Raksha Bandhan 2025: ఈ సంవత్సరం రాఖీ పండగను ఆగస్టు 9న జరుపుకోనున్నాము. ఈ రోజు అక్కాచెల్లెల్లు అన్నాదమ్ముల దీర్ఘాయుష్షు, ఆనందం, శ్రేయస్సు, భద్రతను కోరుకుంటూ వారి మణికట్టుపై రాఖీ కడతారు. ఇలాంటి సమయంలో రాఖీ థాలిలో అంటే రాఖీ ఉంచే పళ్లెంలో కొన్ని రకాల వస్తువులను తప్పకుండా చేర్చాలి. ఎలాంటి వస్తువులను రాఖీ పళ్లెంలో చేర్చాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రాఖీ పండుగను ప్రత్యేకంగా జరుపుకోవడానికి సోదరీమణులు ముందుగానే కొన్ని వస్తువులను సిద్ధం చేసుకుంటారు. పూజకు ఉపయోగించే పళ్లెం అలంకరించడం ఇందులో ముఖ్యమైన భాగం. ఈ పళ్లెంలో కొన్ని ప్రత్యేక వస్తువులను సరైన మార్గంలో చేర్చినట్లయితే.. శుభం కలుగుతుందని చెబుతారు.
పూజ పళ్ళెంలో ఈ వస్తువులను ఉంచండి:
1.కుంకుమ:
రాఖీ కట్టే ముందు సోదరుడి నుదిటిపై తిలకం పెట్టడం ఒక ముఖ్యమైన భాగం. అందుకే తిలకం పెట్టడానికి పళ్ళెంలో కుంకుమ ఉండాలి. ఇది దీర్ఘాయువు, విజయం, శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణించబడుతుంది.
2. అక్షతలు (బియ్యం):
పూజలో ఉపయోగించే ముడి బియ్యాన్ని అక్షతలు అని పిలుస్తారు. ఇవి శుభానికి చిహ్నం. తిలకం పెట్టిన తర్వాత సోదరుడి నుదిటిపై అక్షత పూయడం అనేది రాఖీ పండగ సందర్భంగా చేసే ఆచారంలో ఒక భాగం.
Also Read: భద్ర నీడ అంటే ఏమిటి ? ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదని చెబుతారు
3. దీపం:
హారతి కోసం.. ప్లేట్‌లో దీపం ఉంచండి. రాఖీ కట్టిన తర్వాత సోదరుడికి హారతి ఇవ్వడం చెడు దృష్టి నుంచి వారిని రక్షించడానికి ఒక మార్గంగా పరిగణించబడుతుంది. ఇది సోదరుడి జీవితంలో సానుకూల శక్తిని పెంచుతుంది.
4. స్వీట్లు:
సంబంధం యొక్క మాధుర్యాన్ని పెంచడానికి పళ్లెంలో స్వీట్లు ఉండాలి. రాఖీ కట్టిన తర్వాత ఒకరికొకరు స్వీట్లు తినిపించడం శుభప్రదం. ఇది ప్రేమను మరింత పెంచుతుంది.
5. కొబ్బరికాయ (శ్రీఫలం):
పళ్ళెంలో కొబ్బరికాయ పెట్టడం కూడా శుభప్రదంగా భావిస్తారు. దీనిని లక్ష్మీదేవి చిహ్నంగా భావిస్తారు. ఇది సోదరులకు పురోగతి, శ్రేయస్సును అందిస్తుందని నమ్ముతారు.