E-Paper
Advertisement

లండన్ బుక్ స్టోర్స్ లో ఆ పుస్తకాలు ఏమయ్యాయి? సాలీ రూణీ వివాదం వెనుక అసలు నిజం!

లండన్ బుక్ స్టోర్స్ లో ఆ పుస్తకాలు ఏమయ్యాయి? సాలీ రూణీ వివాదం వెనుక అసలు నిజం!
Advertisement

Sally Rooney: లండన్ లోని ఒక ప్రముఖ బుక్ స్టోర్ కి వెళ్ళిన పాఠకులకు షాకింగ్ సీన్ ఎదురవుతుంది. అక్కడ ఒక ఫేమస్ రైటర్ రాసిన పుస్తకాలు కనిపించడం లేదు. ప్రభుత్వాలు బ్యాన్ చేయలేదు కోర్టులు అమ్మోదని ఆర్డర్స్ వేయలేదు. మరి ఆ బుక్స్ ఏమైపోయినట్టు..? ఆ రైటర్ ఎవరో కాదు గ్లోబల్ సెన్సేషన్ నార్మల్ పీపుల్ నవలలతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని అలరించిన సాలీ రూణీ. ఆమె రాసిన నవలల కాపీలు కేవలం బ్రిటన్ లోనే 10 లక్షలకు పైగా అమ్ముడయ్యాయి. ఆమె నవల ఆధారంగా బిబిసి తీసిన సిరీస్ కూడా పెద్ద సక్సెస్ అయింది. కానీ ఇప్పుడు అవే పుస్తకాలు బ్రిటన్ లో దొరకని పరిస్థితి. అసలు ఏం జరిగింది? ఒక సెలబ్రిటీ తీసుకున్న ఒక డెసిషన్ వారి కెరీర్ ను ఎలా కుదిపేస్తుంది?

బ్రిటన్ లో ఈ బుక్స్ దొరకకపోవడానికి రీజన్

Advertisement

బ్రిటన్ లో ఈ బుక్స్ దొరకకపోవడానికి రీజన్ ఆమె ఇచ్చిన ఒక స్టేట్మెంట్. సాలీ రూని తన పుస్తకాల అమ్మకాల ద్వారా వచ్చే రాయల్టీలను పాలస్తీన్ యక్షన్ అనే సంస్థకు విరాళంగా ఇస్తానని ప్రకటించారు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఆమె చారిటీ ఇస్తానన్న ఆ సంస్థను బ్రిటిష్ ప్రభుత్వం ఉగ్రవాద చట్టం కింద నిషేధించింది. ఇప్పుడు అక్కడే అసలైన చిక్కు వచ్చిపడింది. బ్రిటన్ చట్టాల ప్రకారం ఉగ్రవాద సంబంధిత లేదా నిషేధ జాబితాలో ఉన్న సంస్థలకు ఆ డబ్బును అందించడం చట్టపరంగా విరుద్ధం. మరోవైపు ఆ రాయల్టీ డబ్బును రచయిత్రికి ఇవ్వకుండా ఆమె పుస్తకాలను మార్కెట్లో అమ్ముకోవడం కూడా పబ్లిషింగ్ సంస్థ అయిన ఫేవర్ అండ్ ఫేవర్ కు సరైన నిర్ణయం అనిపించలేదు. ఏం చేయాలో తెలియక చివరికి సాలీ రూని అంగీకారంతోనే బ్రిటన్ లో ఆమె పుస్తకాల అమ్మకాలను అన్ని ఫార్మాట్లలో పూర్తిగా నిలిపి వేశారు.

ఇవి ఇండియాలో కూడా కొత్త ఏమీ కాదు..

Advertisement

ఈ ఘటన ఒక విషయాన్ని స్పష్టంగా అర్థమయ్యేలా చేస్తుంది. ఈ రోజుల్లో ఒకరి గొంతు నొక్కేయాలంటే ప్రభుత్వాలు నేరుగా రంగంలోకి దిగాల్సిన అవసరమే లేదు. పబ్లిషర్లు వెనక్కి తగ్గితే చాలు స్పాన్సర్లు తప్పుకుంటే చాలు. వేదికలు ఇచ్చే వాళ్ళు మాకు వద్దంటే చాలు. ఆ వ్యక్తి ఆటోమేటిక్ గా ఒంటరివాడైపోతాడు. ఇలాంటి పరిస్థితినే గత నెల అమెరికాలో ప్రముఖ రాపర్ మాకిల్ మోర్ కూడా ఫేస్ చేశారు. పాలస్తీనాకు మద్దతుగా మాట్లాడిన తర్వాత స్పాన్సర్లు స్టేడియం ఓనర్ల ఒత్తిడితో ఆయనను ఎడ్షిరన్ టూర్ నుంచి తొలగించారు. ఇక్కడ ఎవరు అధికారికంగా బ్యాన్ చేయలేదు కానీ ఒక్కొక్కరు దూరం జరగడంతో డీల్స్ పోయాయి. వేదికలు కరువయ్యాయి. సింపుల్ గా చెప్పాలంటే దీన్ని ఎవరు బాధ్యత వహించని సైలెంట్ సెన్సార్షిప్ అనొచ్చు. ఇండియాలో కూడా ఇది మనకు కొత్తేమి కాదు 2015 లో బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ దేశంలో అసహనం పెరుగుతుందంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఆయనపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. రాజకీయ నాయకులు తోటి నటులు అభిమానుల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. ఆయన బ్రాండ్ ఒప్పందాల పైన తీవ్ర చర్చ జరిగింది. ఆ ఒక్క ఘటన బాలీవుడ్ లోని చాలా మంది సెలబ్రిటీలకు ఓ పెద్ద లెసన్ లా మారింది. అనవసరంగా నోరు జాడడం కంటే మౌనంగా ఉండడమే బెటర్ అనే
అభిప్రాయానికి వచ్చారు చాలా మంది.

