E-Paper
Advertisement

Maduro In US Custody: అమెరికా కస్టడీలో మదురో.. సైనికులతో ఉన్న ఫొటో వైరల్.. సద్దాం హుస్సేన్ తర్వాత

Maduro In US Custody: అమెరికా కస్టడీలో మదురో.. సైనికులతో ఉన్న ఫొటో వైరల్.. సద్దాం హుస్సేన్ తర్వాత

Maduro In US Custody: వెనిజులాపై అమెరికా వైమానిక దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడి అనంతరం వెనిజులా అధ్యక్షుడు మదురోను, ఆయన సతీమణిని అమెరికా బలగాలు కస్టడీలోకి తీసుకున్నాయి. నికోలస్ మదురో తమ కస్టడీలో ఉన్న అమెరికా నిర్థారించింది. యూఎస్ సైనికుల అదుపులోన్న మదురో ఫొటో వైరల్ అవుతోంది. ఈ ఫొటోకు సంబంధించి ఇరుదేశాలు ఎలాంటి నిర్థారణ చేయలేదు.

వెనిజులా రాజధాని కరాకస్‌పై అమెరికా భీకరదాడులు చేసింంది. అనంతరం ఆ దేశాధ్యక్షుడు మదురోను కస్టడీలోకి తీసుకుంది. ఈ విషయాన్ని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు. నికోలస్ మదురో, ఆయన సతీమణి తమ కస్టడీలో ఉన్నారని తెలిపారు. వారిద్దరిని వెనిజులా నుంచి తరలించామన్నారు.

అమెరికా బంధించిన దేశాధినేతలు

  • నికోలస్ మదురో (వెనిజులా)-2026
  • సద్దాం హుస్సేన్ (ఇరాక్)-2003
  • ఎమిలియో అగ్యునాల్డో (ఫిలిప్పీన్స్)-1901
  • మాన్యుయెల్ నోరిగా (పనామా)-1990
  • జీన్-బెర్ట్రాండ్ అరిస్టైడ్ (హైతీ)-2004

నిర్థారించిన ట్రంప్

వెనిజులా అధ్యక్షుడిని బంధించిన విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. అమెరికా సైన్యానికి చెందిన డెల్టా ఫోర్స్‌ ఈ ఆపరేషన్‌ చేపట్టింది. వెనిజులా అధ్యక్షుడిని అమెరికా కస్టడీలోకి తీసుకోవడంపై ఆ దేశ ఉపాధ్యక్షుడు డెల్సీ రోడ్రిగ్జ్‌ స్పందించారు. మదురో, ఆయన సతీమణి ఎక్కడున్నారో తెలియడంలేదన్నారు. వారు సజీవంగా ఉన్నారని తెలియజేసేలా ఆధారాలు చూపాలని అమెరికాను డిమాండ్ చేశారు.

1989లో పనామాపై దాడి చేసిన అమెరికా.. మిలిటరీ నేత మాన్యుయెల్‌ నోరిగాను పదవి నుంచి తప్పించింది. ఆ తర్వాత తాజాగా లాటిన్ అమెరికా దేశాలపై దాడికి దిగింది. ఈ పరిణామాల నేపథ్యంలో వెనిజులా పక్కదేశమైన కొలంబియా అలర్ట్ అయింది. సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరించింది.

మదురో టార్గెట్ వెనుక

మదురో అమెరికాకు వలసలను ప్రోత్సహిస్తున్నారని, మాదక ద్రవ్యాల గ్యాంగ్ లను పెంచి పోషిస్తున్నారని ట్రంప్‌ ఆరోపిస్తున్నారు. వెనిజులా జైళ్లు, పిచ్చాసుపత్రులను ఖాళీ చేయించి వారిని అమెరికాకు వెళ్లేలా ప్రోత్సహిస్తున్నారని ట్రంప్‌ ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలను మదురో ప్రభుత్వం ఖండించింది.

అసలు విషయం ఏంటంటే?

అయితే అమెరికా అసలు కన్ను.. వెనిజులా చమురు నిల్వలేనని విశ్లేషకులు అంటున్నారు. అత్యధిక చమురు నిల్వలు కలిగిన దేశాల్లో ఒకటైన వెనిజులా.. అమెరికా, యూరప్ దేశాల ఆంక్షలతో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో అక్కడి చమురును తన సొంత చేసుకునేందుకు ట్రంప్‌ పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్‌ రవాణాను తెరపైకి తెచ్చి మదురోను పదవి నుంచి దిగిపోవాలని కోరారు.
ఆ దేశాధ్యక్షుడిని అరెస్టు చేసేందుకు సహకరిస్తే రూ.450 కోట్లు ఇస్తానని రివార్డు ప్రకటించారు.

ప్రతిపక్ష నేతకు, ట్రంప్ మధ్య సంబంధాలు

వెనిజులా ప్రతిపక్ష నేత కొరినా మచాడోకు, ట్రంప్‌నకు మధ్య రాజకీయ సంబంధాలు ఉన్నట్లు సమాచారం. అమెరికా చర్యలకు ఆమె బహిరంగంగానే మద్దతు తెలుపుతున్నారు. ఆమెకు ఇటీవల నోబెల్‌ శాంతి వచ్చింది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ ఫోన్‌లో మాట్లాడుకున్నారు. ఇంతలో అమెరికా సైన్యం నేరుగా రంగంలోకి దిగి మదురోను అరెస్టు చేయడం కలకలం రేపుతోంది.

Also Read : వెనిజులాపై బాంబులతో విరుచుపడిన అమెరికా.. అధ్యక్షుడు మదురో కిడ్నాప్

వెనిజులాలో సంబరాలు

వెనిజులాలో ప్రజలు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకుంటున్న.. వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మదురో పోస్టర్లను తొలగిస్తున్నారు. ప్రజలు మదురో ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. నినాదాలు చేస్తూ వీధుల్లోకి వస్తున్నారు.

Related News

Big Shock To Trump: ట్రంప్‌కు ఊహించని ఝలక్.. షాకిచ్చిన వార్ పవర్స్, ఆపరేషన్ ‘ఎపిక్ ఫ్యూరీ’ క్లోజ్

Kuwait Airport: ఇరాన్ మిస్సైళ్ల దాడులు.. కువైట్‌ ఎయిర్‌పోర్ట్ డ్యామేజ్, విమాన సర్వీసులు రద్దు

మరో బాంబ్‌ పేల్చిన అమెరికా.. భారత్‌పై అదనపు సుంకాలకు ప్రతిపాదన, ఏకంగా 12 శాతం

పశ్చిమాసియాలో మళ్లీ యుద్ధ మేఘాలు.. అమెరికా స్థావరాలపై ఇరాన్ వరుస దాడులు, ఖేష్మ్ ద్వీపంపై

ఇరాన్ షాకింగ్ నిర్ణయం.. ఇకపై మాటలు-చర్చల్లేవ్, హోర్మూజ్ జలసంధి మాటేంటి?

ఇరాన్‌లో ఇంటిపోరు మొదలైందా? అధ్యక్షుడు మసూద్‌ నిర్ణయం వెనుక, అసలేం జరుగుతోంది?

రూటు మార్చిన అమెరికా.. ఇరాన్‌పై మెరుపు దాడులు, రాడార్- డ్రోన్ వ్యవస్థలు డ్యామేజ్

హోర్ముజ్ జలసంధిలో హై టెన్షన్.. ఇరాన్ సైనిక క్యాంప్‌పై అమెరికా దాడి, కవ్వింపు చర్యలు డీల్ కోసమా?

Big Stories

×