E-Paper
Advertisement

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!
Advertisement

Hindu Temple: పాకిస్తాన్‌లోని తూర్పు పంజాబ్ ప్రావిన్స్‌లో సుమారు 125 సంవత్సరాల నాటి పురాతన హిందూ ఆలయాన్ని కూల్చివేయడం తీవ్ర కలకలం రేపుతోంది. సమీపంలో ఉన్న ఒక మదర్సా విస్తరణ కోసమే ఈ ఆలయాన్ని ధ్వంసం చేశారని ఆరోపిస్తూ స్థానిక హిందువులు, మైనారిటీ సంఘాలు పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తాయి. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించి.. ఆలయాన్ని యథాస్థానంలో పునర్నిర్మించాలని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.

అసలేం జరిగిందంటే?

లాహోర్‌కు దాదాపు 130 కిలోమీటర్ల దూరంలో ఉన్న నరోవాల్ జిల్లాలోని సిరాజ్ గ్రామంలో ఈ పురాతన ఆలయం ఉండేది. సుమారు 1,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆలయాన్ని ఆగస్టు 21న ‘తెహ్రీక్-ఇ-లబ్బైక్ పాకిస్తాన్’ (TLP) అనే నిషేధిత తీవ్రవాద సంస్థకు చెందిన కొందరు వ్యక్తులు కూల్చివేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పక్కనే ఉన్న ఇస్లామిక్ పాఠశాల విస్తరణలో భాగంగానే ఈ దారుణానికి ఒడిగట్టారని వారు పేర్కొన్నారు. కూల్చివేత అనంతరం ఆలయ శిఖరానికి ఉన్న లోహపు భాగాలు, ఇటుకలు, ఇతర నిర్మాణ సామగ్రిని కూడా అక్కడి నుండి మాయం చేశారని తెలిపారు.

అధికారుల వైఫల్యంపై ఆగ్రహం

Advertisement

ఈ ఘటనను స్థానిక రాజకీయ పార్టీ పాకిస్తాన్ మసీహా మిల్లత్ పార్టీ (PMMP) తీవ్రంగా తప్పుబట్టింది. ఆ పార్టీ ఛైర్మన్ అస్లాం పర్వేజ్ సహోత మాట్లాడుతూ.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక యంత్రాగానికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఆలయానికి చెందిన భూమిని గతంలో ‘ఎవాక్యుయీ ట్రస్ట్ ప్రాపర్టీ బోర్డ్’ (ETPB) మదర్సా కోసం లీజుకు ఇచ్చిందని, అయితే అద్దె చెల్లించకపోవడంతో జనవరి 29నే ఆ లీజును రద్దు చేస్తూ ఆక్రమణదారులను ఖాళీ చేయించాలని ఆదేశాలు ఇచ్చారని ఆయన గుర్తుచేశారు. కానీ అధికారులు ఆ ఉత్తర్వులను అమలు చేయకపోవడం వల్లే ఈ కూల్చివేత జరిగిందని ఆరోపించారు.

బిక్కుబిక్కుమంటోన్న హిందూ కమిటీ

మరోవైపు అక్కడి హిందూ సంఘం నేత రతన్ లాల్ మాట్లాడుతూ.. జిల్లా యంత్రాంగం, ఈటీపీబీ ఆలయాన్ని పరిరక్షించడంలో పూర్తిగా విఫలమయ్యాయని మండిపడ్డారు. ప్రస్తుతం అక్కడ ఉన్న మదర్సా వల్ల.. స్థానిక హిందూ కమిటీ సభ్యులు ఆ స్థలాన్ని సందర్శించడానికి కూడా భయపడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Also Read: నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

వర్షాల వల్లే కూలిందన్న ప్రభుత్వం

అయితే హిందూ సంఘాల ఆరోపణలను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. భారీ వర్షాల కారణంగానే ఈ పాత భవనం కూలిపోయిందని ఈటీపీబీ సీనియర్ అధికారి రాణా ఇఫ్తికార్ తెలిపారు. ఆలయ భూమిని ఎవరికీ లీజుకు ఇవ్వలేదని ఆయన స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఈ ప్రాంతంలో ఆలయ భద్రతపై ముప్పు ఉందనే విషయం స్థానిక పోలీసులకు ముందుగానే తెలుసని ఆయన పేర్కొన్నారు. అటు ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి ఉన్నతాధికారులు త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని ఈటీపీబీ తెలిపింది.

Also Read: BSNL కనివిని ఎరుగని ప్లాన్స్.. రోజుకు రూ.5 మాత్రమే.. 80 రోజులపాటు మీ ఇష్టం!

Tags

Related News

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

రష్యాను కుదిపేసిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలు 7.0 గా నమోదు, నష్టంపై ఇంకా..

బలవంతంగా డ్రగ్స్‌ ఎక్కించి.. ఎఫ్ఐటీ విద్యార్థినిపై అత్యాచారం, అమెరికాలో షాకింగ్ ఘటన

పాఠశాలలో ఓ టీనేజర్ దారుణం.. గన్‌తో కాల్పుల మోత, టీచర్ సహా నలుగురు మృతి, అమెరికాలో ఘటన

హోర్ముజ్ జలసంధిలో బాంబుల శబ్దాలు.. పేలుతున్న మైన్స్-మునిగిన షిప్, అసలేం జరిగింది?

అతిపెద్ద చమురు సంస్థ అరామ్కోపై క్షిపణి దాడి.. హౌతీ దూకుడుతో సౌదీకి వణుకు

తన బొమ్మలకు పని చెప్పిన కిమ్.. క్షిపణులతో డిష్యుం డిష్యుం.. పొరుగు దేశాల్లో కలవరం!

ఫ్లైట్ కోసం ఎదురుచూస్తుంటే.. తలపై పడ్డ బాంబు, ఇండియన్స్‌తో పాటు 13 మంది…

Big Stories

Advertisement
×