BigTV English

Cold Water Bath In Winter : చలికాలంలో చన్నీళ్ల స్నానం మంచిదేనా?

Cold Water Bath In Winter : చలికాలంలో చన్నీళ్ల స్నానం మంచిదేనా?

Cold Water Bath In Winter : ప్రతి పనిలో లాభ నష్టాలు ఉంటాయి. చాలా మంది వేడి నీటితో స్నానం చేస్తారు. మరికొందరు ఎంత చలిగా ఉన్నా చన్నీటితోనే స్నానం చేస్తారు. అయితే చన్నీటితో స్నానం చేస్తే ఏమవుతుందనే అపోహ చాలా మందిలో ఉంటుంది. అయితే చన్నీటితో స్నానం చేయడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. ఆరోగ్యంగా ఉన్న యువతీయువకులు ఏ సందేహం లేకుండా చన్నీటితో స్నానం చేయవచ్చు. ఒంటిపై పడే చల్లని జల్లులు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. చల్లని నీటి వల్ల ధమనులు బలంగా మారుతాయి, అంతేకాకుండా రక్తపోటు తగ్గి కొత్త ఉత్సాహం వస్తుంది. డిప్రెషన్‌ లక్షణాలు కూడా పోతాయి. వాపు, కండరాల నొప్పులు కూడా తగ్గిపోతాయని నిపుణులు అంటున్నారు. చన్నీటి స్నానం జుట్టుకు కూడా చాలా మంచిది. కేశ రంధ్రాలు ధూళితో మూసుకుపోకుండా ఇవి చేస్తాయి. చన్నీటి స్నానంతో జీవక్రియ రేటు పెరుగుతుంది. అంతేకాకుండా బరువు తగ్గేందుకు సాయపడుతుంది. అయితే చలికాలంలో ఎక్కువగా చన్నీటితో స్నానం చేస్తే అనేక సమస్యలు వస్తాయంటున్నారు. ఆస్తమా వ్యాధిగ్రస్తులకు ప్రాణాంతకంగా మారొచ్చు. బ్రెయిన్‌ స్ట్రోక్‌, గుండెపోటుకు కారణం కావచ్చని వైద్యులు అంటున్నారు. మధుమేహం వంటి దీర్ఘకాలిక రోగాలు ఉన్న వృద్ధులు చన్నీటి స్నానానికి దూరంగా ఉంటే మంచిది. చన్నీటి స్నానం వల్ల రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో జలుబు, దగ్గు, న్యుమోనియా, గొంతులో చిరాకు, జ్వరం తదితర సమస్యలు వస్తాయి. చలి కాలంలోనే కాదు ఏ కాలంలో అయినా గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే మంచిదని వైద్యులు అంటున్నారు. చలికాలం తలస్నానం చేసేప్పుడు ముందు తలపై నీళ్లు పోసుకోకూడదు. ఇది స్ట్రోక్స్‌ ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. తరచూ వ్యాయామం చేయడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. చురుకుగానూ ఉంటారు. తాజా పండ్లు, ఆకుకూరలతో సమతుల ఆహారం తీసుకోవడం ఉత్తమం అని నిపుణులు అంటున్నారు.


Tags

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×