BigTV English

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. (07/09/2025)

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. (07/09/2025)

Today Horoscope: ప్రముఖ జ్యోతిర్వాస్తు, వేద పండితులు, దేవీ ఉపాసకులు  ‘బ్రహ్మశ్రీ  రామడుగు శ్రీకాంత్‌ ఆచార్య’ గారిచే గ్రహాల సంచారం ప్రకారం అంచనా వేసిన సెప్టెంబర్‌ 7వ తేదీ రాశి ఫలితాలను ఇప్పుడు తెలుసుకుందాం.


మేష రాశి:

మీ వేగవంతమైన స్వభావం మిమ్మల్ని లక్ష్యంవైపుకు నడిపిస్తుంది. విజయం చేకూరాలంటే కాలంతో పాటు మీ ఆలోచనలను మార్చుకొండి. ఇది మీ దృక్పథాన్ని విశాలం చేస్తుంది.  ఇంకా మీ ఆశలను విస్తృతం చేస్తుంది. మీవ్యక్తిత్వాన్ని మెరుగుపరిచి.. మానసిక శక్తిని బలోపేతం చేస్తుంది. మీకు డబ్బు విలువ బాగా తెలుసు. ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది మీకు విపత్కర పరిస్థితులలో ఉపయోగపడుతుంది. లక్కీ సంఖ్య: 5

వృషభ రాశి:

రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం మిమ్మల్ని టెన్షన్‌కు గురి చేస్తుంది. అయినా సరే మీ జీవితంలో మధురమైన క్షణాలను అనందించే రోజు. మీ ప్రేమ కొత్త మలుపులు తీసుకుంటుంది.  లక్కీ సంఖ్య: 4


మిథున రాశి:  

మీ శక్తిని అనవసరంగా వ్యర్థం చేసుకోకండి. ఏదైనా ఉపయోగపడే దిశలో మీ సమయాన్ని వినియోగించండి. ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది. అయితే మీలోని దూకుడు స్వభావము చేత మీరు అనుకున్నంతగా ప్రయోజనాలను పొందలేరు. లక్కీ సంఖ్య: 2

కర్కాటక రాశి:

మీ ఆరోగ్య విషయాల మీద దృష్టి సారించండి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సమస్యల పరిష్కారం కోసం ఎవరైనా కలిస్తే పట్టించుకోవద్దు. మీ సహచరులతో మృదువుగా మాట్లాడండి. లక్కీ సంఖ్య: 5

సింహరాశి:

సంఘంలో గౌరవ ప్రదమైన వ్యక్తుల సపోర్టు మీకు లభిస్తుంది. ఇతరుల కోసం ఎక్కువ ఖర్చులు చేయడం మానుకోండి. మీ పిల్లల వల్ల అనేక విషయాలలో మీరు గర్వపడతారు. సొసైటీలో గౌరవం తీసుకొస్తారు. లక్కీ సంఖ్య: 4

కన్యారాశి :

సంతృప్తికరమైన జీవితం కోసం మీరు మానసిక దృఢత్వాన్ని పెంపొందించుకొండి. ఈరోజు స్త్రీలు పురుషుల వలన పురుషులు స్త్రీల యొక్క సహాయ సహకారాలతో వ్యాపారంలో లాభాలను గడిస్తారు. సముద్రాల అవతల ఉండే బంధువు ఇచ్చే బహుమతితో మీకు చాలా సంతోషం కలుగుతుంది. లక్కీ సంఖ్య: 2

 

ALSO READ: ఈ రాశుల్లో జన్మించిన వారు ఎప్పటికైనా కోట్లు సంపాదిస్తారట

 

తులారాశి:

ఆహారం విషయంలో మితంగా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. మీరు చేసిన పొదుపే ఇవాళ మీకు హెల్ఫ్ అవుతుంది. కానీ అనుకోకుండా అయిన ఖర్చులు మిమ్మల్ని బాధిస్తాయి. నమ్మకమైన వ్యక్తుల దగ్గరే మీ ఆకాంక్షలు బయటపెట్టండి. లక్కీ సంఖ్య: 5

