BigTV English

Biden nearly Kisses Woman: మహిళకు ముద్దుపెట్టబోయిన బైడెన్.. ఇంతలోనే భార్య చూసి..

Biden nearly Kisses Woman: మహిళకు ముద్దుపెట్టబోయిన బైడెన్.. ఇంతలోనే భార్య చూసి..

Joe biden nearly kisses woman in Viral Video: అమెరికాలో ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులు ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. ఈ క్రమంలో పలు సంఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ట్రంప్‌తో జరిగిన డిబేట్‌లో బైడెన్ తడబడడం, పలు సందర్భాల్లో ఆయన కదలకుండా అలాగే ఉండిపోవడం.. మరోవైపు ట్రంప్‌పై కాల్పులు జరగడం.. ఇలా పలు సంఘటనలు చోటు చేసుకున్నాయి. బైడెన్ అభ్యర్థిత్వంపై ఆది నుంచి విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలంటూ పలు డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. అందుకు ఆయన ఆరోగ్యం, వయోభార సమస్యలు అంటూ డెమోక్రాట్లు ప్రధాన కారణంగా చూపిస్తున్నారు. ఈ క్రమంలో మరో సంఘటన చోటు చేసుకుంది. బైడెన్‌కు సంబంధించిన మరో పాత వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బైడెన్ ఓ మహిళను ముద్దు పెట్టుకోబోయినట్లుగా ఆ వీడియోలో కనిపిస్తుంది. ఇంతలోనే ఆయనను పక్కకు తీసుకెళ్లారు.


అయితే, ఈ వీడియో ఎప్పటిదన్నది మాత్రం తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నెట్టింట భారీగా వైరల్ అవుతోంది. ఓ కార్యక్రమంలో బైడెన్ సదరు మహిళతో మాట్లాడుతూ.. ఉన్నట్టుండి ఆమె వద్దకు వెళ్లారు. దాదాపు ఆ మహిళను ముద్దు పెట్టుకోబోయే పరిస్థితిలో కనిపించారు. అదే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సతీమణి జిల్ దాన్ని గమనించి వెంటనే బైడెన్‌ను అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్తూ కనిపిస్తున్న దృశ్యాలను ఆ వీడియోలో చూడొచ్చు. ఆ తరువాత పక్కనే ఉన్నటువంటి భద్రతా సిబ్బంది ఆ మహిళను అక్కడి నుంచి పంపించివేశారు.

Also Read: మైక్రోసాఫ్ట్ ఎర్రర్.. ప్రపంచమంతా ఎఫెక్ట్


కాగా, ఇప్పటికే బైడెన్ ఆరోగ్యానికి సంబంధించి పలు అనుమానాలు వ్యక్తమవుతున్న ఈ సందర్భంలో ఈ వీడియో బయటకు రావడంతో పెద్ద ఎత్తున చర్చనీయాంశమయ్యింది. అయితే, ప్రస్తుతం అధ్యక్షుడు కోవిడ్ కారణంగా క్వారెంటైన్‌లో ఉన్నారు. వైరస్ నుంచి పూర్తిగా కోలుకున్న తరువాత అధ్యక్ష రేసులో తాను కొనసాగే అంశంపై స్పష్టతనివ్వనున్నారని టాక్. ఆ పదవి నుంచి ఆయన దాదాపుగా వైదొలిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags

Related News

Nepal Crisis: నేపాల్ ఆర్మీ వార్నింగ్.. విధ్వంసానికి పాల్పడితే కఠిన చర్యలు, కొత్త ప్రధాని ఆయనే?

Nepal Agitation: మనుషులను తగలబెట్టేసేంతగా ‘సోషల్ మీడియా’లో ఏం ఉంది? నిబ్బాల చేతిలో నేపాల్?

Nepal: నేపాల్‌లో ఇది పరిస్థితి.. ఆర్థిక మంత్రిని నడిరోడ్డుపై వెంబడించి.. కొడుతూ, తన్నుతూ.. వీడియో వైరల్

Gen Z Movement: దారుణం.. నేపాల్ మాజీ ప్రధాని భార్యను తగలబెట్టేసిన నిరసనకారులు

US-Pak: పాకిస్తాన్ లో అమెరికా ఖనిజాన్వేషణ.. భారత్ కి చెక్ పెట్టేందుకేనా?

Nepal Revolt: నేపాల్‌ అధ్యక్షుడు, పీఎం ఇళ్లకు నిప్పు, హెలికాఫ్టర్ల ద్వారా నేతల తరలింపు.. ప్రధాని రాజీనామా

Big Stories

×