Gundeninda GudiGantalu Today episode August 9th: నిన్నటి ఎపిసోడ్ లో.. రోహిణి, మనోజ్ కు చుక్కలు చూపించి బాలు టిఫిన్ చేస్తుండగా ఫారిన్ ఆవిడ ఫోన్ చేస్తుంది.. ఎవర్రా ఈమె ఫారిన్ ఆవిడ అని అంటాడు సత్యం. నా కస్టమర్ నాన్న కెనడా నుంచి వచ్చింది అని బాలు అంటాడు. ఇక బాలు టిఫిన్ చేసి కల్పన దగ్గరికి వెళ్తాడు. కల్పనను తీసుకొని ట్రావెల్ ఏజెన్సీ దగ్గరికి వెళ్తాడు. లోపలికి వెళ్ళగానే టికెట్ గురించి మాట్లాడుతుంది కల్పనా. మీకోసం భార్యాభర్తలు ఇద్దరు వచ్చారు అతని పేరు మనోజ్ అని అక్కడ ఉన్న ఆవిడ చెప్పడంతో కల్పనా షాక్ అవుతుంది. మనోజ్ కి పెళ్లి అయిపోయింది అన్నమాట..
నాకోసం వెతుక్కుంటూ వచ్చారంటే నేను జాగ్రత్తగా ఉండాలని అనుకుంటుంది. కల్పన పార్లర్ కి వెళ్లాలని అనుకుంటుంది. పార్లర్ ఎక్కడుందో అని తన ఫ్రెండ్ కి ఫోన్ చేస్తుంది.. మనం వెళ్లే పార్లర్ క్లోజ్ చేస్తారని ఫ్రెండు చెప్పడంతో అయ్యో క్లోజ్ చేస్తారని ఫోన్లో అంటుంది.. బాలు కల్పనను రోహిణి దగ్గరకు తీసుకొని వెళ్తాడు. రోహిణి కల్పనను గుర్తు పట్టేస్తుంది. ఆ తర్వాత ఇంకేం ఉంది.. రచ్చ రచ్చే.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మనోజ్ ను కల్పనను చూసి షాక్ అవుతాడు. నేను వదిలేస్తే దేవదాస్ లాగా ఉంటావనుకున్న. పర్లేదు పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యావు ఇంకేం అని అంటుంది.. ఇదంతా కాదు మనోజ్ ముందు 40 లక్షల సంగతి తేల్చు అని రోహిణి అంటుంది.. ముందు పోలీసులకి ఫోన్ చెయ్యి అని రోహిణి చెప్తుంది.. రోహిణి నేను వచ్చేటప్పుడే పోలీసులు కంప్లైంట్ ఇచ్చి వచ్చాను కాసేపట్లో పోలీసులు లేడీస్ కానిస్టేబుల్ అందరు వస్తారు అని మనోజ్ అంటాడు.. కల్పనా గొంతు పట్టుకొని నీవల్ల దొంగనయ్యాను నువ్వు ఆ డబ్బులు ఇవ్వాల్సిందే అని అంటుంది.. ఇక అప్పుడే పోలీసులు వస్తారు.. పోలీసులను చూసిన కల్పన ఫ్లేట్ ఫిరాయిస్తుంది.. నన్ను కిడ్నాప్ చేయాలని చూస్తున్నారు నా మీద మ్యాన్ హాండ్లింగ్ చేస్తున్నారు అని అంటుంది.. ఏది ఏమైనా పోలీస్ స్టేషన్ కి వెళ్లి తెలుసుకుందామని ఎస్సై అంటాడు.
మీనా తన బైక్ పోలీస్ స్టేషన్కు రావడంతో టెన్షన్ పడుతూ వస్తుంది. ఆయన కోసం పూల బండి పెట్టిస్తే కార్పొరేషన్ వాళ్ళు తీసుకెళ్లిపోయారు. ఇప్పుడేమో ఇలా ఈ స్కూటీని కూడా పోగొట్టుకున్నాను. ఈ విషయం ఆయనకు తగిలిస్తే నన్నే అరుస్తారు అని టెన్షన్ పడుతూ ఉంటుంది. తన బండి కోసం వెతుక్కుంటూ పోలీస్ స్టేషన్ కి వస్తుంది. అక్కడ ట్రాఫిక్ కానిస్టేబుల్ నో పార్కింగ్ లో పెడితే తీసుకెళ్ళిపోతారని నాకు తెలియదా అని అడుగుతుంది. లేదు మేడం నా బండి నాకు ఇచ్చేయండి అని అడుగుతుంది. నో పార్కింగ్ లో పెడితే ఎలా మీకు ఇస్తాము.
ఇంకొకసారి ఎప్పుడు పెట్టను మేడం అని మీనా ఎంతగా బ్రతిమిలాడుతున్న సరే ఆ కానిస్టేబుల్ ఎస్సై వచ్చేంత వరకు వెయిట్ చేయాలనే చెప్తుంది. కాసేపటికి ఎస్ఐ రోహిణి మనోజ్ కల్పనతో వస్తాడు. వాళ్లని మీనా చూడదు.. అటు వాళ్లు మీనాని వాళ్లు చూడరు.. పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తర్వాత కల్పనా ఫ్లైట్ ఫిరాయిస్తుంది. ఆరు నెలలు నాతో కాపురం చేసి ఇప్పుడు నన్ను దొంగ అంటున్నారు ఎస్సై గారు అని అంటుంది. నేను నిన్ను ఎంతగా నమ్మాను నువ్వు నన్ను ఇలా చేస్తావా మనోజ్ అని రివర్స్ గేమ్ ఆడుతుంది.
అటు రోహిణి కల్పనకు గట్టిగానే బుద్ధి చెబుతూ ఉంటుంది. మనోజ్ మాత్రం తనతో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అయితే కల్పనా మనోజ్ రోహిణిల మధ్య చిచ్చు పెట్టాలని అనుకుంటుంది. మనం ఎంత బాగా కలుస్తున్నాము అని అంటుంది. దానికి మనోజ్ నీకోసం సపరేట్గా ఫ్లాట్ తీసుకున్నాను త్వరగా పెళ్లి చేసుకుందామని అనుకున్నాము. కానీ నువ్వు నన్ను చీట్ చేసి డబ్బులు తీసుకుని పారిపోతావా అని దీనంగా మాట్లాడుతాడు.
Also Read : ఢీ రాజుకు ఇంత మందితో బ్రేకప్ అయ్యిందా..? మంచి రసికుడే..
నువ్వు నాతో ఉన్నావని తెలుసునా కూడా మీ ఆవిడ ఎటువంటి రెస్పాన్స్ లేకుండా ఇలా ఉండడం గ్రేట్ అని రోహిణి పై సెటైర్లు వేస్తుంది కల్పనా.. నా గురించి నీకు అనవసరం నువ్వు ముందు తీసుకున్న 40 లక్షలు ఎక్కడ అవి ఇవ్వు అని అడుగుతుంది. మనోజ్ కూడా నా డబ్బులు నాకు ఇవ్వు నీ మూలంగా నేను మా ఇంట్లో దొంగనయ్యాను అని అంటాడు. కల్పన మొదట నువ్వు చెప్పినా ఆ తర్వాత ఒప్పేసుకునేలా కనిపిస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. మరి సోమవారం ఎపిసోడ్లో 40 లక్షలు ఇస్తుందా లేక నమ్మించి మళ్లీ మోసం చేసి పారిపోతుందా చూడాలి..