E-Paper
Advertisement

2016 ఒప్పందంలో బిగ్ మిస్టెక్.. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ అసలు రూట్ మ్యాప్ ఇదే?

2016 ఒప్పందంలో బిగ్ మిస్టెక్.. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్ట్ అసలు రూట్ మ్యాప్ ఇదే?
Advertisement

Thummidihatti Barrage: ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల సాగు, తాగునీటి కలలను సాకారం చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన భగీరథ యజ్ఞానికి శ్రీకారం చుట్టారు. గత పాలకులు పక్కన పడేసిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టులో అత్యంత కీలకమైన తుమ్మిడిహెట్టి బ్యారేజీ పునరుద్ధరణకు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది. 2023లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపుతూ, మహారాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంతో పాటు కేంద్రం మధ్యవర్తిత్వానికి నిరంతర సమీక్షలు,సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సోమవార o (ముంబైలో) మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుపై అత్యంత కీలకమైన చర్చలు జరపనుంది.

చారిత్రక తప్పిదం.. పక్కకు పోయిన తుమ్మిడిహెట్టి..

2016 ఆగస్టు 23న అప్పటి తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్రతో కుదుర్చుకున్న ఒప్పందంలో తుమ్మిడిహెట్టి బ్యారేజీ నీటిమట్టాన్ని సరిగ్గా +148 మీటర్లకే పరిమితం చేసింది. ఆ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టుపైనే శ్రద్ధ చూపి, ఉత్తర తెలంగాణకు జీవనాడి అయిన తుమ్మిడిహెట్టిని పూర్తిగా పక్కన పడేసింది. తద్వార వెనుకబడిన ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల గిరిజన, రైతుసోదరులకు ఆశించిన స్థాయిలో సాగు, తాగునీరు అందకుండా తీవ్ర అన్యాయం జరిగింది. ఈ నేపధ్యంలో సీఎం రేవంత్ రెడ్డి చొరవతో మళ్లీ జీవం పోసుకుంటున్నది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే రేవంత్ రెడ్డి, అత్యంత వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాకు పూర్తిస్థాయిలో నీరందించే సంకల్పంతో ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించారు. అత్యధిక విద్యుత్ ఖర్చు లేకుండా గ్రావిటీ (గురుత్వాకర్షణ) ద్వారా గరిష్ఠ స్థాయిలో నీటిని తరలించాలంటే బ్యారేజీ ఎత్తు పెంపు అనివార్యమని గుర్తించారు. +148 మీటర్ల వద్ద ఆశించిన నీరు రాదని స్పష్టం కావడంతో, బ్యారేజీ ఎత్తును +152 మీటర్లకు పెంచేలా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించే దిశగా ప్రణాళికబద్ధమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.

2023 తర్వాత పునరుద్ధరణకు వరుస చర్యలు..

Advertisement

ప్రజా పాలన–ప్రజా విజయోత్సవాల’ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా హామీ ఇస్తూ, తుమ్మిడిహెట్టిని పునర్నిర్మించి ఆదిలాబాద్ పంట పొలాలకు నీరిస్తామని ప్రకటించారు.ప్రాజెక్టు నిర్మాణానికి ప్రభుత్వం సంపూర్ణంగా కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. 29 ఏప్రిల్ 2026 న తుమ్మిడిహెట్టి బ్యారేజీ కార్యాచరణ వేగవంతం చేయడంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తూ, మహారాష్ట్రతో తక్షణమే సంప్రదింపులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

Also read: ఏందయ్యా స్వామి ఫుల్ వీడియో సాంగ్ రిలీజ్.. విరోష్ కెమిస్ట్రీ అదుర్స్!

దేవేంద్ర ఫడ్నవీస్‌కు లేఖ..

Advertisement

అనంతరo06 మే 2026 న ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు లేఖ రాస్తూ చర్చలకు సమయం కోరారు. ఆ తర్వాత 26 మే 2026 న సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మహారాష్ట్ర సీఎంకు లేఖ రాశారు. బ్యారేజీ ఎత్తు, ముంపు ప్రభావం, అంతర్రాష్ట్ర అంశాలపై ముఖాముఖి చర్చల ద్వారా పరిష్కరించుకుందామని ప్రతిపాదించారు.ఇక 11 జూన్ 2026 రోజున కేంద్ర ప్రభుత్వం కలగజేసుకోవాలని కోరుతూ ప్రధానికి సీఎం లేఖ రాశారు. ప్రధాని కార్యాలయం కూడా ఈ అంశాన్ని కేంద్ర జల్‌శక్తి శాఖకు బదిలీ చేసింది.

