BigTV English

Temple:ఆలయానికి ఒట్టి చేతులతో వెళ్లకూడదా….

Temple:ఆలయానికి ఒట్టి చేతులతో వెళ్లకూడదా….

Temple:గుడికి వెళ్లేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్లకూడదంటారు. పండో, ఫలమో, పుష్పమో తీసుకెళ్లాలంటారు. ఆలయానికి వెళ్లే ముందు శుభ్రంగా స్నానం చేసి సంప్రదాయ దుస్తులు ధరించాలి. ఖరీదైన బట్టలు, ఫ్యాన్సీ నగలకు దూరంగా ఉండాలి. గుడికి వెళ్లేముందు ఇంట్లో దీపం వెలిగించి పూజించాలి. ఆపై దేవాలయానికి వెళ్లి పూజలు చేయడం ద్వారా సర్వ శుభాలు చేకూరుతాయి. అలాగే దేవాలయాలకు వెళ్లేటప్పు ఒట్టి చేతులతో వెళ్లకూడదు. అలాగే నూనె, కర్పూరం లేదా పువ్వులు పట్టుకెళ్లవచ్చు. ఆలయంలోకి ప్రవేశించగానే, దీపస్తంభం ముందు నిలబడి ప్రధాన విగ్రహాన్ని పూజించాలి
ప్రస్తుతం చాలా దేవాలయాల్లో నెయ్యి దీపాలు వెలిగించి పూజలు చేస్తున్నారు. . దీపమును నోటితో ఆర్పరాదు. ఒక దీపం వెలుగుచుండగా, రెండో దీపాన్ని మొదటిదీపంతో వెలిగించకూడదు . దీపం వెలిగించగానే బయటకు వెళ్ళరాదు.


గుడి చుట్టు ప్రదక్షిణలు చేసి చుట్టుపక్కల దేవతలను పూజించాలి. ప్రాకారం చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత గర్భగుడిలోకి వెళ్లి ప్రార్థనలు చేయడం మంచిది. వినాయకునికి ఒకసారి ప్రదక్షణ, శివునికి మూడుసార్లు ప్రదక్షణలు చేయడం.. దేవతలకు 3సార్లు ప్రదక్షణలు, విష్ణువు, దేవి ఆలయాలకు వెళ్తే నాలుగు సార్లు ప్రదక్షణలు చేయడం మరిచిపోకూడదని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

ఏ దేవాలయానికి వెళ్ళినా మొదట ధ్వజస్తంభాన్ని దర్శించాలి. శివాలయమునకు వెళ్ళినపుడు మొదట నవగ్రహాలను దర్శించి , ప్రదక్షిణాలు చేసి, కాళ్ళు కడుగుకొని తరువాత శివ దర్శనం చేసుకోవాలి. అదే విష్ణు ఆలయాలు దర్శించినపుడు మొదట విష్ణుమూర్తిని దర్శించి తరువాత మిగతావారిని దర్శించాలి. మొదట పాదములను చూసిన తరువాత ఆపాదమస్తకము దర్శించాలి.


Jonnawada : మహిళ ద్వారపాలకులున్న ఆలయం ఎక్కడుంది?

Plants : మొక్కలతో ముచ్చట్లు.. వాటి ఆరోగ్యానికి మేలు..

Related News

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Raksha Bandhan 2025: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు

Big Stories

×