Asia Cup 2025 : ఆసియా కప్ 2025 (Asia Cup 2025) సెప్టెంబర్ 09 నుంచి యూఏఈలో ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీకి కేవలం మరో మూడు రోజులు మాత్రమే సమయం ఉంది. దాదాపు నెల రోజుల సుదీర్గ విరామం తరువాత టీమిండియా తిరిగి మైదానంలోకి అడుగుపెట్టనుంది. ఇంగ్లండ్ పర్యటన అనంతరం టీమిండియా ఏ టోర్నీ కూడా ఆడలేదు. మరోవైపు బంగ్లాదేవ్ పర్యటన రద్దు కావడంతో భారత ఆటగాళ్లు ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ మెగా టోర్నీ కోసం సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టు ఇప్పటికే యూఏఈకి చేరుకుంది. ప్రాక్టీస్ సెషన్ లో కూడా పాల్గొంది టీమిండియా. టీ-20 ఫార్మాట్ లో జరుగనున్న ఈ టోర్నీలో మొత్తం 8 జట్లు బరిలోకి దిగుతున్నాయి. సెప్టెంబర్ 09న ఈ టోర్నీ ప్రారంభం కానుండగా.. భారత్ సెప్టెంబర్ 10న యూఏఈతో తలపడనుంది. సెప్టెంబర్ 14న పాకిస్తాన్ జట్టుతో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్ పై ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
Also Read : Neymar Junior : రూ.10వేల కోట్ల ఆస్తి.. ఫుట్‌బాల్ స్టార్‌కి రాసిచ్చేసిన బిలియనీర్
అయితే ఆసియా కప్ 2025 టోర్నీ బ్రాడ్ కాస్టింగ్ రైట్స్ సోనీ నెట్ వర్క్ దక్కించుకుంది. అయితే సోనీ టీవీ ఛానెల్స్ తో పాటు ఆ సంస్థకు చెందిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీ లైవ్ లోనూ ఈ మ్యాచ్ లు ప్రత్యక్ష ప్రసారం అవుతాయి. అయితే నేరుగా ఈ ఛానెల్స్, ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో చూడాలనుకుంటే రుసుము చెల్లించాలి. కానీ జియో యూజర్స్, ఎయిర్ టెల్ యూజర్స్, జియో టీవీ, ఎయిర్ టెల్ టీవీల సాయంతో ఈ మ్యాచ్ లను ఉచితంగా చూడవచ్చు. భారత కాలమానం ప్రకారం.. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉండగా.. యూఏఈలో ఎండలు ఎక్కువగా ఉండటం.. ఉక్కపోత కారణంగా అరగంట సమయం పొడగించారు. అంటే రాత్రి 8 గంటలకు ఆసియా కప్ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి.
చివరిసారిగా ఆసియా 2023 వన్డే ఫార్మాట్ లో జరిగింది. అయితే ఆ టోర్నీలో భారత్ ఛాంపియన్ గా నిలిచింది. 2016లో తొలిసారి టీ-20 ఫార్మాట్ లో నిర్వహించగా. అప్పుడు కూడా భారత్ విజేతగా నిలిచింది. 2022 మరోసారి టీ-20 ఫార్మాట్ లో నిర్వహించగా.. భారత్ కనీసం ఫైనల్ కూడా చేరుకోలేదు. ఇక ఆ టోర్నీలో శ్రీలంక విజేతగా నిలిచింది. తాజాగా భారత్ హాట్ పేవరేట్ గా బరిలోకి దిగుతున్నా.. టీ-20 ఫార్మాట్ లో ఎవరినీ తక్కువ అంచనా వేయకూడదు. ఎప్పుడూ ఆ ఆటగాడు రాణిస్తాడో.. ఏ జట్టు విజయం సాధిస్తుందో ఊహించలేము. మొత్తానికి భారత్ 16 సార్లలో ఆసియా కప్ లో భారత్ 8 టైటిళ్లను గెలిచింది. భారత్ తో పాటు పాకిస్తాన్, యూఏఈ, ఓమన్ ఉన్నాయి. గ్రూపు ఏ లో బంగ్లాదేశ్, అప్గానిస్తాన్, హాంగ్ కాంగ్, శ్రీలంకలు బరిలోకి దిగుతున్నాయి. ఒమన్ తొలిసారి ఆసియా కప్ ఆడనుండగా.. హాంకాంగ్ 2018, 2022 రెండుసార్లు, యూఏఈ 2016 ఒక్కసారి ఆడింది.