గ్రావిటీ ద్వారా నీరు..

మరో వైపు 05 ఆగస్టు 2026 న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిశారు. సి డబ్ల్యూ పీ ఆర్ఎస్ పుణె నిర్వహించిన బ్యాక్‌వాటర్ అధ్యయనాలను అందించి, +150 నుండి +152 మీటర్ల వరకు ఎత్తు పెంచితే విద్యుత్ వ్యయం తగ్గి గ్రావిటీ ద్వారా నీరు అందుతుందని వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి, సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో అధికారుల సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఢిల్లీ కేంద్రం గా 01 సెప్టెంబర్ 2026 న కేంద్ర జల సంఘం ఛైర్మన్ అధ్యక్షతన ఢిల్లీలో తెలంగాణ, మహారాష్ట్ర ఉన్నతాధికారుల అంతర్రాష్ట్ర సాంకేతిక సమావేశం జరిగింది. అంతేగాక 03 సెప్టెంబర్ 2026 న పుణె లో నిర్వహించిన మీటింగు ఓ బ్యాక్‌వాటర్ అధ్యయనాలు, +148 నుండి +152 మీటర్ల వరకు వివిధ నీటిమట్టాల్లో ఉండే ముంపు వివరాలు, కాంటూర్ మ్యాపులను తెలంగాణ ప్రభుత్వం మహారాష్ట్ర జలవనరుల శాఖకు అధికారికంగా పంపింది.

ముంబైకి పయనం.. తుది ఘట్టానికి చర్చలు..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతర శ్రమ, ముందస్తు దౌత్య వ్యూహాల ఫలితంగా మహారాష్ట్ర ప్రభుత్వంతో ద్వైపాక్షిక చర్చల సమయం ఆసన్నమైంది. తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు ఇరిగేషన్ శాఖ మంత్రి, ఉన్నతాధికారుల ప్రతినిధి బృందం ముంబైకి బయల్దేరింది. నేడు జరగనున్న ఈ సమావేశంలో తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తు పెంపు, ముంపు పరి పరిహారం, సాంకేతిక అంశాలపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. తెలంగాణ రైతాంగ సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన ఈ ‘భగీరథ యజ్ఞం’ త్వరలోనే సాకారమై ఆదిలాబాద్ నేలలు సస్యశ్యామలం కానున్నాయని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Also read: జాతీయ రాజకీయాల్లో కేసీఆర్.. కేటీఆర్ సంచలన ప్రకటన!

Tags

Related News

తెలంగాణలో బీజేపీ బిగ్ ప్లాన్.. కాంగ్రెస్‌ను నిలదీసేందుకు వేసిన ప్లాన్ ఇదే?

ఫలించిన రేవంత్‌ దౌత్యం! తుమ్మిడిహెట్టి రీ డిజైన్‌తో జఠిల సమస్యను పరిష్కరించే దిశగా..! కేసీఆర్ చేతులెత్తేసిన చోటే..తాను సాధించే దిశగా అడుగులు..!

జాతీయ రాజకీయాల్లో కేసీఆర్.. కేటీఆర్ సంచలన ప్రకటన!

ఎమ్మెల్సీ ఎన్నికల్లో పొత్తు వద్దే వద్దు..! అతన్ని చూసి ఇక్కడ ఓట్లేసే సీన్ లేదు..!?

ఆకాశంలో రెక్కలు విప్పి ఎగిరే చేప.. దీని వెనుక ఉన్న అద్బుత రహస్యం ఇదే?

కూటమిలో కుమ్ములాట.. బరిలోకి దిగేదెవరు? ఇంకా క్లారిటీ ఇవ్వని పెద్దలు!

స్వేచ్ఛ చెప్పిందే నిజమైందా.. హెచ్‌సీఏ కుంభకోణంలో షాకింగ్ నిజాలు!

Big Stories

Advertisement
×