వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని వాస్తు దోషాలను తొలగించే శక్తి కొన్ని రకాల చెట్లకు, మొక్కలకు ఉంటుంది. అందుకే వాస్తు నిపుణులు బాల్కనీలో, పెరట్లో కొన్ని రకాల మొక్కలు పెంచమని చెబుతారు. అయితే వాస్తు శాస్త్రం చెబుతున్న ప్రకారం ఇంట్లో పెట్టిన మూడు రకాల మొక్కలు అకస్మాత్తుగా ఎండిపోవడం ప్రారంభిస్తే అది ఇంటికి వచ్చే ఇబ్బందులను సూచిస్తుందని అంటారు. అలాగే ఈ మొక్కలు ఎండిపోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అవి ఎండిపోతే ఆర్థిక నష్టం రావచ్చని వివరిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఏ మూడు రకాల చెట్లు లేదా మొక్కలు ఇంట్లో ఎండకుండా చూసుకోవాలి.
తులసి మొక్క
వాస్తు శాస్త్రం చెబుతున్న ప్రకారం ఇంట్లో తులసి మొక్కను నాటితే అది ఎంతో శుభప్రదం. అలాగే తులసి మొక్క పచ్చగా ఉంటే ఆ ఇంటికి ఎన్నో శుభ ఫలితాలు అందుతాయి. తులసిని ఇంట్లో సరైన దిశలోనే నాటాలి. అప్పుడే ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుంది. ఆ ఇల్లు ఆనందంతో, శ్రేయస్సుతో నిండిపోతుంది. లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా ఆ ఇంటిపై, ఇంట్లోని వారిపై ఉంటాయి. కానీ ఇంట్లో తులసి మొక్క వాడిపోవడం ప్రారంభించింది. అంటే ఆర్థికంగా భారీ నష్టాలు జరిగే అవకాశం ఉందని సూచించడమే. కాబట్టి తులసి మొక్క ఎండకుండా కాపాడుకోండి.
శమీ చెట్టు
ఇంట్లోనే కుండీల్లో శమీ మొక్కను ఎంతోమంది పెంచుతున్నారు. ఇంట్లో ఆకుపచ్చని శమీ మొక్క ఉంటే శిని దేవుడి చెడు ప్రభావంలో చాలా వరకు తగ్గుతాయని చెబుతారు. అలాగే శని దోషం ప్రభావాలు కూడా ఉండవని అంటారు. శమీ చెట్టు శివుడికి ఎంతో ప్రియమైనది. దీనివల్ల శివుడు ఆ ఇంటిని కాపాడుతాడు అని చెబుతారు. అదే శమీ చెట్టు అకస్మాత్తుగా ఎండిపోవడం ప్రారంభిస్తే.. అది అశుభాన్ని సూచిస్తుంది. శమీచెట్టు ఎండిపోతున్నట్టు అయితే శని దేవుడు కోపంగా ఉన్నాడని శివుని ఆశీస్సులు ఇంటిపై లేవని అర్థం. అటువంటి పరిస్థితుల్లో ఎండిపోయిన శమీ చెట్టును వెంటనే తొలగించి పచ్చని శమీ మొక్కను నాటాల్సిన అవసరం ఉంది.
మనీ ప్లాంట్
వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ ఇంట్లో ఉండడం ఎంతో శుభప్రదం. ఇంట్లో మనీ ప్లాంట్ ఉండడం వల్ల ఆ ఇంటిలో వారిపై లక్ష్మీదేవి కరుణ ఉంటుందని చెబుతారు. ఆ ఇంటి కుటుంబ సభ్యులకు ఎటువంటి డబ్బు కొరత ఉండదని అంటారు. అదే మనీ ప్లాంట్ అకస్మాత్తుగా ఎండిపోవడం ప్రారంభిస్తే మాత్రం ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయని సూచించడమే. ఆ ఇల్లు ఆర్థిక సంక్షోభంలో మునిగిపోతుందని చెప్పడమే. కాబట్టి ఎండిన మనీ ప్లాంట్ ను ఎక్కువ కాలం ఇంట్లో ఉంచకండి. వెంటనే దాన్ని తొలగించి పచ్చని మనీ ప్లాంట్ ను ఇంట్లో నాటండి.