E-Paper
Advertisement

హెల్తీ అండ్ టేస్టీ సోయా చంక్స్ పులావ్..క్షణాల్లోనే రెడీ అవుతుంది

హెల్తీ అండ్ టేస్టీ సోయా చంక్స్ పులావ్..క్షణాల్లోనే రెడీ అవుతుంది
Advertisement

Soya chunks pulao recipe: వీకెండ్ వచ్చిందంటే చాలు, ఇంట్లో ఏదైనా స్పెషల్ చేసుకోవాలనిపిస్తుంది. అదే సమయంలో.. హెల్దీగా, తక్కువ సమయంలో అయిపోయే రెసిపీ అయితే ఇంకా బాగుంటుంది. అలాంటి వారి.. కోసం పర్ఫెక్ట్ ఛాయిస్ సోయా చంక్స్ పులావ్! మాంసాహారానికి ఏమాత్రం తీసి పోని విధంగా, మసాలా ఘుమఘుమలతో నోరూరించే ఈ పులావ్, తింటుంటే ప్రతి ముద్దకు అద్భుతమైన రుచిని ఇస్తుంది. కేవలం రుచిలోనే కాకుండా.. ఇందులో ఉండే ప్రోటీన్స్ ఆరోగ్యాన్నీ ఇస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ట్రెండీ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసేద్దాం!

కావలసిన పదార్థాలు:

బాస్మతి బియ్యం: 2 కప్పులు

Advertisement

సోయా చంక్స్ (మీల్ మేకర్): 1 కప్పు

ఉల్లిపాయలు: 2

Advertisement

పచ్చిమిర్చి: 4-5 (చీలికలు)

అల్లం వెల్లుల్లి పేస్ట్: 2 స్పూన్లు

టమాటాలు: 2 (సన్నగా తరిగినవి)

పుదీనా, కొత్తిమీర తరుగు: అర కప్పు

మసాలా దినుసులు: బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, చెక్క, షాజీరా

గరం మసాలా: 1 స్పూన్

పసుపు: అర స్పూన్

కారం: రుచికి సరి పడా

నెయ్యి లేదా నూనె: 3-4 స్పూన్లు

ఉప్పు: తగినంత

నీరు: 3 కప్పులు

తయారీ విధానం:

1.ముందుగా ఒక గిన్నెలో.. నీళ్లు పోసుకుని బాగా మరిగించాలి. ఆ నీటిలో.. ఒక కప్పు సోయా చంక్స్ వేసి, స్టవ్ ఆఫ్ చేసి 10 నిమిషాలు మూత పెట్టాలి. ఆ తర్వాత వాటిని బయటకు తీసి, చల్లటి నీళ్లతో.. కడిగి,చేతులతో గట్టిగా పిండి నీరంతా తొలగించాలి. ఇలా చేయడం వల్ల సోయాలో ఉండే పచ్చి వాసన పోతుంది.

2: ఇప్పుడు ఒక కుక్కర్ లేదా.. మంద పాటి గిన్నె తీసుకుని, అందులో.. నెయ్యి ,నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, చెక్క, షాజీరా వేసి చిట పటలాడించాలి. ఆ తర్వాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిర్చి వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.

3.తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే.. వరకు వేయించాలి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న..సోయా చంక్స్ వేసి రెండు నిమిషాలు నూనెలో.. ఫ్రై చేయాలి. దీని వల్ల మసాలాలు సోయాలోకి బాగా పడతాయి. ఆ తర్వాత తరిగిన టమాటా ముక్కలు, పుదీనా, కొత్తిమీర వేసి టమాటాలు మెత్త బడే వరకు ఉడికించాలి.

Also Read: కేరళ స్టైల్ ప్రాన్స్ ఫ్రై..హోటల్ టేస్ట్ మించిపోయేలా ఇంట్లోనే ఇలా రెడీ చేయండి!

4. ఇప్పుడు పసుపు, కారం, గరం మసాలా, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత నానబెట్టి ఉంచుకున్న బాస్మతి బియ్యం నుంచి నీరు వంపేసి, ఆ బియ్యాన్ని కుక్కర్ లో వేయాలి. బియ్యం విరిగిపోకుండా మెల్లగా కలపాలి.

5.రెండు కప్పుల బియ్యానికి మూడు కప్పుల చొప్పున నీరు పోసి ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి మీడియం మంటపై 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. (సాధారణ గిన్నె అయితే మూతపెట్టి.. అన్నం పొడి పొడిలా వచ్చే వరకు ఉడికించాలి . ఆవిరి పూర్తిగా పోయిన.. తర్వాత మూత తీసి, నెయ్యి , కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. అంతే.. గుమఘుమలాడే టేస్టీ సోయా చంక్స్ పులావ్ రెడీ!

సోయా చంక్స్ లో శరీరానికి కావలసిన విటమిన్లు, మినరల్స్ , ముఖ్యంగా హై-ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. వెజిటేరియన్స్ కోసం ఇది ఒక సూపర్ ఫుడ్ లా పని చేస్తుంది. బరువు తగ్గాలనుకునే వారు, కండరాల బలం పెంచుకోవాలనుకునే.. వారు తమ డైట్ లో సోయా చంక్స్ ని భాగం చేసుకోవడం చాలా మంచిది. రోజూ తినే సాధారణ వంటకాలకు బదులుగా ఇలాంటి హెల్తీ అండ్ టేస్టీ పులావ్ చేసుకుంటే ఆరోగ్యం, రుచి రెండూ మీ సొంతమవుతాయి!

Related News

సండే స్పెషల్ గోంగూర మటన్ ఇగురు.. ఈ కొలతలతో చేస్తే రుచి అద్భుతంగా ఉంటుంది!

హైదరాబాద్‌లో 44వ అంతస్తులో వేలాడుతూ.. ఇతడి జీతం ఎంతో తెలుసా?

కేరళ స్టైల్ ప్రాన్స్ ఫ్రై..హోటల్ టేస్ట్ మించిపోయేలా ఇంట్లోనే ఇలా రెడీ చేయండి!

హోటల్ స్టైల్ కరివేపాకు చికెన్ ఫ్రై..టేస్ట్ అదిరిపోద్ది!

దీపావళికి ముందే ఈ 5 పనులు చేసేయండి.. పండగ రోజు అస్సలు టెన్షన్ ఉండదు!

లేఆఫ్ తర్వాత.. రెండేళ్ల కొడుకుతో ఆఫీసుకెళ్లిన ఉద్యోగి, చివరికి ఓ నిజం తెలుసుకున్నాడు

ప్రసవం తరువాత పెరిగిన బరువు తగ్గాలా? ఇంట్లోనే సులభంగా ఈ 3 వ్యాయామాలు చేయండి

Big Stories

Advertisement
×