BCCI : ఇండియన్ బ్యాంకులకు బీసీసీఐ(BCCI) బిగ్ షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే..? ఇటీవల టీమిండియా జెర్సీ(Team India Jersey) కి స్పాన్సర్ నుంచి డ్రీమ్ 11 (Dream 11) తప్పుకున్న విషయం తెలిసిందే. ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్ లైన్ గేమింగ్ బిల్లు 2025 కి పార్లమెంట్ ఆమోదం తెలపడంతో టీమిండియా (Team India) కి స్పాన్సర్ గా వ్యవహరించిన డ్రీమ్ 11 (Dream 11) సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 09 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్ 2025 (Asia Cup 2025) యూఏఈ (UAE) లో ప్రారంభమవ్వనున్న విషయం విధితమే. ఇంకా ఈ కప్ కి కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఉండటంతో ఇప్పటికే అక్కడికి చేరుకున్న టీమిండియా క్రికెటర్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ సందర్భంగా టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్ మన్ గిల్ (Shubhman Gill), ఆటగాడు శివమ్ దూబే ధరించిన జెర్సీలలో మాత్రం ఎలాంటి లోగో కనిపించలేదు. దీంతో ఓ క్లారిటీ అయితే వచ్చేసింది.
Also Read : Asia Cup 2025 : ఆసియా కప్ 2025 జియో హాట్‌స్టార్‌లో రాదు.. ఫ్రీగా ఎలా చూడాలంటే..?
ఇక ఈ ఏడాది అక్టోబర్ లో వెస్టిండీస్ (Westindies) తో జరిగే టెస్ట్ సిరీస్ సమయానికి టీమిండియా (Team India) స్పాన్సర్ షిప్ తో ఒప్పందం కుదుర్చుకోవాలని బీసీసీఐ భావిస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇండియన్ బ్యాంకింగ్ లకు షాక్ ఇస్తోంది. ఈ తరుణంలోనే ఈనెల 09న టీమిండియా స్పాన్సర్ షిప్ కోసం భారత క్రికెట్ బోర్డు టెండర్లను ఆహ్వానించింది. అయితే ఆసక్తి ఉన్న కంపెనీలు సెప్టెంబర్ 16 లోపు దరఖాస్తు చేసుకోవాలని బీసీసీఐ (BCCI) డెడ్ లైన్ విధించింది. బిడ్డింగ్ లో పాల్గొనే జట్టులు ముఖ్యంగా ఐఈఓఐ కింద 5, 90, 000 (నాన్ రిఫండబుల్) దరఖాస్తు రుసుము చెల్లించాలి. అయితే ఇండియా కి చెందిన బ్యాంకులకు బీసీసీఐ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా ఐసీఐసీఐ, HDFC బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, IDFC బ్యాంక్ లు టీమిండియా (Team India) స్పాన్సర్ షిప్ చేసేందుకు అవకాశం లేదని బీసీసీఐ (BCCI) స్పష్టం చేసింది.
విమల్ పాన్ మసాలా, టెస్లా కంపెనీ, అదానీ, టాటా గ్రూపు, రిలియన్స్ గ్రూపు తదితర కంపెనీలు బిడ్ వేసేందుకు ఆసక్తి చూపిస్తున్నట్టు సమాచారం. మరోవైపు మహిళా ప్రపంచ కప్ కోసం బీసీసీఐ ఒక ప్రత్యేక చర్య తీసుకుంది. ఎక్కువ మంది ప్రేక్షకులు స్టేడియాలకు వచ్చి మహిళా క్రికెట్(Cricket) కు మద్దతు ఇవ్వడానికి, టోర్నమెంట్ టికెట్ ధరను కేవలం రూ.100 కి తగ్గించారు. మహిళా క్రికెట్‌ను మరింత పాపులర్ చేయడమే దీని ఉద్దేశమని BCCI కార్యదర్శి సైకియా అన్నారు. సెప్టెంబర్ 30 నుంచి భారత్ , శ్రీలంక లో మహిళా వన్డే ప్రపంచ కప్ (Women odi World Cup) ప్రారంభం కానుంది. ఈ పెద్ద టోర్నమెంట్ కి ముందు సైకియా (Saikiya) ఆతిథ్య భారత మహిళా జట్టు పై నమ్మకం వ్యక్తం చేశారు. గత రెండేళ్లు గా టీమిండియా మహిళల జట్టు అద్భుతంగా ఆడుతోందని తెలిపారు. ఆసియా కప్ లో టీమిండియా తొలుత యూఏఈ (UAE) తో తలపడనుంది. ఆ తరువాత సెప్టెంబర్ 14న పాకిస్తాన్ (Pakistan) తో తలపడనుంది.