BigTV English

Artificial Sweeteners: ఆర్టిఫీషియల్ స్వీటెనర్లు వాడుతున్నారా? అవి మీ మెదడును ఏం చేస్తాయో తెలుసా?

Artificial Sweeteners: ఆర్టిఫీషియల్ స్వీటెనర్లు వాడుతున్నారా? అవి మీ మెదడును ఏం చేస్తాయో తెలుసా?

Artificial Sweeteners Effects: 

చక్కెరకు బదులుగా చాలా మంది ఆర్టిఫీషియల్ స్వీటెనర్లను వాడుతారు. ముఖ్యంగా అస్పర్టమే, సాచరిన్ లాంటి ఆర్టిఫీషియల్ స్వీటెనర్లను ఉపయోగిస్తారు. అయితే, ఆర్టిఫీషియల్ స్వీటెనర్లతో కూడిన డ్రింక్స్ తీసుకోవడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపించే అవకాశం ఉందంటున్నారు. డయాబెటిస్, బరువు నియంత్రణ కోసం ఇవి ఉపయోగపడినా, మెదడుకు ముప్పు చేస్తున్నట్లు తాజా పరిశోధనలు వెల్లడించాయి. ఇంకా చెప్పాలంటే మెదడు అనారోగ్యానికి గురవుతుందన్నారు.


స్వీటెనర్లను తినే వ్యక్తుల్లో మెదడు సమస్యలు

తాజాగా న్యూరాలజీ జర్నల్‌లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం, అత్యధిక మొత్తంలో స్వీటెనర్లను తినే వ్యక్తులు వారి జ్ఞాపకశక్తి సామర్థ్యం 62 శాతం వేగంగా క్షీణిస్తున్నట్లు పరిశోధకులు తెలిపారు. ఇది 1.6 సంవత్సరాల వయస్సుకు సమానమన్నారు. ముఖ్యంగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం, డైట్ సోడా బాటిల్ లో దాదాపు 200 నుంచి 300 మిల్లీగ్రాముల స్వీటెనర్ ఉంటుంది. తాజా పరిశోధనలు తక్కువ, కేలరీలు లేని స్వీటెనర్ల (LNCలు) వినియోగం, ముఖ్యంగా కృత్రిమ LNCలు, చక్కెర ఆల్కహాల్స్ వినియోగం వల్ల మెదడు పనితీరుపై దీర్ఘకాలిక హాని జరిగే అవకాశాన్ని సూచిస్తున్నాయి.

శరవేగంగా మెదడు క్షీణత

ఇక ఈ అధ్యయనం కోసం పరిశోధకులు బ్రెజిల్‌ లో దాదాపు 13,000 మందిని విశ్లేషించారు. సగటు వయస్సు 52 సంవత్సరాలు ఉన్నవారి నుంచి అభిప్రాయాలు సేకరించారు. అధ్యయనం ప్రారంభంలో పాల్గొనే వారి ఆహార సమాచారాన్ని సేకరించారు. సగటున ఎనిమిది సంవత్సరాలలో మూడుసార్లు పలు బ్రెయిన్ టెస్టులు నిర్వహించారు. డైట్ సోడాతో పాటు, స్వీటెనర్ల రుచి ఉన్న వాటర్, తక్కువ కేలరీల డెజర్ట్‌ లు, ఎనర్జీ డ్రింక్స్ లో కూడా గుర్తించారు. మధ్య వయసులో ఉన్నవారి మెదడు క్షీణత రేటును 35 శాతం వేగాన్ని కలిగి ఉన్నారు.  ఇది ఈ స్వీటెనర్లను తక్కువ మొత్తంలో తినే వ్యక్తుల కంటే 1.3 సంవత్సరాల వృద్ధాప్యం ఎక్కువ అని అధ్యయనం వెల్లడించింది.


డైట్ సోడాతో డయాబెటిస్ ముప్పు

గత నెలలో ఆస్ట్రేలియన్ అధ్యయనం ప్రకారం, స్వీటెనర్లు ఉన్న డైట్ సోడా టిన్ ను తాగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం 38 శాతం పెరుగుతుందని తేలింది. కృత్రిమంగా తియ్యదనాన్ని కలిగించే కూల్ డ్రింక్ నుంచి వచ్చే ప్రమాదం సాధారణ  షుగర్ డ్రింక్ కంటే ఎక్కువగా ఉందని తేలింది. అంతేకాదు, 23 శాతం ఎక్కువ ప్రమాదానికి కారణం అవుతున్నాయని వెల్లడైంది. షుగర్ డ్రింక్స్, డయాబెటిస్ కు కారణం అవుతున్నట్లు తేలింది. ఇది జీవక్రియపై ప్రత్యక్ష ప్రభావాన్ని సూచిస్తుంది.

నిపుణులు ఏం చెప్తున్నారంటే?

కృత్రిమ స్వీటెనర్లను మితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. FDA/WHO సిఫారసు చేసిన పరిమితులను ఫాలో కావాలంటున్నారు. సహజ స్వీటెనర్లు (స్టీవియా, తేనె, మాంక్ ఫ్రూట్) తీసుకోవడం ద్వారా మెదడు, శరీర ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చంటున్నారు. ఒకవేళ తలనొప్పి, ఆందోళన, ఇతర న్యూరోలాజికల్ లక్షణాలు కనిపిస్తే, కృత్రిమ స్వీటెనర్ల వాడకాన్ని తగ్గించి  వైద్యుడిని సంప్రదించాలంటున్నారు. మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్,  సమతుల ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు.

Related News

Coconut Water: కొబ్బరి నీళ్ళు నేరుగా తాగకూడదా? అమ్మో.. ఇంత డేంజర్ అని అస్సలు తెలియదే!

Bald Head: బట్టతల బాబులకు బంగారం లాంటి న్యూస్, ఇలా చేస్తే నేచురల్‌ గానే జుట్టు వచ్చేస్తాదట!

Ganesh Laddu: ఒక లడ్డు.. లక్షలు కాదు కోట్లు.. ఎక్కడెక్కడ ఎంత ధర పలికిందంటే?

Phone Charging: ఫోన్ చార్జింగ్ అయిపోయిన తరువాత.. చార్జర్ అలాగే వదిలేస్తున్నారా?

Tulsi Tree: తరచూ తులసి మొక్క ఎండిపోతుందా ? ఈ టిప్స్ ట్రై చేయండి

Big Stories

×