Pushpa 3: సుకుమార్ (Sukumar ) .. అల్లు అర్జున్ (Allu Arjun)తో ఆర్య, ఆర్య 2 చిత్రాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకొని.. పుష్ప సినిమాతో ఏకంగా పాన్ ఇండియా రికార్డ్స్ క్రియేట్ చేశారు. అంతేకాదు ఈ సినిమాకి అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు కూడా లభించింది. పుష్ప 2 సినిమా చేసి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన రెండవ చిత్రంగా నిలిచింది. అలా ఈ చిత్రాలతో వరుసగా సుకుమార్ – అల్లు అర్జున్ కాంబినేషన్ కి మంచి డిమాండ్ కూడా ఏర్పడింది. ఇదిలా ఉండగా పుష్ప 3 ఉంటుందని పుష్ప 2 క్లైమాక్స్ లోనే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై మళ్లీ ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ లేదు. కానీ ఇప్పుడు తాజాగా దేవుడి సన్నిధిలో పుష్ప 3 గురించి అప్డేట్ ఇచ్చారు సుకుమార్.
అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవల తన కూతురు ‘గాంధీ చెట్టు తాతా’ సినిమాకు గాను బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా సుకృతి వేణి నేషనల్ అవార్డును దక్కించుకున్న విషయం తెలిసిందే. అనంతరం రాజమండ్రిలో ఒక కార్యక్రమానికి హాజరైన సుకుమార్ మీడియాతో మాట్లాడుతూ.. “పుష్ప 3 సినిమా ఖచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం రామ్ చరణ్ (Ram Charan) హీరోగా ‘పెద్ది’ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాను. నా సినిమాలన్నీ కూడా గోదావరి జిల్లాలోనే ఎక్కువగా తీస్తున్నాను. గోదావరి జిల్లాల వాడిని కావడం అదృష్టంగా భావిస్తున్నాను. రాజమండ్రి అంటే నాకు ఎంతో ఇష్టం. నేను తీసిన రంగస్థలం,పుష్ప వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఇక్కడి నుంచే ప్రాణం పోసుకున్నాయి ” అంటూ సుకుమార్ తెలిపారు. మొత్తానికైతే సుకుమార్ పుష్ప 3 ఉంటుందని క్లారిటీ ఇవ్వడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవని చెప్పవచ్చు.
పుష్ప 3 పై గతంలోనే దేవిశ్రీప్రసాద్ క్లారిటీ..
ఇకపోతే సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్ (Devi Sri Prasad) కూడా గతంలో పుష్ప 3 అప్డేట్ ఇచ్చిన విషయం తెలిసిందే. పుష్ప 2 సినిమా సక్సెస్ అందుకున్న తర్వాత దర్శకుడు సుకుమార్ పుష్ప పార్ట్ 3కి సంబంధించి నిరంతరం పనిచేస్తున్నారని దీనిపై రీ వర్క్ కూడా చేస్తున్నారంటూ తెలిపారు. ఇంకా ప్రస్తుతం పుష్ప 3 సినిమా అప్డేట్ ఇవ్వడంతో అభిమానులే కాదు పుష్ప మూవీ లవర్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ:Sai Pallavi: ట్రోల్స్ మధ్య ప్రతిష్టాత్మక అవార్డు అందుకోబోతున్న సాయి పల్లవి!
సుకుమార్ సినిమాలు..
సుకుమార్ విషయానికి వస్తే.. తెలుగు చలనచిత్ర దర్శకుడిగా, రచయితగా మంచి పేరు తెచ్చుకున్న ఈయన ఇండస్ట్రీలోకి రాకముందు గణితం అధ్యాపకుడిగా పనిచేశారు. లెక్కలు మాస్టర్ గా పేరు సొంతం చేసుకున్న సుకుమార్…2004లో అల్లు అర్జున్ తో కలిసి ఆర్య సినిమా చేశారు. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. అల్లు అర్జున్ ని స్టార్ గా నిలబెట్టింది కూడా.. రెండవ చిత్రం రామ్ పోతినేని తో జగడం చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత ఆర్య 2, 100% లవ్, వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో, రంగస్థలం ఇలా ఎన్నో చిత్రాలు చేసి తన మార్క్ చూపించారు సుకుమార్.