BigTV English

Naturalstar Nani : వెంక‌టేష్ మ‌హా – KGF 2 వివాదం.. రియాక్ట్ అయిన నాని

Naturalstar Nani : వెంక‌టేష్ మ‌హా – KGF 2 వివాదం.. రియాక్ట్ అయిన నాని
Naturalstar Nani

Naturalstar Nani : నేచుర‌ల్ స్టార్ నాని కొన్ని ప్ర‌శ్న‌ల‌కు ఆచి తూచి స‌మాధానాలు ఇస్తుంటారు. వీలైనంత మేకు కాంట్ర‌వ‌ర్సీ ప్ర‌శ్న‌కు దూరంగా ఉంటారు. అలాంటి వ్య‌క్తి ఇప్పుడు ఓ వివాదంపై స్పందించాడు. త‌న మ‌న‌సులోని అభిప్రాయాన్ని కుండ బ‌ద్ద‌లు కొట్టిన‌ట్లు చెప్పేశారు. అస‌లు ఇంత‌కీ నాని ఏ వివాదం గురించి స్పందించార‌నే సందేహం రాక మాన‌దు. వివ‌రాల్లోకి వెళితే, కొన్ని రోజుల ముందు మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి, నందినీ రెడ్డి, వివేక్ ఆత్రేయ‌, వెంక‌టేష్ మ‌హ‌, శివ నిర్వాణ ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు. అప్పుడు వెంక‌టేష్ మ‌హా క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌పై ప్రేక్ష‌కులు స్పందిస్తున్న తీరుని ఆయ‌న త‌ప్ప్పు ప‌ట్టారు.


KGF 2 పేరు నేరుగా చెప్ప‌లేదు. అయితే అందులో య‌ష్ క్యారెక్ట‌రైజేష‌న్‌ను ద‌ర్శ‌కుడు తెర‌కెక్కించిన తీరుపై వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. ఇంకేం నెటిజ‌న్స్ వెంక‌టేష్ మ‌హా స‌హా అంద‌రి డైరెక్ట‌ర్స్‌పై ఓ రేంజ్‌లో ట్రోల్ చేసి ఆడేసుకున్నారు. ఎడిటింగ్ ప్రాబ్ల‌మ్ వ‌ల్ల అలా క‌నిపించిందే త‌ప్ప‌.. తాము ఏ సినిమాను కించ‌ప‌ర‌చ‌లేద‌ని వారు స‌ర్ది చెప్పుకునే ప్ర‌య‌త్నం చేశారు. కానీ నెటిజన్స్ ముందు ఆ పప్పులేం ఉడ‌క‌లేదు. ఇప్పుడు ఇదే వివాదంపై నేచుర‌ల్ స్టార్ నానిని స్పందించ‌మ‌ని అడిగితే ఆయ‌న త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం అయితే చేయ‌లేదు.

ఇంత‌కీ నాని ఏమ‌న్నారంటే..‘ఆ డిబేట్‌లో పాల్గొన్న ఐదుగురు డైరెక్ట‌ర్స్‌లో న‌లుగురితో నేను సినిమాలు చేశాను. వాళ్ల‌తో మంచి అనుబంధం ఉంది. ఎవ‌రి అభిప్రాయాలు వాళ్ల‌కుంటాయి. అవి చెప్పుకోవ‌టంలోనూ త‌ప్పు లేదు. అయితే వాళ్లు అలా మాట్లాడ‌టం క‌రెక్ట్ కాదు. ఏదో థియేట‌ర్ బ‌య‌ట మాట్లాడిన‌ట్లు మాట్లాడుకున్నారు’ అని అన్నారు నేచురల్ స్టార్. నాని హీరోగా నటించిన దసరా మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో ఐదు భాషల్లో మార్చి 30న రిలీజ్ అవుతుంది. దీనికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు.


Related News

Bigg Boss 9 Wildcard Entry: 6 గురు వైల్డ్ కార్డ్ ఎంట్రీస్… యాడ దొరికిన సంతరా ఇది.. అంతా స్క్రాపే

PVRInox : తింటూ సినిమా చూసే ఎక్స్పీరియన్స్, ఏంట్రా బాబు ఆ సౌండ్స్ ను ఎలా భరించాలి

Durga Rao: టిక్ టాక్ దుర్గారావు ఇంట్లో విషాదం.. సమాధి దగ్గరే.. కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం!

Rakesh Poojary: ‘కాంతారా-1’లో కడుపుబ్బా నవ్వించిన.. ఈ నటుడు ఎలా చనిపోయాడో తెలుసా? కన్నీళ్లు ఆగవు!

Janu lyri- Deelip Devagan: జాను లిరితో బ్రేకప్.. దిలీప్ రియాక్షన్ ఇదే.. సెలబ్రిటీలం కాబట్టే అంటూ!

Siva jyothi: ఘనంగా శివ జ్యోతి సీమంతపు వేడుకలు.. ఫోటోలు వైరల్!

Manchu Manoj: భార్యపై మనసులోని భావాలు.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ 

Tollywood: భార్య వేధింపులు తాళలేక ప్రముఖ నటుడు ఆత్మహత్య.. సెల్ఫీ వీడియో వైరల్!

Big Stories

×