iPhone 17 Connectivity Problems| ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్ యూజర్లు కొత్త సమస్యలు ఎదుర్కొంటున్నారు. ‘స్క్రాచ్‌గేట్’ సమస్య ముగినట్లు అనిపించినా.. వై-ఫై, బ్లూటూత్ సమస్యలు తలెత్తాయి. రెడ్డిట్, ఆపిల్ ఫోరమ్‌లలో యూజర్లు కార్‌ప్లే, ఎయిర్‌పాడ్స్ వంటి డివైజ్ లలో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నట్లు చెబుతున్నారు.
ఈ సమస్యలకు స్పష్టమైన కారణం తెలియకపోయినా.. ఆపిల్ N1 చిప్‌తో సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. ఆపిల్ త్వరగా ఈ సమస్యలకు పరిష్కారం తీసుకురాబోతున్నట్లు సమాచారం.
యూజర్ల సమస్యలు
ఫోన్ అన్‌లాక్ చేసినప్పుడు వై-ఫై కొద్దిసేపు డ్రాప్ అవుతోంది, తర్వాత కనెక్ట్ అవుతుంది. ఇది కార్‌ప్లేలో ఆడియో స్కిప్ లేదా ల్యాగ్‌కు దారితీస్తోంది. మరికొందరు డ్రైవింగ్ సమయంలో కార్‌ప్లే పూర్తిగా డిస్‌కనెక్ట్ అవుతోందని చెబుతున్నారు. బ్లూటూత్‌లో ఎయిర్‌పాడ్స్, ఇతర యాక్సెసరీలు తరచూ డిస్‌కనెక్ట్ అవుతున్నాయి. విజన్ ప్రో కొన్నిసార్లు అన్‌లాక్ కావడం లేదు. ఈ సమస్యలు ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లలో ఎక్కువ.
ఆపిల్ వాచ్ సమస్యలు
ఆపిల్ వాచ్ ఉన్నవారికి ఈ సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాచ్ అన్‌లాక్ అయినప్పుడు వై-ఫై ఫెయిల్ అవుతోంది. కార్‌ప్లే రీస్టార్ట్ అవుతోందని ఒక యూజర్ చెప్పారు. ఇది సాఫ్ట్‌వేర్ సమస్య అని, హార్డ్‌వేర్ సమస్య కాదని టెస్టింగ్ చూపిస్తోంది. వాచ్ తీసివేస్తే కనెక్షన్లు స్థిరంగా ఉంటున్నాయి.
N1 చిప్ కారణమా?
ఆపిల్ N1 చిప్ తోనే ఐఫోన్ 17కు వై-ఫై 7, బ్లూటూత్ 6 ఫీచర్లు పనిచేస్తున్నాయి. ఈ కొత్త చిప్‌లోని బగ్‌లే సమస్యలకు కారణమని ఊహిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌తో ఈ సమస్యలు పరిష్కారం కావచ్చు.
సమస్యలకు బీటా ఫిక్స్
iOS 26.1 బీటా వెర్షన్ లో ఈ సమస్యలకు పరిష్కారం ఉంటాయని.. వై-ఫై, బ్లూటూత్ స్థిరంగా ఉన్నాయని టెస్టర్లు చెబుతున్నారు. వాచ్OS 26.1 బీటా అప్‌డేట్ కూడా సహాయపడుతుంది. iOS 26.0.1 త్వరలో విడుదల కానుంది, ఈ బగ్‌లను టార్గెట్ చేస్తుంది.
యూజర్లకు టిప్స్
లేటెస్ట్ iOS బీటాకు అప్‌డేట్ చేయండి. ఆపిల్ వాచ్‌ను తాత్కాలికంగా అన్‌పెయిర్ చేయండి. ఫోన్ రీస్టార్ట్ చేయండి. iOS 26.0.1 కోసం వేచి ఉండండి. ఆపిల్ సపోర్ట్‌కు సమస్యలు రిపోర్ట్ చేయండి.
Also Read: ఐఫోన్ 17 కెమెరాలో సమస్యలు.. ఆపిల్ ఏం చెప్పిందంటే..