BigTV English

Airtel vs BSNL: 28 డేస్ వ్యాలిడిటీ.. ఈ ప్లాన్ వెనుక టెలికాం కంపెనీలు లాజిక్ ఏంటి?

Airtel vs BSNL: 28 డేస్ వ్యాలిడిటీ.. ఈ ప్లాన్ వెనుక టెలికాం కంపెనీలు లాజిక్ ఏంటి?

28 Days Recharge Plan:

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. పట్టణాల్లో ఉండే ప్రజలతో పాటు గ్రామాల్లో దిగువ మధ్య తరగతి ప్రజల వరకు ఫోన్ అనేది కామన్ అయ్యింది. అంతేకాదు, ప్రతి వారు స్మార్ట్ ఫోన్ ను ఉపయోగిస్తున్నారు. సోషల్ మీడియాలను కూడా ఫాలో అవుతున్నారు. యూట్యూబ్ మొదలుకొని ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా కూడా చూస్తున్నారు. వారంతా రీఛార్జ్ చేసుకోవాలి. ఈ నేపథ్యంలో దేశంలో నాలుగు ప్రధాన టెలికాం కంపెనీలు  ఉన్నాయి.  జియో, ఎయిర్‌ టెల్, వోడాఫోన్ ఐడియా, BSNL. ఫోన్‌ ను ఉపయోగించడానికి, మనం ప్రతి నెలా రీఛార్జ్ చేసుకోవాలని అందరికీ తెలుసు. కానీ అన్ని కంపెనీలు 28 రోజుల చెల్లుబాటును మాత్రమే ఎందుకు ఇస్తాయి? అని ఎప్పుడైనా ఆలోచించారా? దాని వెనుక ఉన్న కారణాన్ని తెలుసుకుందాం.


28 రోజుల చెల్లుబాటు ఎందుకు ఉంది?

జియో, ఎయిర్‌ టెల్‌ తో సహా అన్ని కంపెనీల చాలా ప్లాన్‌లు 28 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉన్నాయి. కొన్ని సంవత్సరాల క్రితం వరకు, దాదాపు అన్ని కంపెనీలు తమ ప్లాన్లలో 30 రోజుల వ్యాలడిటీ ఇచ్చేవి. కానీ, ఇప్పుడు చాలా ప్లాన్లు 28 రోజులు మాత్రమే. 28 రోజుల వ్యాలిడిటీ ఇవ్వడం వెనుక కారణం కంపెనీల లాభాలకు నేరుగా సంబంధించినది. వాస్తవానికి, సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి. కొన్ని నెలలకు 28 రోజులు, కొన్ని నెలలకు 31 రోజులు ఉంటాయి. కంపెనీలు 28 రోజుల చెల్లుబాటును ఇచ్చినప్పుడు, వినియోగదారులు సంవత్సరంలో 12 సార్లు కాకుండా 13 సార్లు రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది. టెలికాం కంపెనీలు పూర్తి 30 రోజుల వ్యాలిడిటీ ఇవ్వడం ప్రారంభిస్తే, వారు నష్టాలను భరించాల్సి ఉంటుంది. ఈ నష్టాన్ని నివారించడానికి, వారు 28 రోజుల వ్యాలిడిటీ ఇస్తారు. ఈ నేపథ్యంలో కొన్ని అదనపు రోజులు మిగిలి ఉంటాయి.

Read Also:  జస్ట్ రూ. 319కే 65 డేస్ వ్యాలిడిటీ.. అన్ లిమిటెడ్ కాల్స్, డేటా కూడా..


28 రోజుల వ్యాలిడిటీపై బోలెడు ప్రశ్నలు  

టెలికాం కంపెనీలు అందించే 28 రోజుల వ్యాలిడిటీకి సంబంధించి చాలాసార్లు ప్రశ్నలు ఉత్పన్నం అయ్యాయి. గతంలో, కంపెనీలు తమ ప్లాన్‌ ను 1 నెల ప్లాన్ అని చెప్పేవి. కానీ, ఇప్పుడు కస్టమర్లకు 28 రోజుల వ్యాలిడిటీని అందిస్తున్నాయి. ఆ తర్వాత TRAI కూడా దీనిలో జోక్యం చేసుకుంది. ఏదైనా ప్లాన్‌ ను నెలవారీ ప్లాన్ విభాగంలో చేర్చినట్లయితే, మీరు పూర్తి 30 రోజుల చెల్లుబాటును ఇవ్వవలసి ఉంటుందని టెలికాం కంపెనీలకు తేల్చి చెప్పింది. అయితే, దీని తర్వాత కూడా, ఎటువంటి ప్రభావం కనిపించలేదు. టెలికాం కంపెనీలు తమ 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్లు నెలవారీ ప్లాన్లు అని చెప్పుకోవు. మొత్తంగా 28 రోజుల ప్లాన్ పేరుతో వినియోగదారుల నుంచి అదనంగా ఒక నెల రీఛార్జ్ ను పొందుతున్నాయి.

Read Also: 72 రోజుల వ్యాలిడిటీ, డైలీ 2GB డేటా.. BSNL నుంచి మరో అదిరిపోయే ప్లాన్!

Related News

Cars price drop: కార్ల ప్రేమికులకు గుడ్ న్యూస్.. ఒక్కసారిగా రేట్లు ఢమాల్.. కొత్త రేట్లు ఇవే!

Google Pixel 10: గూగుల్ పిక్సెల్ 10 భారీ ఆఫర్స్‌తో భారత్‌లో లాంచ్. ధర ఎంతో తెలుసా?

BSNL New Plan: జస్ట్ రూ. 319కే 65 డేస్ వ్యాలిడిటీ.. అన్ లిమిటెడ్ కాల్స్, డేటా కూడా..

Amazon Offers: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2025.. స్మార్ట్ ఫోన్స్ బెస్ట్ ఆఫర్స్!

Tesla Sales: ఇండియాలో ఫస్ట్ టెస్లా కార్ ఓనర్ ఆయనే.. ఆ కారు ఫీచర్లు ఇవే

Big Stories

×