వృశ్చికరాశి:

మీలోని భావోద్వేగాలను అదుపు చేసుకోవాలి.  అలాగే మీ భయాన్ని కూడా వీలైనంత త్వరగా వదిలెయ్యాలి. ఎందుకంటే మీ ఆరోగ్యం సత్వరమే పాడయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఇతరుల మాట మేరకు పెట్టుబడి మదుపు చేస్తే.. ఆర్థిక నష్టాలు వచ్చేలా ఉన్నాయి జాగ్రత్త. లక్కీ సంఖ్య: 6

ధనస్సు రాశి:

మీరు యోగా.. ధ్యానంతో రోజుని ప్రారంభించండి. ఇది మీకు చాలా అనుకూలిస్తుంది.  మరియు మీయొక్క శక్తిని రోజంతా ఉండేలా చేస్తుంది. ఆర్థికపరంగా మీకు మిశ్రమంగా ఉంటుంది. మీమాటలను కఠినంగా వాడతారు. పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగించగలదు. లక్కీ సంఖ్య: 3

మకరరాశి:

మీ పెట్టుబడే మీకు ఆశీర్వాదం.. అది మిమ్మల్ని ఎన్నో చెడుల నుంచి కాపాడుతుంది. సందేహం, నిరాశ, అవిశ్వాసం, దురాశ తో కూడిన అహంకారం ఇంకా ఈర్ష్య. లాంటి వాటిని వదిలేయండి.  వ్యాపారస్తులు వారి వ్యాపారము కోసము ఇంటి నుండి బయటకు వెళ్లినట్టయితే ధనాన్ని జాగ్రతగా భద్ర పరుచుకోవాలి. లక్కీ సంఖ్య: 3

కుంభరాశి:

కాఫీని ప్రత్యేకించి గుండె జబ్బు ఉన్నవారు మానండి. రోజులోని రెండవ భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. మీ కరకు స్వభావం మీ తల్లిదండ్రుల ప్రశాంతతను పాడు చేస్తుంది. వారి సలహాలకు మీరు తల ఒగ్గవలసి ఉంటుంది. అందరినీ బాధించే కంటే వినయంగా ఉండడం ఎంతో మంచిది. లక్కీ సంఖ్య: 1

మీనరాశి:

ఈరోజు రుణదాత మీ దగ్గకు వచ్చి మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని తిరిగి చెల్లించమని కోరతాడు. కాబట్టి మీరు తిరిగి ట్టేయ వలసి ఉంటుంది. కానీ మీకు తరువాత ఆర్ధిక సమస్యలు తలెత్తుతాయి. కావున అప్పు చేయకుండా ఉండండి. లక్కీ సంఖ్య: 8

ALSO READ: ఆ రాశి అమ్మాయిలతో జాగ్రత్త – లేదంటే ఇక అంతే

 

Related News

Gemstone: మీ రాశి ప్రకారం.. ఏ రత్నాన్ని ధరిస్తే అదృష్టం వరిస్తుందో తెలుసా ?

Today Horoscope in Telugu: నేటి రాశిఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా.. (06/09/2025)

Dreams: కలలో ఆ దేవుళ్ళు కనిపిస్తే జాగ్రత్త – అసలు స్వప్న శాస్త్రం ఎం చెప్తుందంటే

lunar eclipse: చంద్రగ్రహణం నుంచి ఆ రాశుల జాతకులకు రాజయోగం పట్టనుందట – ఆ రాశులేవో తెలుసా..?

Girl Names: ఆడపిల్లలకు ఆ పేర్లు అస్సలు పెట్టకూడదట – ఆ పేర్లేంటో తెలుసా..?

Big Stories

×