులో విషాదం.. బాత్రూంలో డెలివరీ.. బకెట్లో శిశువును పడేసి.. పరారైన తల్లి

Big Stories

×