BigTV English

Ashoka Trees : అశోక చెట్లు ఇంట్లో పెంచుకోకూడదా…

Ashoka Trees : అశోక చెట్లు ఇంట్లో పెంచుకోకూడదా…

Ashoka Trees : మనుషులకి సృష్టిలో అత్యంత రక్షణ కలిగించే దేవతులు ఎవరైనా ఉన్నారంటే అవే చెట్లు. మానవులకు నిజమైన దేవతలు చెట్లే. ఏ మొక్కలనైనా ఇంట్లో పెంచుకోవచ్చు. కాని సరైన దిశలో పెంచాలి. నిటారుగా పొడుగ్గా పెరిగే అశోక చెట్లు ఇంటికి అందాన్ని కూడా ఇస్తుంటాయి. మరి అలాంటి చెట్లను పెంచుకోవచ్చా లేదా అన్న సందేహాలు ఉన్నాయి. అశోక చెట్టు బాధలు, కష్టాలను తిప్పికొట్టడానికి సహాయపడుతుంది, తద్వారా శ్రేయస్సును తెస్తుంది. అందువల్ల అది వరండాలో నాటాలి. మీకు స్థలం తక్కువగా ఉన్నట్లయితే, మీ ఇంటి డాబాపై ఒక కుండలో అశోక వృక్షాన్ని ఉంచాలని వాస్తు చిట్కాలు సూచిస్తున్నాయి.


అశోక చెట్టను సీతా అశోకం అని కూడా అంటారు. రామాయణంలో అశోక వనం ప్రస్తావన కూడా ఉంది. సీతమ్మను రావణాసురుడు అశోకవనంలో బంధించాడు. అందుకే అశోక చెట్టు ఉంటే కష్టాలు వస్తాయన్న కొంత నమ్మకం జనంలో ఉంది. మొక్కలు కూడా సంభాషిస్తాయని చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నా. వాటికి ఫీలింగ్స్ ఉంటాయి. సంతోషాన్ని ,బాధను కూడా మనకు చెప్పకనే చెబుతుంటాయి. అశోక చెట్టుకు ప్రతి రోజు నీటిని పోయటం వలన మానసికంగా,శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు.అందువల్ల ఆడవారు ప్రతి రోజు అశోక చెట్టుకు నీటిని పోస్తే మంచిది.

అశోక వృక్షం ఇంట్లో ఉండటం వల్ల దుఃఖం, దారిద్ర్యం తొలగిపోతాయి. ఇంట్లో టెన్షన్ లేని వాతావరణం నెలకొని ఆనందం, ఐశ్వర్యం వస్తుంది. అశోక చెట్టును సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. ఇంటి ప్రధాన ద్వారంపై అశోక ఆకులతో తోరణం కట్టడం శుభప్రదంగా భావిస్తారు. ఇంటిలో దుష్ట శక్తులు నివాసం ఉండవు. ఇంటి వాస్తు దోషాలను పోగొట్టడంలో అశోక చెట్టు చాలా బాగా పనిచేస్తుంది. శాస్త్రాల ప్రకారం, ఇంటి ప్రధాన ద్వారం మూలలో నాటడం ద్వారా సంపదలు చేకూరుతాయి. ఈ చెట్టు ఉన్న ఇంట్లో ఎటువంటి ఆటంకాలు లేకుండా అన్ని పనులు పూర్తవుతాయని నమ్మకం. దీని ఆకులను శుభకార్యాల్లో ప్రత్యేకంగా ఉపయోగిస్తారు. అశోఖ వృక్షాన్ని ఇంట్లో ఉత్తర దిశలో మాత్రమే నాటండి, అప్పుడు మాత్రమే దాని పూర్తి ప్రయోజనం లభిస్తుంది. అశోక వృక్షం వేర్లు పూజా మందిరంలో ఉంచడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోతాయని నమ్మకం.


Related News

Navratri: నవరాత్రి 9వ రోజు.. దుర్గాదేవిని ఇలా పూజిస్తే సకల సంపదలు !

Bathukamma 2025: సద్దుల బతుకమ్మ.. పేరు వెనక అసలు కథ ఇదే !

Ramayana Story: ఎలుక పై మూడు గీతలు వెనుక శ్రీరాముడి మహిమ? మీకు తెలుసా?

Navratri Day 8: నవరాత్రుల్లో 8వ రోజు.. సరస్వతి దేవిని ఎలా పూజించాలి ?

Bathukamma 2025: వెన్నముద్దల బతుకమ్మ ప్రత్యేకత ఏంటి ?

Navaratri 2025: మహాచండీ దేవిని 7వ రోజు ఎలా పూజించాలి ? సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Navaratri 2025: నవరాత్రి 6వ రోజు.. లలితా దేవిని ఏ విధంగా పూజించాలో తెలుసా ?

Bathukamma 2025: వేపకాయల బతుకమ్మ.. ఆ పేరు వెనక కథ, సమర్పించాల్సిన నైవేద్యం ఏంటి ?

Big Stories

×