E-Paper
Advertisement

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్
Advertisement

America: వలసవాదులను అమెరికా నుంచి తరిమేసేందుకు అధ్యక్షుడు ట్రంప్ చేస్తు్న్న ప్రయత్నాలకు కాలం కలిసి రాలేదు. ఏదో విధంగా కోర్టులు ఆయనకు మొట్టికాయలు పెడుతున్నాయి. తాజాగా బర్త్ రైట్ సిటిజన్ షిప్ విషయంలో ట్రంప్‌కు మళ్లీ ఝలక్ తగిలింది. జన్మత:పౌరసత్వం లభించడంపై పరిమితులు విధిస్తూ జారీ చేసిన ఉత్తర్వులను యూఎస్‌ డిస్ట్రిక్ట్ కోర్టు నిలిపివేసింది.

 

అమెరికాలో బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం

Advertisement

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మరోసారి న్యాయస్థానంలో ఎదురు దెబ్బ తగిలింది. జన్మతః పౌరసత్వం విషయంలో పరిమితులు విధిస్తూ ఆయన జారీ చేసిన ఉత్తర్వులను యూఎస్‌ డిస్ట్రిక్ట్ కోర్టు నిలిపివేసింది. అమెరికా సుప్రీంకోర్టు ఒకసారి ఆ ప్రయత్నాన్ని తిరస్కరించిన తర్వాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ జారీ చేసిన కొత్త ఉత్తర్వును నిలిపివేసింది. పుట్టుకతో వచ్చే పౌరసత్వానికి అర్హులైన వారి సంఖ్యను పరిమితం చేసేందుకు తీసుకొచ్చిన కొత్త ఉత్తర్వు అమలు చేయకుండా ట్రంప్ ప్రభుత్వానికి ఫెడరల్ కోర్టు బ్రేక్ వేసింది.

 

ట్రంప్ ప్రభుత్వానికి న్యాయస్థానం ఝలక్

Advertisement

మేరీల్యాండ్‌లోని గ్రీన్‌బెల్ట్‌లో ఉన్న యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్టు.. వలసదారుల హక్కుల కార్యకర్తల అభ్యర్థన మేరకు ఒక తాత్కాలిక నిషేధాలను జారీ చేసింది. ఈ కార్యకర్తలు గత సంవత్సరం పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని పరిమితం చేసే ట్రంప్ ప్రభుత్వం గతేడాది తొలి కార్యనిర్వాహక ఉత్తర్వును అమలు చేయకుండా నిరోధిస్తూ తీర్పును పొందారు. 1868లో అమెరికా ఆమోదించిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఆదేశంలో పుట్టేవారు వారి తల్లిదండ్రులు అక్రమంగా లేదా తాత్కాలికంగా ఉంటున్నా సరే అమెరికా పౌరసత్వం లభిస్తుందని పేర్కొంది.

ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వలసలను తగ్గించుకునేందుకు కొత్త చట్టాలను పదునుపెట్టారు. ఈ క్రమంలో బర్త్ టూరిజం చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, దేశానికి అవమానకరమన్నది ట్రంప్ వాదన. పుట్టబోయే బిడ్డకు విదేశీ పౌరసత్వం పొందాలనే లక్ష్యంతో నెలలు నిండే సమయంలో గర్భిణీలు వేరే దేశాల నుంచి అమెరికాకు ప్రయాణించి అక్కడ ప్రసవించడాన్ని బర్త్ టూరిజంగా పేర్కొంటున్నారు.

ALSO READ: ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

Related News

చర్చిలో తీవ్ర విషాదం.. ప్రార్థన చేస్తుండగా పాస్టర్‌పై పడ్డ భారీ శిలువ.. వీడియో వైరల్!

నోరు విప్పిన జేడీ వాన్స్.. భారత్ విషయంలో నోరు జారాను, అది సరైనది కాదని క్లారిటీ

మంటల్లో ఫ్రాన్స్‌.. రోడ్లపైకి లక్షల్లో నిరసనకారులు, భవనాలు దగ్దం, షాపులు లూఠీ

షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. ఆకట్టుకున్న ప్రత్యేక ప్రదర్శనలు!

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

Big Stories

Advertisement
×