Pakisthan Blast : సాధారణంగా క్రికెట్ లో రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఇటీవలే కెనడాలోని కింగ్ సిటీలో జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ లీగ్ 2 మ్యాచ్ లో నమీబియా, స్కాట్లాండ్ జట్ల మధ్య వింత సంఘటన జరిగింది. వర్షం తరువాత గ్రౌండ్ సిబ్బంది పిచ్ పై నిప్పు పెట్టారు. అయితే ఈ ఘటన మరవకముందే తాజాగా పాకిస్తాన్ లో మరో ఘటన చోటు చేసుకుంది. క్రికెట్ గ్రౌండ్ లో మ్యాచ్ జరుగుతుండగానే గ్రౌండ్ లో పేలుడు సంభవించింది. అది మళ్లీ పాకిస్తాన్ లో జరగడంతో ఉగ్రవాదులు పేల్చారా..? ఇది తాలిబన్లా… అని తర్జన భర్జన పడుతున్నారు. మరోవైపు గ్రౌండ్ లో క్రికెట్ ఆడేవారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ఇది జరిగింది నేషనల్ మ్యాచ్ మాత్రం కాదు. పాకిస్తాన్ లో ఓ టోర్నమెంట్ లో జరిగినట్టు సమాచారం. అది గల్లీ క్రికెట్ టోర్నమెంట్ అని తెలుస్తోంది. పాకిస్తాన్ లో మ్యాచ్ ల్లో గల్లీ క్రికెట్ లోనే ఇలా జరిగితే మరీ ఇంటర్నేషనల్ మ్యాచ్ లో ఇంకెలా జరుగుతుందోనని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
పాకిస్థాన్‌లోని వాయువ్య ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా పేలుడు సంభవించి ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. బజౌర్ జిల్లాలోని ఖార్ తహసీల్‌లోని కౌసర్ క్రికెట్ గ్రౌండ్‌లో పేలుడు సంభవించింది. ఇంప్రూవైజ్డ్ పేలుడు పరికరం ద్వారా పేలుడు జరిగిందని బజౌర్ జిల్లా పోలీసు అధికారి వకాస్ రఫీక్ ధృవీకరించారు.