BigTV English

Kitchen God Pictures: వంట గదిలో ఏ దేవుడి ఫోటోను ఉంచాలి…

Kitchen God Pictures: వంట గదిలో ఏ దేవుడి ఫోటోను ఉంచాలి…

Kitchen God Pictures :వంటగది అన్నపూర్ణా దేవి స్థానమని పండితులు చెబుతున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం వంటగదని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. శివుడితో కలిసి ఉండే అన్నపూర్ణ మాత చిత్రాన్ని వంట గది వెలుపల ఉంచడం వల్ల ఇంట్లో ఆహార నిల్వలు ఎన్నటికీ తరిగిపోవని, కుటుంబ వృద్ధి, మర్యాద పెరుగుతాయని చెబుతున్నారు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుందని పేర్కొంటున్నారు..
వంటగది ఆగ్నేయ దిశలో ఉన్నప్పుడే మన ఇంట్లో అనుకూల వాతావరణ పరిస్థితులు ఉంటాయని లేదంటే లేనిపోని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు


అన్నపూర్ణ దేవి చిత్రాన్ని వంట గది బయట గోడకి అలంకరించుకున్నపుడు కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి..గురువారం, శుక్రవారం ఉదయం అన్నింటికంటే ముందుగా వంటగదిని శుభ్రం చేసుకోవాలి.గంగా జలం అందుబాటులో ఉన్నవారు తప్పకుండా కాస్త గంగాజలం చల్లుకొని శుద్ధి చేసుకోవాలి . చిత్రాన్ని అతికించే ముందు ఆ గోడను శుభ్రం చేసి గంగాజలంతో శుద్ధి చేసుకోవాలి. స్టవ్ ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుని పొయ్యిని తప్పనిసరిగా పూజించాలి. ఇది అన్నపూర్ణ దేవికి చేసే ఉపాసన అవుతుంది.

వంట గదిలో ఉన్న అన్నపూర్ణాదేవి సహితుడైన పరమేశ్వరుని పూజించడం వల్ల ఇంటిలో ఆహార కొరత ఎన్నటికీ ఏర్పడదు. అన్నపూర్ణా స్తోత్రం, కథ, హారతి తర్వాత ఈ చిత్రాన్ని వంటగదికి ఉత్తరం లేదా తూర్పు దిశలో ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి అనుగ్రహంతో ఇల్లు సమృద్ధిగా ఉంటుంది. పొయ్యి మీద పసుపు, కుంకుమ, అక్షితలు, పువ్వులు, ధూపం, దీపం వెలిగించి పూజ పూర్తి చెయ్యాలి.వాస్తు ప్రకారం నారింజ, పసుపు, ఆకుపచ్చ వంటి రంగులు వంటగదికి వేస్తే మంచి జరుగుతుంది. వంటగది గోడల రంగులు ముదురు రంగులో ఉండకూడదు. గోధుమ రంగు, నలుపు రంగులను వంటగదికి వేయకూడదు. ఇవి సానుకూల శక్తిని అడ్డుకుంటాయి.


Chaitra Month : చైత్ర మాసం అందుకే అంత ప్రత్యేకమా…

Lavish Flowers : సంపంగి పూలతో పూజ ఫలితాలివి

Related News

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Raksha Bandhan 2025: రాఖీ పళ్లెంలో.. ఈ వస్తువులు తప్పకుండా ఉండాలట !

Big Stories

×