BigTV English

Anantapur News: థియేటర్లలో ఓజీ ఫిల్మ్.. ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వరుస ట్వీట్లు, షాకైన జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్

Anantapur News: థియేటర్లలో ఓజీ ఫిల్మ్..  ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వరుస ట్వీట్లు, షాకైన జూ.ఎన్టీఆర్ ఫ్యాన్స్

Anantapur News: అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మళ్లీ వార్తల్లోకి వచ్చేశారు. స్టార్ నటుడు పవన్ కల్యాణ్ నటించిన మూవీ ఓజీ గురువారం ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. ఆ మూవీ ట్రెండ్‌ని తనకు అనుకూలంగా మార్చుకునే పనిలో పడ్డారాయన. ఈ క్రమంలో ఆయన పేరు మీద వరుసగా ఎక్స్ వేదికగా ట్వీట్లు చూసి షాకయ్యారు అభిమానులు. ఇంతకీ ఆ ట్వీట్ల వెనుక ఏముంది? ఇదే చర్చ ఏపీ అంతటా మొదలైంది.


అనంతపుర ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గురించి చెప్పనక్కర్లేదు. జూనియర్ ఎన్టీఆర్ నటించి ‘వార్-2’ మూవీలో వార్తల్లోకి వచ్చేశారు సదరు ఎమ్మెల్యే. ఆయన వ్యవహారశైలిలోపై ఏపీ వ్యాప్తంగా పెద్ద చర్చ సాగింది. అంతేకాదు జూనియర్ అభిమానులు ఎమ్మెల్యే ఆఫీసుని ముట్టడించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు, ఆయన్ని పిలిచి గట్టిగా క్లాస్ పీకడంతో ఆ వివాదం ప్రస్తుతానికి సద్దు మణిగింది.

పవర్ స్టార్ పవన్‌కల్యాణ్ నటించిన ఓజీ సినిమా గురువారం ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయ్యింది. బుధవారం రాత్రి ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ ఎక్స్ ఖాతా నుంచి వరుసగా కొన్ని ట్వీట్లు హంగామా చేశాయి. వాటిని చూసినవాళ్లు మాత్రం పవన్ ఫ్యాన్స్-జూనియర్ అభిమానుల మధ్య చిచ్చుపెట్టినట్టుగా కనిపిస్తోందని అంటున్నారు.


‘‘ పవన్ కళ్యాణ్ సినిమా చూడటం జరిగింది. ఒక్కటే మాట.. 12 సంవత్సరాల కిందట తుఫాను చూశాను.. మళ్ళీ ఈప్పుడే అంతకంటే పెద్ద తుఫాను చూశాను, ఏకగ్రీవంగా ఇండస్ట్రీ హిట్ అని రాసుకొచ్చారు. దానికి ముందు ట్వీట్‌లో మరొకటి పెట్టారు.

ALSO READ: డీఎస్సీ విషయంలో జగన్ ఓటమి.. లోకేష్ గెలుపు

‘‘ సర్ లోకేష్ మన కల్యాణ్ సర్ మూవీ ఎలాంటి ఇబ్బందులు, అఘాతాలు లేకుండా అంగారంగా వైభవంగా జరుగుతున్నాయి. ఈ సంబరాలు చూస్తుంటే దసరా పండుగ 10 రోజులు ముందే వచ్చింది అనిపిస్తుంది. మీరు ఎలాంటి సందేహం పెట్టకండి అనంతపూర్ మొత్తం నా కంట్రోల్ లో ఉంది. మమ్మల్ని ఎవరూ ఆపేది లేదు’’ రాసుకొచ్చారు.

ఈ రెండింటి కంటే ముందు అంటే రాత్రి ఆయన పెట్టిన ట్వీటులో ‘‘ సార్ @PawanKalyan గారిది అదేమో క్రేజ్ సార్.. దగ్గరుంది చూసుకుందాం అనుకున్నా, అప్పటికే వెయ్యి మంది ఫోన్ చేశారు టికెట్ల కోసం. అదే క్రేజ్ సార్! కానీ కొంతమంది ఉంటారు, తాత పేరు చెప్పుకొని మా TDP పార్టీ పార్టీ అని చెప్పి టికెట్లు అమ్ముకుంటారు’’ అని రాసుకొచ్చారు.

ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వరుస ట్వీట్లు చూసినవారు రకరకాలుగా చర్చించు కుంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్-పవన్ కళ్యాణ్ అభిమానుల మధ్య తగాదా పెట్టేలా ఉన్నాయంటూ చర్చించుకోవడం మొదలైంది. కావాలనే మా ఎమ్మెల్యేపై పని గట్టుకుని ఇలాంటి ట్వీట్లు చేస్తున్నారని అంటున్నారు. దీనిపై అనంతపురం సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేసే అవకాశం ఉంది.

అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అమరావతి‌లో ఉన్నారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్.  ఇంతకీ ఈ ట్వీట్లు ఎవరి చేసినట్టు? ఆయన ప్రత్యర్థులు ఈ విధంగా స్కెచ్ వేశారా అంటూ గుసగుసలు మొదలయ్యాయి. సినిమాలు ఏమోగానీ ఈ విధంగానైనా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ లైమ్ లైట్‌లో ఉంటున్నారని అనుకుంటున్నారు.

 

 

Related News

Tirumala: తిరుమలలో దేశంలోనే తొలి ఏఐ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌

AP DSC: DSC విషయంలో జగన్ ఓటమి, లోకేష్ గెలుపు అదే

AP Heavy Rains: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఏపీకి అతి భారీ వర్ష సూచన.. రేపు ఈ జిల్లాల్లో

YS Jagan: మీది రెడ్ బుక్ అయితే.. మాది డిజిటిల్ బుక్, కథ వేరే ఉంటది.. జగన్ సంచలన వ్యాఖ్యలు

Yellow Shirt: అసలైన పసుపు సైనికుడు.. కూతురు పెళ్లిలో కూడా పసుపు చొక్కానే

Roja Hot Comments: శుక్రవారం వస్తే జంప్.. జగన్‌పై రోజా సెటైర్లు?

Digital Book: డిజిటల్ బుక్‌తో వైసీపీ వార్నింగ్.. రెడ్ బుక్ విజృంభించే టైమ్ వచ్చిందా?

Big Stories

×