Raksha Bandhan 2025: ప్రతి సంవత్సరం.. శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున దేశవ్యాప్తంగా రాఖీ పండగను ఎంతో వైభవంగా జరుపుకుంటారు. రాఖీ పండగ రోజు.. అక్కా చెల్లెల్లు అన్నాదమ్ముల్లకు రాఖీ కట్టి, నుదుటిపై తిలకం దిద్ది హారతి ఇస్తారు. అంతే కాకుండా సోదరుడి జీవితంలో ఆనందం, శ్రేయస్సు, దీర్ఘాయుష్షువును కోరుకుంటారు. ప్రతిగా.. సోదరుడు సోదరిని రక్షించడానికి ప్రతిజ్ఞ చేసి బహుమతి ఇస్తాడు.
ఇదిలా ఉంటే.. ఈ ఏడాది పవిత్రమైన రాఖీ పండగను ఆగస్టు 09న జరుపుకోనున్నాము. పవిత్ర సమయంలో లేదా భద్రా రహిత కాలంలో ఈ పండుగను జరుపుకోవడం మంచిదని గ్రంథాలలో వివరించారు. ఈ సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి తేదీ ఆగస్టు 08న మధ్యాహ్నం 2:12 గంటలకు ప్రారంభమై ఆగస్టు 09న మధ్యాహ్నం 01:24 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ఆధారంగా.. రాఖీ పండగ ఆగస్టు 09న జరుపుకోనున్నాము.
హిందూ క్యాలెండర్ ప్రకారం.. ఈ సంవత్సరం రాఖీ పండగపై భద్ర కాల ప్రభావంతో ఉండదు. కాబట్టి ఏ సమయంలోనైనా రాఖీని సోదరులు కట్టించుకోవచ్చు. ఆగస్టు 09న రాఖీ కట్టడానికి ఉత్తమమైన శుభ సమయం ఉదయం 05:35 నుంచి మధ్యాహ్నం 01:24 వరకు.
భద్రుడి నీడ:
హిందూ మతంలో.. ఏదైనా శుభ కార్యం చేసే ముందు అయినా శుభ ముహూర్తం ఖచ్చితంగా చూస్తారు. దీంతో పాటు అశుభ సమయంలో మంగళకరమైన పనులు చేయడం కూడా నిషేధించారు. గ్రంథాలలో, భద్రకాలాన్ని అశుభంగా భావిస్తారు. భద్రలో ఎటువంటి శుభ కార్యం చేయరు. భద్రారహిత కాలంలో మాత్రమే రాఖీ పండగను సోదరుడి మణికట్టుకు రాఖీ కట్టడం శుభప్రదం. ఈ సంవత్సరం రాఖీ పండగ నాడు భద్రుడి నీడ ఉండదు. పంచాంగం ప్రకారం.. భద్రకాలం ఆగస్టు 08న మధ్యాహ్నం 02:12 గంటలకు ప్రారంభమై ఆగస్టు 09న తెల్లవారుజామున 01:52 గంటలకు ముగుస్తుంది. ఈ విధంగా.. రాఖీ పండగ రోజు భద్రుడి నీడ ఉండదు.
Also Read: మీ పూజ గది ఇలా ఉందా ? అయితే సమస్యలు తప్పవు !
ముహూర్త చింతామణి శాస్త్రం ప్రకారం.. కూడా భద్ర కాలం ప్రారంభమైనప్పుడు, ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. ప్రయాణం కూడా చేయకూడదు. దీంతో పాటు.. భద్ర కాలంలో రాఖీ కట్టడం కూడా శుభప్రదంగా పరిగణించరు. కొన్ని నమ్మకాల ప్రకారం, భద్రుడి నివాసం చంద్రుని రాశి ద్వారా నిర్ణయించబడుతుంది. లెక్కల ప్రకారం.. చంద్రుడు కర్కాటకం, సింహ, కుంభం లేదా మీన రాశిలో ఉన్నప్పుడు, భద్రుడు భూమిపై నివసిస్తాడు. అంతే కాకుండా మానవులకు హాని చేస్తాడు. మరోవైపు.. చంద్రుడు మేషం, వృషభం, మిథునం, వృశ్చికరాశిలో ఉన్నప్పుడు, భద్రుడు స్వర్గంలో నివసిస్తాడు. అంతే కాకుండా దేవతల పనిలో అడ్డంకులను సృష్టిస్తాడు. చంద్రుడు కన్య, తుల, ధనస్సు లేదా మకరరాశిలో ఉన్నప్పుడు, భద్రుడు పాతాళలోకంలో నివసిస్తాడని నమ్ముతారు. ఇలాంటి సమయంలో భద్రుడు నివసించే ప్రపంచంలో ప్రభావవంతంగా ఉంటాడు.