Pak vs Ban: ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ దశకు వచ్చేసింది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటికే ఫైనల్ కు టీమిండియా చేరగా… మరో జట్టు ఫైనల్ కు చేరాల్సి ఉంది. సూపర్ ఫోర్ లో భాగంగా ఇవాళ బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య అసలు సిసలు పోరు జరగనుంది. ఇందులో విజయం సాధించిన జట్టు నేరుగా ఫైనల్ కు వెళుతుంది. ఒకవేళ బంగ్లాదేశ్ విజయం… టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య ఫైట్ ఉంటుంది. అలా కాదని పాకిస్తాన్ విజయం సాధిస్తే… టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య ఆసియా కప్ 2025 టోర్నమెంట్ ఫైనల్ జరగనుంది. దీంతో ఇవాల్టి మ్యాచ్ చాలా కీలకంగా మారింది.
ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సూపర్ 4 లో భాగంగా ఇవాళ బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరుగనుంది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య కీలక పోరు ఉండనుంది. ఇక భారత కాలమానం ప్రకారం.. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.
ఇక టి20 లలో బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ రికార్డులు ఒకసారి పరిశీలిస్తే…. బంగ్లాదేశ్ కంటే పాకిస్తాన్ మెరుగైన ప్రదర్శన కనబరిచింది. ఈ రెండు జట్ల మధ్య మొత్తం 25 మ్యాచ్లు జరిగాయి. ఇందులో మొత్తం 20 మ్యాచ్లో పాకిస్తాన్ విజయం సాధించింది. అటు బంగ్లాదేశ్ ఐదు మ్యాచ్ లలోనే విజయం సాధించింది. అదే సమయంలో… వన్డేలు అలాగే టెస్టుల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇవాల్టి మ్యాచ్ లో కూడా… భారీగా రన్ రేట్ ఉన్న పాకిస్తాన్… గెలిచే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.
పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య ఇవాళ కృషియల్ ఫైట్ జరగనుంది. అయితే ఇందులో గెలిచిన జట్టు ఫైనల్ కు వెళుతుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో వర్షం లేదా ఇతర కారణాల వల్ల….. మ్యాచ్ రద్దు అయితే పరిస్థితి ఏంటి అని చర్చ కూడా సాగుతోంది. ఒకవేళ వర్షం పడి మ్యాచ్ రద్దు అయితే… రన్ రేట్ ఆధారంగా పాకిస్తాన్ ఫైనల్ కు వెళ్తుంది. ఎందుకంటే పాజిటివ్ రన్ రేట్ లో పాకిస్తాన్ ఉంది. మరి ఇవాళ మ్యాచ్ లో ఏం జరుగుతుందో చూడాలి.
Also Read: Abrar Ahmed – Wanindu Hasaranga: పాక్ బౌలర్ అబ్రార్ అసభ్యకరమైన సైగలు….ఇచ్చిపడేసిన హసరంగా
బంగ్లాదేశ్ అంచనా: 1 తాంజిద్ హసన్, 2 సైఫ్ హసన్, 3 లిట్టన్ దాస్ (కెప్టెన్ & wk), 4 తౌహిద్ హృదయ్, 5 షమీమ్ హొస్సేన్, 6 జాకర్ అలీ, 7 రిషద్ హొస్సేన్, 8 తంజిమ్ హసన్ సాకిబ్, 9 నసుమ్, 1 తహ్మద్ 1 తాస్కిన్,
పాకిస్థాన్ అంచనా: 1 సాహిబ్జాదా ఫర్హాన్, 2 ఫఖర్ జమాన్, 3 సైమ్ అయూబ్, 4 సల్మాన్ అఘా (కెప్టెన్), 5 హుస్సేన్ తలాత్, 6 మహ్మద్ హరీస్ (వారం), 7 మహ్మద్ నవాజ్, 8 ఫహీమ్ అష్రఫ్, 9 షాహీన్ షా అఫ్రిది, 10 హరీస్ 11