Dhee Raju : బుల్లితెర పై డ్యాన్స్ రియాల్టీ షో ఢీ షో ద్వారా ఎంతో మంది డ్యాన్సర్స్ జీవితాలు పూర్తిగా మారిపోయింది. దేశం నలుమూలల నుంచి డ్యాన్సర్స్ వచ్చి తమ టాలెంట్ ను ప్రూవ్ చేసుకున్నారు. అందులో ఎంతో మంది ఇప్పుడు సినిమాలకు కోరియోగ్రాఫర్ గా వ్యవహారిస్తున్నారు.. అలాంటి టాలెంటెడ్ డాన్సర్లలో రాజు ఒకరు. తన డ్యాన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. గతంలో ఢీ షో విన్నర్ గా ట్రోఫీని అందుకున్నాడు. ఆ తర్వాత పలువురికి డాన్స్ మాస్టర్ గా వ్యవహరిస్తూ బిజీగా ఉన్నాడు. ఈ మధ్య మళ్లీ ఢీ షోలో డాన్సర్ గా కనిపిస్తున్నాడు. అయితే రాజు కొరియోగ్రాఫర్ గా సినిమాలకైతే చేయలేదు. హీరోలకు పర్సనల్ డ్యాన్సర్ వ్యవహారిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజు తన లవ్ స్టోరీల గురించి బయట పెట్టాడు.. అది కాస్త హాట్ టాపిక్ అవుతుంది.
డ్యాన్సర్ గా కెరీర్ స్టార్ట్..
ఈటీవీ తెలుగు ఛానల్ లో ఢీ షో అనే డాన్స్ ప్రోగ్రాం ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఈ షోలో ఎంతోమంది డాన్సర్లు తమ టాలెంట్ ని ప్రూవ్ చేసుకుంటున్నారు. తన టాలెంట్ ని నమ్ముకొని ఎంతో కష్టపడి ఆ షో విన్నర్ గా నిలిచాడు డ్యాన్సర్ రాజు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజు తన జీవితంలో జరిగినా ఎన్నో విషయాల గురించి షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా తన ప్రేమ గురించి బయటపెట్టి అందరికీ కన్నీళ్లు తెప్పించాడు. అతను డాన్సర్ గా చేస్తున్నప్పుడే ఒక అమ్మాయిని ప్రేమించాడన్న విషయం అందరికీ తెలిసిందే.. ఆ తర్వాత తన లైఫ్ ఢీ కి అంకితం చేశాడు.
Also Read : సైలెంట్ గా పని కానిచ్చేసిన డార్లింగ్.. ‘ఫౌజీ ‘ కోసం పక్కా ప్లాన్..
ఇద్దరితో లవ్ బ్రేకప్..
ఢీ రాజు లవ్ స్టోరీ గురించి గతంలో చాలా సందర్భాల్లో బయట పెట్టాడు. తాజాగా మరో ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. తన జీవితం మళ్లీ తిరిగి ప్రారంభించాను అని అన్నాడు. ఈషా దూరం అవడంతో ఆ తర్వాత డిప్రెషన్ లోకి వెళ్లి ఎన్నో అవకాశాలను కోల్పోయాడు. తన జీవితాన్ని మళ్లీ మొదటి నుంచి మొదలుపెట్టే స్థితికి రాజు వచ్చాడు. ఈ విషయాన్ని ఆ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు.. అయితే ఆమె కాకుండా మరో ఇద్దరు కూడా ఉన్నారంటూ తాజాగా వార్తలు. అక్సా ఖాన్ తో కూడా ప్రియమైన నడిపినట్లు బయటపడ్డాడు.. మొత్తానికి రాజు ఇద్దరు తో ప్రేమలో పడి ఇప్పుడు కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నాడు. ఇకపోతే ఈ డ్యాన్సర్ హీరోలకి ఎవరికి కొరియోగ్రాఫర్ గా పని చేయలేదా అనే ప్రశ్న ఎదురవ్వగా.. హీరో సుధీర్ బాబుకు పర్సనల్ డాన్సర్ గా కొద్ది రోజులుగా పనిచేసాను. ఆయన ఎన్నో సినిమాలకు నేను డాన్స్ స్టెప్పులు నేర్పించాను. అందుకే ఆయన నన్ను బాగా ఆదరించారని నిజాన్ని బయట పెట్టారు.. మరి కొంతమంది పిల్లలకు డ్యాన్స్ మాస్టర్ గా వ్యవహారిస్తున్నారు..