NRSC Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్. హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారికి గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఉద్యోగాన్ని బట్టి బీటెక్/బీఈ, డిగ్రీ, డిప్లొమా పాసై ఉంటే సరిపోతుంది. ఈ ఉద్యోగం సాధించిన వారికి నెలకు స్టైఫండ్ కూడా అందజేస్తారు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీలు, వయస్సు తదితర వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
హైదరాబాద్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSC) లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అర్హత కలిగినవారు ఆగస్టు 22వ తేదీ నుంచి సెప్టెంబర్ 11 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 96
నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ లో గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. వివిధ విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఎకల్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, సివిల్, మెకానికల్, లైబ్రరీ సైన్స్ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు:
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 11
డిప్లొమా అప్రెంటిస్: 55
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ (జనరల్ స్ట్రీమ్): 30
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగాంలో బీటెక్, బీఈ, డిగ్రీ, డిప్లొమా పాసై ఉంటే సరిపోతుంది.
స్టైఫండ్: సెలెక్ట్ అయిన వారికి స్టైఫండ్ అందజేస్తారు. నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.9000, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.8000 స్టైఫండ్ ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఆగస్టు 22
దరఖాస్తుకు చివరి తేది: 2025 సెప్టెంబర్ 11
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి.
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి స్టైఫండ్ కూడా అందజేస్తారు. నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు రూ.9000, డిప్లొమా అప్రెంటిస్‌కు రూ.8000 స్టైఫండ్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ కీలక సమాచారం:
మొత్తం పోస్టుల సంఖ్య: 96
దరఖాస్తుకు చివరి తేది: 2025 సెప్టెంబర్ 11
ALSO READ: IBPS Jobs:10,277 క్లర్క్ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారా..? నేడే లాస్ట్ డేట్..