Also Read: విశాఖ రేంజ్ మారబోతోంది.. తూర్పు తీరంలో ఇక శాన్‌ఫ్రాన్సిస్కో మ్యాజిక్!

సాలీరూని నవలలు దేని గురించి ఉంటాయి?

ఈరోజు పెద్ద పెద్ద స్టార్లు ఒక సబ్బు యాడ్కో ఒక యాప్ యాడ్కో క్షణాల్లో కోట్ల రూపాయల రెమునరేషన్ కు ముందుకువస్తారు. కానీ దేశంలో జరుగుతున్న కీలకమైన సామాజిక రాజకీయ చర్చల దగ్గర మాత్రం వారి గొంతు పూర్తిగా మూగబోతుంది. యాడ్స్ కు ముఖం చూపించే సెలబ్రిటీలు ప్రజా సమస్యలపై ప్రశ్నలు అడగాల్సి వచ్చినప్పుడు మాత్రం ఎందుకు మౌనంగా ఉంటున్నారు? సాలీరూని నవలలు దేని గురించి ఉంటాయి? ప్రేమ సామాజిక వర్గాలు అధికారం మనుషుల మధ్య ఉండే సంబంధాలు నైతిక సంఘర్షణలు అందుకే పాఠకులు ఆమెను అంతగా ఇష్టపడ్డారు. ప్రపంచంతో మనకున్న సంబంధం అనేది మనం ఇష్టం వచ్చినప్పుడు వదిలేసే విషయం కాదు. మిగతా మానవాళ నుంచి మనం పూర్తిగా విడిపోలేం అంటే ఆమె 2019 లో మాట్లాడారు. మరి అదే రైటర్ తన మాటలను ఆచరణలో పెట్టాలని చూస్తే మాత్రం మనకు ఎందుకు కోపం వస్తుంది లండన్ లో ఆ బుక్ షెల్ఫ్స్ లో మిగిలింది ఇప్పుడు కేవలం ఒక ఖాళీ స్థలమే కావచ్చు. కానీ ఆ కాళీ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచింది. మనం పుస్తకాలు ఎందుకు చదువుతున్నాం , రైటర్స్ నుంచి ఏం ఆశిస్తున్నాం, వాళ్ళు మనల్ని ఆలోచింపజేయాలని కోరుకుంటూనే వాళ్ళు తమ అభిప్రాయాలను నిజ జీవితంలో ఆచరిస్తే మాత్రం మనం ఎందుకు వెనక్కి తగ్గుతున్నాం ఈ ప్రశ్నకు సమాధానం సాలీ రూనీ దగ్గర లేదు.

Tags

Related News

ఆస్ట్రేలియా వీసా కావాలా? భారతీయులకు నేటి నుంచి రూల్స్, ఆ రెండు చేయాల్సిందే

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కొత్త హెచ్చరిక.. ఇరాన్‌పై కొత్త దాడులు చేస్తాం, ఈ రోజు నుంచే మొదలు

మాల్దీవులు-పాకిస్తాన్ దోస్తీ.. భారత్‌పై దీని ప్రభావం ఎంత?

గాల్లోనే ఢీకొన్న రెండు సైనిక విమానాలు.. నలుగురు పైలట్లు దుర్మరణం!

కెన్యాలో కుప్పకూలిన 12 అంతస్తుల భారీ భవనం.. శిథిలాల కింద కూలీలు?

మరో ‘ఎపిక్ ఫ్యూరీ’కి సిద్ధం.. ఇరాన్‌కు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరిక!

ఖమేనీ బతికే ఉన్నారా? ఇరాన్‌ను నడిపిస్తోంది ఎవరు? సంచలన నిజాలు బయటపెట్టిన దౌత్యవేత్త!

Big Stories

Advertisement
×