OTT Movie : ముంబైలోని వేశ్యల జీవితాలతో, ఒక మైండ్ బ్లోయింగ్ స్టోరీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇలాంటి కంటెంట్ తో చాలా సినిమాలే వచ్చాయి. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే సినిమా డిఫరెంట్ గా ఉంటుంది. వేశ్యలు, పురుషాధిక్య వ్యవస్థకు వ్యతిరేకంగా చేసే తిరుగుబాటును ఈ సినిమా ఆలోచనాత్మకంగా చూపిస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఈ స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …
నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్
‘టిక్లీ అండ్ లక్ష్మీ బాంబ్’ (Tikli and Laxmi Bomb) 2017లో విడుదలైన హిందీ సినిమా. దీనికి ఆదిత్య కృపలానీ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2015లో కృపలానీ రచంచిన ‘టిక్లీ అండ్ లక్ష్మీ బాంబ్’ అనే నవల ఆధారంగా రూపొందించబడింది. ఇది నెట్‌ఫ్లిక్స్‌లో 2018 జూలై 31న విడుదలైంది. హిందీ ఆడియో, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్‌లో ఉంది. 2 గంటల 30 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా IMDbలో 7.0/10 రేటింగ్ ను పొందింది.
స్టోరీలోకి వెళ్తే
ఈ కథ ముంబైలోని ఎస్.వి. రోడ్‌లో సెక్స్ వర్కర్ల జీవితాల చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ లక్ష్మీ మల్వాంకర్ అనే ఒక 40 ఏళ్ల మహిళ దాదాపు రెండు దశాబ్దాలుగా వేశ్య వృత్తిలో ఉంటుంది. ఆమె జీవితం పట్ల నిరాశతో ఉంటుంది. అయితే ఆ ఏరియాలో ఉండే మా త్రే పట్ల ఒక రకమైన విధేయతను కలిగి ఉంటుంది. మాత్రే ఆ వీధిలోని అమ్మాయిలను నియంత్రిస్తుంటాడు. వారికి అండగా ఉంటానని చెప్పుకుంటాడు. కానీ వాస్తవంలో అతను, ఇతర మగవాళ్ళు వారిని దోపిడీ చేస్తుంటారు.
ఇక ఈ కథలోకి పుతుల్ అనే 22 ఏళ్ల బంగ్లాదేశ్ అమ్మాయి, టిక్లీ అనే మారుపేరుతో ప్రవేశిస్తుంది. మాత్రే ఆమెను లక్ష్మీ వద్దకు తీసుకొస్తాడు. ఆమెకు ఈ వృత్తి నియమాలను నేర్పించమని చెప్తాడు. అయితే పుతుల్ తిరుగుబాటు స్వభావం కలిగిన అమ్మాయి. ఆమె ఈ వ్యవస్థను ప్రశ్నిస్తుంది. ఎందుకు పురుషులు తమ ఆదాయాన్ని నియంత్రిస్తారు? ఎందుకు వీళ్లంతా రక్షణ ఇస్తామని చెప్పి, చివరికి వేధించే వారిగా మారతారు? అని అనుకుంటూ ఆమె ఈ వ్యవస్థను మార్చాలని నిర్ణయించుకుంటుంది.
పుతుల్ తిరుగుబాటు స్ఫూర్తితో, లక్ష్మీ కూడా ఈ వ్యవస్థ అన్యాయాలను గుర్తించడం ప్రారంభిస్తుంది. ఒక రాత్రి, వీధిలో జరిగిన హింసాత్మక సంఘటన తర్వాత, లక్ష్మీ పుతుల్ ఆలోచనలకు మద్దతు ఇవ్వడానికి నిర్ణయించుకుంటుంది. ఇద్దరూ కలిసి “టిక్లీ అండ్ లక్ష్మీ బాంబ్” అనే పేరుతో ఒక చిన్న తిరుగుబాటును ప్రారంభిస్తారు. వీళ్ళు మధ్యవర్తులను తొలగించి, స్త్రీలచే నడిపించబడే ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఈ వ్యవస్థలో స్త్రీలు తమ ఆదాయాన్ని, క్లయింట్లను స్వయంగా తమ పర్యవేక్షణలో జరిగేవిధంగా చూసుకుంటారు. వారు టెక్నాలజీని, ఆఫర్‌లను ఉపయోగించి క్లయింట్లను ఆకర్షిస్తారు. స్త్రీల భద్రత, గౌరవానికి ప్రాధాన్యత ఇస్తారు.
కథలో టిక్లీ, లక్ష్మీ నడిపే ఈ సహకార వ్యవస్థ మొదట విజయవంతమవుతుంది. వారు ఇతర వేశ్యలను తమ బృందంలోకి చేర్చుకుంటారు. వీళ్ళ వ్యాపారం కూడా వృద్ధి చెందుతుంది. ఇది ఇలా సాగుతుంటే మాత్రే, అతని సహచరులు, అవినీతి పోలీసులు వారి వ్యవస్థను నాశనం చేయడానికి ప్రయత్నిస్తారు. పుతుల్‌పై హింసాత్మక దాడులు జరుగుతాయి. లక్ష్మీ గందరగోళంలో పడతుంది. సినిమా ఒక ఆలోచనాత్మక క్లైమాక్స్‌తో ముగుస్తుంది. ఈ క్లైమాక్స్ ఏమిటి ? ఈ వేశ్యల పోరాటం ఏమవుతుంది ? మాత్రే ఎలాంటి సమస్యలు సృష్టిస్తాడు ? అనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చుడండి.
Read Also : నలుగురమ్మాయిల రచ్చ… ఇద్దరబ్బాయిల ఎంట్రీతో ట్విస్ట్… అన్నీ అవే పాడు సీన్లు సామీ