E-Paper
Advertisement

Delcy Rodríguez: గత పంచాయితీలు పక్కనవెట్టి.. మాతోని కలిసి ప‌ని చేయండి.. అమెరికాకు రోడ్రిగ్జ్ ఓపెన్ ఆఫర్

Delcy Rodríguez: గత పంచాయితీలు పక్కనవెట్టి.. మాతోని కలిసి ప‌ని చేయండి.. అమెరికాకు రోడ్రిగ్జ్ ఓపెన్ ఆఫర్
Advertisement

Delcy Rodríguez: వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా బలగాలు అదుపులోకి తీసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఈ ఘటనపై మొదట్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ దేశ యాక్టింగ్ ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగ్జ్, ప్రస్తుతం తన వైఖరిని మార్చుకున్నారు. ట్రంప్ ప్రభుత్వంతో సయోధ్య కుదుర్చుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో.. “అంతర్జాతీయ చట్టాల పరిధిలో, ఉమ్మడి అభివృద్ధి లక్ష్యంగా సహకార అజెండాపై పనిచేయడానికి అమెరికా ప్రభుత్వానికి ఆహ్వానం పలుకుతున్నాం” అని ఈ మేరకు తమ దేశంతో కలిసి పనిచేయాలని అమెరికాను కోరారు.

శనివారం మదురోను అమెరికా బలగాలు అదుపులోకి తీసుకున్న వెంటనే డెల్సీ తీవ్రంగా స్పందించారు. అయితే, కేవలం కొన్ని గంటల్లోనే ఆమె మాట‌ మార్చడం వెనిజులా రాజ‌కీయ నాయ‌కుల‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. మరోవైపు, వెనెజువెలాను నడిపించేందుకు అమెరికా అధికారుల బృందం ఉంటుందని, వారితో కలిసి డెల్సీ రోడ్రిగ్జ్ పని చేస్తారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇదే సమయంలో ఆయన డెల్సీకి గట్టి హెచ్చరిక కూడా జారీ చేశారు. “ఆమె సరిగ్గా వ్యవహరించకపోతే, మదురో కంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.” అని వ్యాఖ్యానించారు. దేశ పునర్నిర్మాణానికి ఆయిల్ నిల్వలపై అమెరికాకు పూర్తి ఆధిపత్యం అవసరమని ట్రంప్ పునరుద్ఘాటించారు.

Advertisement

అమెరికాను సామ్రాజ్యవాద ముప్పుగా భావించే వెనెజువెలా ప్రభుత్వంలోని కఠిన వైఖరి గల నాయకులు, డెల్సీ తాజా నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశం ఉంది. సోమవారం నేషనల్ అసెంబ్లీలో కొత్త చట్టసభ్యుల ప్రమాణ స్వీకారం జరగనుండటంతో డెల్సీ పట్టుపై స్పష్టత రానుంది. కాగా, మదురోను సోమవారం న్యూయార్క్ కోర్టులో హాజరుప‌రుచ‌నున్నారు.

Read Also: అమెరికా కస్టడీలో మదురో.. సైనికులతో ఉన్న ఫొటో వైరల్.. సద్దాం హుస్సేన్ తర్వాత

Related News

విఫలమైన సామూహిక సున్తీలు.. 43 మంది బాలురు మృతి, దక్షిణాఫ్రికాలో ఘటన

ట్రంప్‌‌కు ఊహించని షాక్‌.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ వ్యవహారం.. కొత్త ఆదేశాలకు కోర్టు బ్రేక్

ఇస్తాంబుల్ తీరంలో ఘోరం.. రెండు టర్కీ నౌకలు ఢీ, 10 మంది గల్లంతు!

ప్రియుడితో భార్య రొమాన్స్.. రోబో వాక్యూమ్ క్లీనర్‌ను వాడిన భర్త, చివరికి జైల్లో…

నేపాల్ వరదల గురించి ముందే చెప్పిన బాబా వంగా.. తరువాత జరుగబోయేది ఇదే

పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు.. ఇరాన్ స్థావరాలపై అమెరికా దాడి, గుణపాఠం చెబుతాం-మొజాబ్తా ఖమేని

పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

నేపాల్ జలప్రళయం.. ఒకే ఇంట్లో 24 మృతదేహాలు.. 1000 దాటిన మరణాలు!

Big Stories

Advertisement
×