Sai Pallavi:సాయి పల్లవి (Sai Pallavi).. విమర్శలకు చోటు ఇవ్వకుండా ట్రోల్స్ కి దూరంగా ఉండే ఈ ముద్దుగుమ్మ.. అప్పుడప్పుడు ట్రోల్స్ ఎదుర్కొంటోంది అని చెప్పవచ్చు. నిజానికి తన మాటలతో ట్రోల్స్ ఎదుర్కొన్నా.. డ్రెస్సింగ్ విషయంలో ఏ రోజు కూడా ఆమె ఒకరి చేత వేలెత్తి చూపించుకోలేదు. అలాంటిది కొంతమంది చేసిన పనికి సాయి పల్లవి దారుణంగా విమర్శలు మూటగట్టుకుంది. అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవల తన చెల్లెలు పూజా కన్నన్ (Pooja Kannan) ను కలవడానికి విదేశాలకు వెళ్లిన ఈమె.. అక్కడే తన చెల్లితో కలిసి బీచ్ లో ఎంజాయ్ చేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను పూజా తన ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది కూడా.. అయితే కొంతమంది ఈ ఫోటోలను దుర్వినియోగం చేస్తూ అందులో సాయి పల్లవి బికినీ వేసుకున్నట్లు కొన్ని ఫోటోలు, స్విమ్ సూట్ వేసుకున్నట్లు మరికొన్ని ఫోటోలు సృష్టించే సోషల్ మీడియాలో వదిలారు.
సాయి పల్లవికి అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు..
దీంతో పెద్ద ఎత్తున ఈమెపై విమర్శలు గుప్పించారు నెటిజన్స్. అయితే ఆ తర్వాత వాటిని ఆరా తీయగా.. అవి నిజం ఫోటోలు కాదని.. కొంతమంది టెక్నాలజీ ఉపయోగించి అలా తయారు చేశారని తెలిసి ఆ తర్వాత శాంతించారు. ఇలా తన తప్పు లేకపోయినా ట్రోల్స్ ఎదుర్కొన్న సాయి పల్లవి ఇప్పుడు అరుదైన ప్రతిష్టాత్మకమైన అవార్డును అందుకోబోతున్నారు. తమిళనాడు రాష్ట్రం నుండి సాయి పల్లవి తో పాటు మరికొంతమంది ఈ అవార్డుకు ఎంపికైనట్లు సమాచారం. మరి సాయి పల్లవికి వరించిన ఆ అవార్డు ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఉత్తమ నటి విభాగంలో కళైమామణి అవార్డు..
తమిళనాడు ప్రభుత్వం.. అత్యంత ప్రతిష్టాత్మకంగా అందించే కళైమామణి అవార్డుల జాబితాను బుధవారం ప్రకటించింది. కళా రంగంలో పలు విభాగాలలో కృషి చేసిన వారికి ప్రతి ఏడాది ఈ అవార్డులను అందిస్తారు. అందులో భాగంగానే 2021 – 2023 సంవత్సరాలకు గానూ ఏడాదికి 30 మంది చొప్పున 90 మంది కళాకారులు ఈ కళైమామణి అవార్డులకు ఎంపికైనట్లు తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. వీటితోపాటు ఎం.ఎస్.సుబ్బలక్ష్మి పేరిట జాతీయ పురస్కారానికి ప్రముఖ నేపథ్య గాయకుడు కే.జే. ఏసుదాసు (KJ Esudas) ను ఎంపిక చేస్తూ ప్రకటన జారీ చేసింది. అందులో భాగంగానే చలనచిత్ర విభాగంలో 2021 సంవత్సరానికి గానూ.. నటి సాయి పల్లవి (Sai Pallavi)కి, నటుడు ఎస్ జె సూర్య(SJ Suriya)కి 2023వ ఏడాదికి గాను సంగీత దర్శకుడు అనిరుధ్ (Anirudh)తోపాటు పలువురు ఈ పురస్కారాలను అందుకోబోతున్నారు.అక్టోబర్ నెలలో ఈ పురస్కారాల ప్రధానోత్సవం జరగనుంది. ప్రస్తుతం ఈ విషయం తెలియడంతో అటు సాయి పల్లవి, ఇటు సూర్య పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
ALSO READ:OG: ఓజీ విషయంలో త్రివిక్రమ్ సైలెన్స్.. కారణం ఏంటి?
సాయి పల్లవి సినిమాలు..
సాయి పల్లవి విషయానికి వస్తే.. ప్రస్తుతం బాలీవుడ్లో రెండు చిత్రాలలో నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. అమీర్ ఖాన్(Aamir Khan) తనయుడు జునైద్ ఖాన్ (Junaid Khan)హీరోగా నటిస్తున్న తొలి చిత్రం ‘ఏక్ దిన్’. ఈ సినిమా ద్వారా సాయి పల్లవి బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోంది. అలాగే హిందీ ‘రామాయణం’ సినిమాలో కూడా సీత పాత్ర పోషిస్తుంది సాయి పల్లవి. అలా బాలీవుడ్ లో సత్తా చాటడానికి సిద్ధమైన ఈమె అక్కడ ఎలాంటి సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి.
The UNIVERSE will balance everything, every time! 🧿♥️#SaiPallavi @Sai_Pallavi92 #Ramayana #KalaimamaniAwards pic.twitter.com/AQadcPsKxd
— Sai Pallavi FC™ (@SaipallaviFC) September 24, 2025