OTT Movie : కామెడీ జానర్ లో వచ్చే హారర్ సినిమాలకు ప్రేక్షకులు ఫిదా అవుతుంటారు. ఈ సినిమాలు ఫ్యామిలీతో కలసి చూస్తూ ఎంటర్ టైన్ అవుతుంటారు. తెలుగులో వచ్చిన ‘ప్రేమ కథా చిత్రం’ ఇందుకు ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా తరువాత అలాంటి కంటెంట్ తో చాలా సినిమాలే వచ్చాయి. అయితే ఇప్పుడు మనం చప్పుకోబోయే మలేషియన్ తమిళ హారర్ కామెడీ సినిమా ఓటీటీలో అదరగొడుతోంది. ఇది మలేషియాలో మొదటి డాల్బీ అట్మాస్ చిత్రంగా గుర్తింపు పొందింది. ఒక ఇంట్లో ఫ్యామిలీని వెంటాడుతున్న ఆత్మతో ఈ కథ మొదలవుతుంది. ఈ సినిమా స్టోరీ ఏమిటి ? పేరు ఏమిటి ? ఎందులో ఉంది ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
మలేషియాలోని ఒక ఎస్టేట్‌లో సెంథిల్ అతని భార్య శ్రీదేవి ఆమె సోదరుడు శివ కలిసి జీవిస్తుంటారు. వీళ్ళుంటున్న ఇంట్లో వింత శబ్దాలు, వస్తువులు కదలడం, రాత్రిపూట భయంకరమైన నీడలు కనిపించడంతో వీళ్ళంతా భయపడుతుంటారు. ఈ చిత్రం ఒక భయంకరమైన సన్నివేశంతో ప్రారంభమవుతుంది. ఒక వ్యక్తి రాత్రిపూట ఎస్టేట్‌లో బైక్ ఆగిపోవడంతో ఒక రహస్యమైన శక్తి చేతిలో హింసాత్మకంగా మరణిస్తాడు. ఈ సంఘటనలు తీవ్రమవుతూ, శ్రీదేవిని దాదాపు ఆ దుష్ట శక్తి గొంతు పిసికి చంపబడే పరిస్థితి వస్తుంది. కానీ సెంథిల్ ఒక నిర్లక్ష్య IT ఉద్యోగి, ఈ సంఘటనలను సీరియస్‌గా తీసుకోడు. ఆ తరువాత ఎందుకైనా మంచిదని గురు-జి అనే మిస్టిక్ ఎక్సార్సిస్ట్ సహాయం కోరతారు. అతను ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక హీలింగ్, ఘోస్ట్-బస్టింగ్ వంటి వాటి మీద బాగా అధ్యయనం చేసి ఉంటాడు. పవిత్ర బూడిదతో కూడిన షాట్‌గన్, రుద్రాక్ష మాల వంటి వింత సాధనాలతో ఆ శక్తులను ఎదుర్కొంటాడు. శివ అక్కడ ఒక రహస్యమైన పుస్తకాన్ని కనిపెడతాడు. అందులో అక్కడ జరిగే ప్రస్తుత సంఘటనలను పోలిన కథను కలిగి ఉంటుంది. ఇది కథను మరింత ఉత్కంఠభరితంగా మారుస్తుంది.
గురు-జి దర్యాప్తులో, ఈ ఆత్మ ఎస్టేట్‌లో జరిగిన ఒక గత ద్రోహంతో ముడిపడి ఉందని తెలుస్తుంది. ఒక మహిళ గతంలో అన్యాయంగా హత్యకు గురై, ఆమె ఆత్మ ఇప్పుడు వీళ్ళని వెంటాడుతోంది. ఒక కామెడీ సన్నివేశంలో, సెంథిల్ ఒక బాత్రూమ్ స్టాల్‌లోకి తొందరపడి ఒక సహోద్యోగితో మాట్లాడుతున్నానని అనుకుంటాడు. కానీ అది ఆత్మ అని తెలుస్తుంది. క్లైమాక్స్‌లో, గురు-జి, సెంథిల్, శివ, శ్రీదేవి కలిసి ఎస్టేట్‌లో ఒక రిచ్యువల్ ద్వారా ఆత్మను శాంతింపజేసేందుకు ప్రయత్నిస్తారు. కానీ ఒక షాకింగ్ ట్విస్ట్‌లో ఆత్మ అసలు ఉద్దేశం తెలుస్తుంది. ఇది సెంథిల్ కుటుంబం గతంతో సంబంధం కలిగి ఉంటుంది. చివరికి ఈ ఆత్మ శాంతిస్తుందా ? దాని గతం ఏమిటి ? ఎందుకు సెంథిల్ కుటుంబాన్ని వెంటాడుతోంది ? క్లైమాక్స్ ట్విస్ట్ ఏమిటి ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ హారర్ సినిమాని మిస్ కాకుండా చుడండి.
‘మిరుగసిరిషం’ (Mirugasirisham) 2025లో విడుదలైన మలేషియన్ తమిళ హారర్ కామెడీ చిత్రం. విజయ్ గణేష్ దర్శకత్వంలో, విజయ్ గణేష్ (గురు-జి), జోషువా శశి కుమార్ (శివ), జెగన్ షణ్ముగం (సెంథిల్), నిర్మల తర్మరాజన్ (శ్రీదేవి), కుమారి ప్రధాన పాత్రల్లో నటించారు. ఫైవ్ స్టార్ ట్రేడింగ్, DSG క్రియేషన్, ఎవోరా ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించిన ఈ చిత్రం 2025 జూన్ 19న విడుదలై, 2 గంటల 10 నిమిషాల రన్‌టైమ్‌తో IMDbలో 7.7/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా మలేషియన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ Astro GOలో తమిళ ఆడియోతో, ఇంగ్లీష్, తెలుగు సబ్‌టైటిల్స్‌తో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది.
Read Also : బంగారం గొలుసు తీగ లాగితే మర్డర్ డొంక కదిలే… గ్రిప్పింగ్ స్టోరీ… ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్