OG Success Event : పవన్ కళ్యాణ్ ఓజి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమా దాదాపు 300 కోట్ల కలెక్షన్స్ రాబట్టడానికి దగ్గరలో ఉంది. అయితే రీసెంట్ టైమ్స్ లో సినిమా రిలీజ్ అయిన సాయంత్రానికి సక్సెస్ మీట్ లు పెడుతున్న తరుణంలో, ఈ సినిమాకి సంబంధించి ఐదు రోజుల వరకు ఆగిన తర్వాత సక్సెస్ మీట్ నిర్వహించారు.
వాస్తవానికి ఈ సినిమా సక్సెస్ జోనర్ లోకి చేరిపోయింది. దీనిలో ఎటువంటి ఇన్ సెక్యూరిటీస్ లేవు. పవన్ కళ్యాణ్ అభిమానులు చాలా రోజుల తర్వాత అసలైన సక్సెస్ చూడడంతో మంచి జోష్ లో ఉన్నారు. ఈ సినిమా సక్సెస్ మీట్ నేడు నిర్వహించారు. సక్సెస్ మీట్ కి పవన్ కళ్యాణ్ హాజరై అందరికీ మెమొంటోస్ అందజేశారు.
సుజీత్, తమన్ కలిసి నాతో ఆడుకున్నారు. కన్సర్ట్ కి కూడా కటనా పట్టుకుని రావాలని వీళ్ళు చెప్పారు. నేనెప్పుడూ అలా చేయలేదు. పోనీలే కదా అని ఒకసారి విన్నాను మాట. ఇప్పుడు కూడా వైట్ కలర్ జుబ్బాలో వద్దామనుకున్నా. వీళ్లు లేదు ఖచ్చితంగా మీరు బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని రావాలి. కళ్లద్దాలు పెట్టుకొని రావాలి అంటూ నాకు చెప్పారు.
అలానే గన్ పట్టుకొని రావాలి అని చెప్పారు. గన్స్ అంటే నాకెందుకో బలహీనత. దానిని పట్టుకొని వీళ్ళు నాతో ఆడుకుంటున్నారు. మీరు కళ్లద్దాలు పెట్టుకుని రావాలి అని చెప్పినప్పుడు మిమ్మల్ని చంపేస్తానని చెప్పా.
అంతేకాకుండా ఈ సినిమాలో మా ప్రొడక్షన్ డిజైనర్ చేసిన గన్ పట్టుకొని మీరు ఉండాలి ఒక ఫోటో తీస్తాము అని చెప్పారు. నాకు ఇలాంటివన్నీ చేయడం ఇష్టం లేదు. కానీ చాలామంది అభిమానుల కోసం, వీళ్ళిద్దరి అభిమానం కోసం నేను ఇది చేస్తున్నాను అంటూ గన్ తో స్టిల్ ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఆ తర్వాత సినిమాకు పని చేసిన వాళ్ళకి మెమొంటోస్ అందజేశారు.
ఇక ఈ సక్సెస్ ఈవెంట్ కు పవన్ కళ్యాణ్ హాజరవడంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గన్ పట్టుకుని ఇచ్చిన స్టిల్స్ నెక్స్ట్ లెవెల్. ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో మళ్లీ వైరల్ అయ్యే అవకాశం ఉంది. అయితే కొంతమంది మళ్లీ డిప్యూటీ సీఎం ఇలా గన్ పట్టుకుని రావొచ్చా అనే బ్యాచ్ కూడా ముందుకు రావడం సహజంగా జరుగుతుంది.
Also Read: OG Success Meet : పవన్ కళ్యాణ్ ఆ డిజాస్టర్ సినిమా లేకపోతే నేను లేను, సుజీత్ షాకింగ్ కామెంట్స్