E-Paper
Advertisement

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని
Advertisement

West Asia Tensions: పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. నెల రోజుల విరామం తర్వాత ఇరాన్ సైనిక స్థావరాల లక్ష్యంగా దాడులు దిగాయి అమెరికా బలగాలు. ఈ దాడులతో మళ్లీ ఉద్రిక్తత పరిస్థితులు మొదలయ్యాయి. ఈ దాడుల్లో ఓ చిన్నారి సహా నలుగురు మృతి చెందినట్టు ఇరాన్ వెల్లడించింది. అసలు దాడులు జరగడం వెనుక ఏం జరిగింది?

 

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు

Advertisement

మధ్యప్రాచ్యంలో నెల రోజుల నిశ్శబ్దం తర్వాత యుద్ధం అలజడి మళ్లీ మొదలైంది. అమెరికా వరుసగా రెండో రోజు ఇరాన్‌లోని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్-IRGC స్థావరాలపై మెరుపుదాడులు చేసింది. దీనికి ప్రతిస్పందనగా ఇరాన్.. జోర్డాన్‌లోని అమెరికాకు చెందిన ఎయిర్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. ప్రిన్స్ హసన్ ఎయిర్ బేస్‌, మెరైన్ బేస్‌లపై బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది.

 

ఇరాన్ సైనిక స్థావరాలపై అమెరికా దాడి,  యూఎస్ స్థావరాలపై ఇరాన్ దాడి

Advertisement

దీంతో ఆయా నగరాలు దాడులతో దద్దరిల్లాయి. అలాగే బహ్రెయిన్‌పై డ్రోన్ దాడి, కువైట్‌పై కూడా దాడులు చేసింది. ప్రయోగించిన 13 క్షిపణులలో పదింటిని జోర్డాన్ అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో అమెరికా సైనికులు మరణించారన్న ఐఆర్‌జిసి వాదనను అమెరికా తోసిపుచ్చింది. వాస్తవానికి సెంట్రల్ కమాండ్- సెంట్‌కామ్ తన ప్రకటనలో ప్రాణనష్టం గురించి ప్రస్తావించలేదు.

మంగళవారం హోర్ముజ్ జలసంధి సమీపంలో ఐఆర్‌జిసి లక్ష్యాలపై అమెరికా దాడి చేయడంతో ఘర్షణ తీవ్రమైంది. వాణిజ్య నౌకలు, అక్కడ మోహరించిన అమెరికా సైనికులపై ఇరాన్ దాడికి ప్రయత్నించినందుకు ప్రతిస్పందనగా మంగళవారం సాయంత్రం ఈ ఆపరేషన్ ప్రారంభమైందని అమెరికా సెంట్రల్ కమాండ్ పేర్కొంది.

ఇరాన్ ప్రభుత్వ మీడియా నివేదికల ప్రకారం.. ఖేష్మ్ ద్వీపం, బందర్ అబ్బాస్, చబహార్, జాస్క్, సిరిక్, కొనరాక్, లవాన్‌ ప్రాంతాలు పేలుళ్లు సంభవించాయి. జిరోఫ్ట్ నగరంలోని ఓ విమానాశ్రయంపై దాడి జరిగినట్లు తెలిసింది. సిరిక్ నుండి వచ్చి వివాహ వేడుక జరుగుతున్న ఇంటిపై అమెరికా సైన్యం దాడి చేసినట్టు తెలిపింది. ఇరాన్ రెడ్ క్రెసెంట్ నివేదిక మేరకు.. ఓ చిన్నారితో సహా కనీసం నలుగురు మరణించగా, 50 మందికి పైగా గాయపడ్డారు.

అది పెద్ద దాడి అన్న ట్రంప్, గుణపాఠం తప్పదన్న మొజ్తబా

దాడులకు ముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ విధంగా చెప్పారు. ట్రూత్ సోషల్‌లో పెట్టిన పోస్ట్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అతిపెద్ద దాడి జరగబోనుందని ఇరాన్‌ను హెచ్చరించారు. ఐఆర్‌జీసీ లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. దాడుల తర్వాత ఇరాన్ సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ తన తొలి సందేశాన్ని ఇచ్చారు. తమ బలగాలు వాషింగ్టన్‌కు ఎన్నటికీ మరచిపోలేని గుణపాఠాలు నేర్పాయి, నేర్పుతాయని హెచ్చరించారు. దురాక్రమణలకు దిగితే శిక్ష తప్పదని, అమెరికా పశ్చాత్తాపపడే పరిస్థితి వస్తుందని ఐఆర్‌జీసీ ప్రతినిధి హొస్సేన్ మొహెబి హెచ్చరించారు.

ALSO READ: పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

 

Related News

ట్రంప్ మామ గిమ్మిక్కులు.. గెలుపు కోసం చమక్కులు, ఈ తీట పనులు అందుకేనా?

19 ఏళ్లు చనిపోయినట్లు నమ్మించిన కేటుగాడు.. ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎంట్రీతో అడ్డం తిరిగిన కథ!

భారత్‌కు బిగ్ రిలీఫ్.. 100% టారిఫ్‌ల చట్టాన్ని నిలిపివేసిన డొనాల్డ్ ట్రంప్!

రష్యా సైన్యంలో ఉక్రెయిన్‌ ఏజెంట్.. 300 మంది సైనికుల్ని లేపేసి.. దేశం దాటేసిన యువ అధికారి!

రష్యాను కుదిపేసిన భారీ భూకంపం.. రిక్టర్ స్కేలు 7.0 గా నమోదు, నష్టంపై ఇంకా..

బలవంతంగా డ్రగ్స్‌ ఎక్కించి.. ఎఫ్ఐటీ విద్యార్థినిపై అత్యాచారం, అమెరికాలో షాకింగ్ ఘటన

పాఠశాలలో ఓ టీనేజర్ దారుణం.. గన్‌తో కాల్పుల మోత, టీచర్ సహా నలుగురు మృతి, అమెరికాలో ఘటన

హోర్ముజ్ జలసంధిలో బాంబుల శబ్దాలు.. పేలుతున్న మైన్స్-మునిగిన షిప్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×