BigTV English

OTT Movie : కాబోయే సీఈఓతో హోటల్ రూమ్ లో అలాంటి పనులు… బుర్రపాడు సీన్లు… ఈ డార్క్ కామెడీ క్లైమాక్స్ డోంట్ మిస్

OTT Movie : కాబోయే సీఈఓతో హోటల్ రూమ్ లో అలాంటి పనులు… బుర్రపాడు సీన్లు… ఈ డార్క్ కామెడీ క్లైమాక్స్ డోంట్ మిస్

OTT Movie : సైకలాజికల్ థ్రిల్లర్ సినిమాలు చివరి వరకు సస్పెన్స్ ని క్రియేట్ చేస్తుంటాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ పెట్టిస్తుంటాయి. ఈ నేపథ్యంలో వచ్చిన ఒక సైకలాజికల్ థ్రిల్లర్ కామెడీ ఎలిమెంట్స్ తో తెరకెక్కింది. అయితే ఈ సినిమా మానసిక ఆటలతో మెంటలెక్కిస్తుంది. ఒక జంట ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించుకోవడానికి చేసే ప్రయత్నమే ఈ కథ. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళ్తే ..


ఏ ఓటీటీలో ఉందంటే

‘సాంక్చురీ’ (Sanctuary) 2022లో విడుదలైన అమెరికన్ డార్క్ కామెడీ-సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం. జాకరీ విగన్ దర్శకత్వంలో మార్గరెట్ క్వాలీ (రెబెక్కా), క్రిస్టోఫర్ అబాట్ (హాల్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2022 సెప్టెంబర్ 11న టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రీమియర్ జరిగి, 2023 మే 19న యునైటెడ్ స్టేట్స్‌లో థియేట్రికల్ రిలీజ్ అయింది. 1 గంట 36 నిమిషాల రన్‌టైమ్‌తో ఈ చిత్రం IMDbలో 6.2/10 రేటింగ్ పొందింది. ఈ సినిమా జియో హాట్ స్టార్, అమెజాన్ వీడియో, హులులో అందుబాటులో ఉంది.

కథలోకి వెళ్తే

ఈ కథ హాల్ అనే వ్యక్తి చుట్టూ తిరుగుతుంది. అతను ఒక ధనవంతుడైన వ్యాపారవేత్త కొడుకు. తన తండ్రి మరణం తర్వాత పోర్టర్ హోటల్స్ CEO పదవిని స్వీకరించడానికి సిద్ధమవుతాడు. హాల్ జీవితంలో రెబెక్కా అనే ఒక డామినేట్ యువతి కీలక పాత్ర పోషిస్తుంది. వీళ్లిద్దరి సంబంధం చాలా డిఫికల్ట్ గా ఉంటుంది. అది ప్రేమా ? లేకపోతే కామమా ? మరేదైనా ఉందా అనేది స్పష్టంగా ఉండదు. రెబెక్కా, హాల్‌ను మానసికంగా, శారీరకంగా నియంత్రిస్తూ, అతని బలహీనతలను ఉపయోగించుకుంటూ, అతని విజయంలో తన పాత్రను గుర్తుచేస్తుంటుంది. ఇక హాల్ తన కొత్త CEO బాధ్యతల కోసం తన లైఫ్ స్టైల్ ని మార్చుకోవాలని నిర్ణయించుకుని, రెబెక్కాతో సంబంధాన్ని ముగించడానికి ప్రయత్నిస్తాడు.


అతను ఆమెను హోటల్ సూట్‌కు బ్రేకప్ చెప్పడానికి ఆహ్వానిస్తాడు. కానీ రెబెక్కా, తన తెలివితేటలతో ఒక గేమ్‌ ను ప్లే చేస్తుంది. ఆమె గతంలో జరిగిన హాల్‌ బలహీనతలను బయటపెడుతుంది. అతను ఈ కొత్త జీవితానికి అర్హుడిగా నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తుంది. రెబెక్కా హాల్‌ను అతని సంస్థలో ఒక ముఖ్యమైన పదవి కోసం బ్లాక్‌మెయిల్ చేస్తుంది. అతని సీక్రెట్స్ ని బయటపెడతానని బెదిరిస్తుంది. వీళ్లిద్దరి పాత్రలు ఈ సినిమాలో ఒక గేమ్ లా వెళ్తుంటాయి. చూసే ప్రేక్షకులు కూడా వీళ్ళ కథని చూసి ఎవరు ఎవర్ని నియంత్రిస్తుంటారో చెప్పాలేక పోతారు. వీళ్ళ రొమాన్స్ కూడా హద్దులు దాటుతూ ఉంటుంది. క్లైమాక్స్ వరకు ఈ మానసిక యుద్ధం జరుగుతుంటుంది. వీళ్ళిద్దరూ కలసి ఉంటారా ? లేకపోతే విడిపోతారా ? అనేది ఈ సినిమాని చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : పని మనిషితో ఇంటి ఓనర్ రాసలీలలు… క్లైమాక్స్ ట్విస్ట్ హైలెట్… నిమిషానికో ట్విస్ట్ ఉన్న హర్రర్ మూవీ

Related News

OTT Movie : ఆ దెయ్యం వస్తే ఈ ఫ్యామిలికి చుక్కలే .. రాత్రయితే రచ్చే .. మాంత్రికుడి ఎంట్రీ తో ఇక అరుపులే

OTT Movie : 30 ఏళ్ల మహిళను పట్టుకుని పాడు పని… పిల్లలు పుట్టట్లేదని వెళ్తే ఇదెక్కడి దిక్కుమాలిన ట్రీట్మెంట్ సామీ ?

OTT Movie : పుట్టినరోజునే బలి… బర్త్ డేను డెత్ డే చేసే మాస్క్ కిల్లర్… టైం లూప్ లో చచ్చి బతుకుతూ… లాస్ట్ ట్విస్ట్ అదుర్స్

OTT Movie : కోరి శాపాన్ని కొని తెచ్చుకునే ఫ్యామిలీ… నెక్లెస్ కు దెయ్యాలతో లింక్… సీట్ చిరిగిపోయే హర్రర్ మూవీ

OTT Movie’s: ఘాటీ, మదరాసి ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ ఫిక్స్.. ఎప్పుడు ఎక్కడ చూడొచ్చంటే ?

Big Stories

×