Gunde Ninda Gudi Gantalu Serial Today Episode: రోహిణి హాస్పిటల్‌కు వెళ్లి వస్తున్నానని బాబుకు పెద్ద గాయమే అయిందని అందుకే ఆ పెద్దావిడను ఓదార్చి వచ్చినట్టు చెప్తుంది. అయితే ఆ బాబు కు ఎవరూ లేరా అని మీనా అడిగితే మేనత్త ఉందట ఆవిడ కూడా దుబాయ్‌లో ఉందటని చెప్తుంది.
బాలు: బాబుకు సెలైన్ పెట్టారు కదా ఇక మనం ఇంటికి వెళదామా..?
మీనా: చింటూను వదిలేసి రాలేకపోతున్నాను.
బాలు: నాక్కూడా బాధగానే ఉంది. కానీ ఏం చేస్తాం.. తప్పదు కదా
మీనా: అయితే మీరు వెళ్లండి నేను ఇక్కడే ఉంటాను.
బాలు: వద్దులే ఎప్పుడు డిశ్శార్జ్ చేస్తారో తెలుసుకుని వస్తాను.
అంటూ వెళ్లబోతుంటే.. వెనక రోహిని కనిపిస్తుంది.
రోహిణి: మీరింకా వెళ్లలేదా..? నువ్వెందుకు అమ్మాయి అంతలా బాధపడుతున్నావు.
రోహిణి: చిన్న పిల్లాడు.. ఎవరూ లేని బాబు కదా అందుకే
అంటూ రోహిణి చెప్పగానే.. బాలుకు అనుమానం వస్తుంది. వెంటనే ఇంటికి తీసుకెళితే నిజం తెలుస్తుందని మనసులో అనుకుంటాడు. వీళ్లిద్దరి మధ్య రిలేషన్ తెలుసుకోవాలంటే చింటూని ఇంటికి తీసుకెళ్లాలని అనుకుంటాడు. అలాగే పెద్దావిడను ఒప్పించి చింటూను ఇంటికి తీసుకెళ్తారు బాలు మీనా. ఇంట్లోకి బాలు చింటూను ఎత్తుకుని వస్తాడు.
మనోజ్: అయ్యో ఏమైంది వాడికి ఎందుకలా ఎత్తుకుని వస్తున్నావు
అని మనోజ్ అడగ్గానే జరిగిన విషయం మొత్తం చెప్తాడు బాలు. విషయం తెలుసుకున్న ప్రభావతి కోప్పడుతుంది.
ప్రభావతి: మీకే ఇక్కడ దిక్కు లేదంటే మళ్లీ వాళ్లను ఎందుకు తీసొకొచ్చారు..
మనోజ్: అయ్యో అమ్మా ఎందుకలా మాట్లాడతావు.. ఉండనివ్వు అమ్మా
రవి: అన్నయ్య నువ్వేనా ఇలా మాట్లాడేది.
మనోజ్: అవును రవి నేను ఇంతకు ముందు వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు నన్ను చాలా బాగా చూసుకున్నారు.
రోహిణి: వాళ్లకు కావాలంటే మా రూం ఇస్తాం. మా ఆయనే వాళ్ల గురించి అంతలా చెప్తున్నారంటే ఆలోచించాల్సిందే.. పైగా చిన్న బాబు ఉన్నారు కదా..?
ప్రభావతి: అది కాదమ్మా..
సత్యం: ఏయ్ ఆగు.. నువ్వు ఇంకో మాట మాట్లాడితే నీవు బయటకు వెళ్లు.. లేదా ఇంట్లో నువ్వే ఉండు మేమే అద్దె ఇంట్లోకి వెళ్లిపోతాం. ఇంటి యజమానిగా ఇది నా నిర్ణయం
అని చెప్పగానే అందరూ షాక్ అవుతారు. ప్రభావతి ఏమీ మాట్లాడకుండా ఉంటుంది. తర్వాత అందరూ భోజనం చేస్తుంటారు. మీనా భోజనాలు వడ్డిస్తుంటే.. బాబును తాను చూసుకుంటానని రోహిణి చెప్తుంది. దీంతో రోహిణిని బాలు మళ్లీ అనుమానిస్తాడు. ఇంతలో ప్రభావతి వచ్చి రోహిణి, చింటూలను చూసి తిడుతుంది.
ప్రభావతి: తల్లి తండ్రి ఎవరో తెలియదు. వీళ్ల అమ్మ ఎవరితో వెళ్లిపోయిందో ఏమో.. ఈ తల్లేమో కూతురు చేసిన పాపాన్ని మోసుకుని తిరుగుతుంది. వీళ్లను ఇంట్లోంచి తరిమేయాలి.. అందుకు నువ్వే మంచి ఐడియా ఇవ్వాలి
రోహిణి: నేను ఏం ఐడియా ఇవ్వగలను.. నేనేం చెప్పలేను..
ప్రభావతి: మీనా పూల కొట్టు విషయంలో మంచి ఐడియా ఇచ్చావుగా నీ ఐడియా వల్లే దాని పూల కొట్టు తీసేయాల్సి వచ్చింది. ఈ దరిద్రాన్ని ఇంట్లో పెట్టుకుని మనఃశాంతిగా ఉండలేను
అంటూ వెళ్లిపోతుంది. తర్వాత చింటూ, రోహిణి చుట్టూ తిరుగుతూ అమ్మ అంటాడు. అలా పిలవడంతో అందరూ వింటారు. కానీ రోహిణి మాత్రం అవును నేను మీ అమ్మనే అంటూ చింటూకు చెప్తుంది. ఇంతటితో గుండె నిండా గుడి గంటలు ఈరోజు ఏపిసోడ్ అయిపోతుంది.