Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్ రాథోడ్ మాట్లాడుతూ ఉంటే వినోద్ వస్తాడు. బిజినెస్ పనులు ఎంత వరకు వచ్చాయని అడుగుతాడు అమర్. రేపు పొద్దున్న ఫోటోషూట్ కోసం ప్రాసెస్ జరుగుతుంది అన్నయ్యా అని వినోద్ చెప్పగానే.. సరే ఫ్రెష్ అయి రా డిన్నర్ చేద్దాం అంటాడు అమర్. సరే అంటూ పైకి వెళ్లిన వినోద్ భయంగా గట్టిగా అరుస్తాడు. అందరూ కంగారు పైకి వచ్చి ఏమైంది వినోద్ అని అడుగుతారు. వినోద్ భయతో లోపల అంటూ చెప్తాడు. అమర్ నేను చూస్తాను అంటూ లోపలికి వెళ్లి కూల్ గా బయటకు వస్తాడు. మనోహరి, మిస్సమ్మ ఏమైంది అని అడిగినా పలకడు. దీంతో మనోహరి లోపలికి వెళ్లి ముఖానికి ఫ్యాక్ వేసుకున్న చిత్రను తీసుకుని బయటకు వస్తుంది. చిత్రను చూసిన మిస్సమ్మ భయంతో గట్టిగా అరుస్తుంది.
మనోహరి హలో హలో భాగీ ఎక్స్‌ట్రాలు చేయకండి ఇది చిత్ర అని చెప్పగానే.. వినోద్ ఆశ్చర్యంగా చిత్రనా… అంటాడు. మిస్సమ్మ మళ్లీ తిరిగి చూసి గట్టిగా అరుస్తూనే ఏవండి నాకు భయం వేస్తుందండి.. అంటుంది. ఇంతలో రాథోడ్ చిత్ర మేడం అసలు ఏంటండి మీరు ఇలా దెయ్యంలా తయారయ్యారు అంటాడు. దీంతో చిత్ర నేనేం దెయ్యంలా తయారవ్వలేదు అంటుంది. దెయ్యంలా తయారవకా..? దేవతలా తయారు అయ్యావా..? ఒక్క క్షణం నిన్ను అలా చూడగానే నా గుండె ఆగినంత పని అయింది అంటాడు కోపంగా ఇంతలో అమర్ అయినా చిత్ర ఏంటిది అవతారం అంటాడు. అంటే బావగారు రేపు ఫోటో షూట్ ఉంది కదా..? ఈ ఫ్యాక్ కొత్తగా వచ్చిందట.. ఇది వేసుకుంటే.. ఫేస్ అంతా బ్రైట్‌గా అవుతుందట.. అందుకే వేసుకున్నాను అంటూ చిత్ర చెప్పగానే.. అమర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు.
హలో చిత్ర ఈ ఫేస్ ఫ్యాక్‌లు పొదున పూట ట్రై చేయాలి కానీ మరీ అందరూ పడుకునే టైంలో కాదు.. అంటుంది. దీంతో మనోహరి కోపంగా హలో భాగీ నువ్వు మరీ అతిగా చేస్తున్నావు.. అయినా ఆ ఫేస్ ఫ్యాక్ ఇప్పుడు అప్లై చేస్తే ఏంటి..? పొద్దున్న అప్లయ్ చేస్తే ఏంటి..? అంటుంది. చెప్పు భాగీ నేను ఎప్పుడు రాసుకుంటే నీకేంటి..? నాకు ఫేస్ బ్రైట్ అవ్వడం ముఖ్యం అంటుంది చిత్ర. దీంతో వినోద్ నల్లటి క్రీమ్ రాసుకుంటే ఫేస్ తెల్లగా అవుతుందని ఎవరు చెప్పారు చిత్ర నీకు. అయినా ముందు చెప్పాలి కదా..? అంటాడు. వినోద్ నిన్ను పిలుస్తూనే ఉన్నాను.. అయినా నువ్వు భయపడుతూనే వెళ్లిపోయావు.. అంటుంది.
ఇంకా నయం మేడం పిల్లలు చూడలేదు చూసుంటే నలుగురికి ఒకేసారి జ్వరం వచ్చేది అంటాడు రాథోడ్. దీంతో చిత్ర కోపంగా వినోద్ నీ వల్ల నేను అందరి ముందు ఫూల్ అయ్యాను.. చూడు వాళ్లు కూడా వదిలేసి వెళ్లిపోతున్నారు అంటూ చిత్ర తిడుతుంటే.. అవును మరి ఇవాళ నేను శవం అయ్యేవాణ్ని.. త్వరగా వెళ్లి ముఖం కడుకో లేదంటే రాత్రంతా పీడకలలే వస్తాయి. అంటూ వినోద్ వెళ్లిపోతాడు. మనోహరి కూడా చిత్ర ఇలాంటి ఫేస్ ఫ్యాక్‌లు ఏమైనా ఉంటే పార్లర్‌కు వెల్లొచ్చు కదే అని చెప్పగానే.. అమ్మో పార్లర్‌కు వెళితే డబ్బులు ఖర్చు పెట్టాలి.. నా వల్ల కాదు అసలే ఇప్పుడిప్పుడే నాకు డబ్బులు వస్తున్నాయి అంటూ లోపలికి వెళ్లిపోతుంది చిత్ర.
మరుసటి రోజు అమర్ వాళ్ల ఇంట్లోనే యాడ్ షూటింగ్ మొదలుపెడతారు. చిత్ర మేకప్ వేసుకుని యాక్ట్ చేస్తుంది. డైరెక్టర్ యాక్షన్ చెప్తుంటాడు. చిత్ర సరిగ్గా చేయదు.. అలాగే మూడు నాలుగు సార్లు అయ్యాక కెమెరామెన్ పక్కనే ఉన్న మిస్సమ్మను చూసి సార్ ఆవిడ ఫేస్ ఫోటో జెనిక్ ఫేస్.. కెమెరాకు బాగా షూట్ అవుతుంది అని చెప్తాడు. వెంటనే డైరెక్టర్ మేనేజర్‌ను పిలిచి మిస్సమ్మ ఈ యాడ్‌లో యాక్ట్ చేస్తుందేమో అడుగు అని చెప్తాడు. మేనేజర్ వెళ్లి రాథోడ్‌కు విషయం చెప్తాడు. రాథోడ్ వెళ్లి మిస్సమ్మకు విషయం చెప్పగానే.. మిస్సమ్మ సిగ్గు పడుతుంది. ఎలాగైనా మీరు యాక్టింగ్ చేయండి అన్నట్టు డైరెక్టర్ చూస్తుంటాడు. చిత్ర ఇరిటేషన్‌తో ఊగిపోతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం