BigTV English

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

OTT Movie: టీచర్ కి నరకం చూపించే స్కూల్… ఆత్మలుగా మారే పిల్లలు… ఒక్కో ట్విస్టుకు చుక్కలే

OTT Movie : స్నేహితులతో, కుటుంబంతో కలసి ఏదైనా హారర్ సినిమా చూడాలనుకుంటున్నారా ? అయితే చిన్న పిల్లతో కూడా కలసి చూసే విధంగా ఉండే ఒక బెంగాలీ హారర్ సినిమా ఓటీటీలో అందుబాటులో ఉంది. ఇది ఒక సాధారణ హారర్ చిత్రంగా కాకుండా, ఎమోషనల్ కథతో కూడిన ఘోస్ట్ స్టోరీగా తెరకెక్కింది. ప్రత్యేకించి ఈ సినిమా పిల్లల కోసం అన్నట్లు ఉంటుంది. ఈ చిత్రం ఒక హాంటెడ్ స్కూల్ చుట్టూ తిరిగే ఒరిజినల్ కథ. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …


రెండు ఓటీటీలలో స్ట్రీమింగ్
‘Shob Bhooturey’ ఒక బెంగాలీ హారర్ చిత్రం. ఈ సినిమా బిర్సా దాస్‌ గుప్తా దర్శకత్వంలో, శ్రీ వెంకటేష్ ఫిల్మ్స్ బ్యానర్‌ పై శ్రీకాంత్ మొహ్తా, మహేంద్ర సోని నిర్మించారు. ఇందులో అబిర్ చటర్జీ, సోహిని సర్కార్, సుప్రియో దత్తా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2017 సెప్టెంబర్ 8న విడుదలైంది. IMDbలో ఈ సినిమా 5.3/10 రేటింగ్ ను పొందింది. కాగా ఈ మూవీ హోయ్‌చోయ్, Jio hotstar రెండు ఓటీటీలలో అందుబాటులో ఉంది.

స్టోరీలోకి వెళితే…
అనికేత్ తన తండ్రి నబిన్‌ మాధబ్ సేన్ స్థాపించిన “శోభ్ భూతురే” అనే హారర్ మ్యాగజైన్‌ను మూసివేయాలని నిర్ణయించుకుంటాడు. నబిన్‌ మాధబ్ ఒక పారానాయిడ్ ఇన్వెస్టిగేటర్. దెయ్యాలు, అతీంద్రియ సంఘటనల గురించి కథలను కూడా రాసేవాడు. కానీ అనికేత్ ఈ దెయ్యాలను పెద్దగా నమ్మడు. అతను తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలనుకుంటాడు. మ్యాగజైన్ ఎడిటర్, నబిన్‌ మాధబ్ స్నేహితుడు కృపాధర్ బాబు అతని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తాడు.


అలాంటి సమయంలో నందిని అనే ఒక అమ్మాయి వాళ్ళ ఆఫీస్‌కు వస్తుంది. ఆమె దెయ్యాలను చూడగలదని, నబిన్‌ మాధబ్ ఆమెకు ఉద్యోగం ఇస్తానని మాట ఇచ్చాడని చెబుతుంది. నందిని ప్రవర్తన, ఆమె చూపులు అనికేత్‌ను ఆకట్టుకుంటాయి. ఆమెను నమ్మకపోయినా జాబ్ లో చేర్చుకుంటాడు. ఇదే సమయంలో కుశుంపూర్ అనే గ్రామంలోని ఒక ప్రాథమిక పాఠశాలలో అతీంద్రియ సంఘటనలు జరుగుతాయి. మినీ అనే ఒక చిన్న అమ్మాయి అనుమానాస్పద మరణంతో పాఠశాలను మూసేస్తారు.

పాఠశాల హెడ్‌ మాస్టర్ పోరితోష్ ముఖర్జీ, శోభ్ భూతురే మ్యాగజైన్‌కు సహాయం కోసం వస్తాడు. అనికేత్, నందిని, కృపాధర్ బాబు ఈ రహస్యాన్ని పరిష్కరించడానికి, పాఠశాలను తిరిగి తెరవడానికి కుశుంపూర్‌కు వెళతారు. వీళ్ళు గ్రామంలో ఒక పాత ఇంటిలో ఉంటూ, అక్కడ జరిగే వింత సంఘటనలను ఎదుర్కొంటారు. వస్తువులు కదలడం, భయానక శబ్దాలు, పిల్లలు దెయ్యాలుగా రావడం వంటి దృశ్యాలు వీళ్ళని భయపెడతాయి. అనికేత్ కు ఇదంతా నమ్మశక్యంగా అనిపించదు. కానీ నందికి ఉన్న దెయ్యాలను ఎదుర్కునే సామర్థ్యం అతన్ని ఆశ్చర్యపరుస్తుంది. ఈ ఇన్వెస్టిగేషన్ సమయంలో, మినీ మరణం వెనుక ఉన్న ఓ సీక్రెట్ బయటపడుతుంది. ఈ సీక్రెట్ ఏమిటి ? పాఠశాలలో భయంకరమైన సంఘటనలకు కారణం ఎవరు ? అనికేత్ కేసును ఎలా సాల్వ్ చేస్తాడు ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే ఈ సినిమాని మిస్ కాకుండా చూడండి. .

Related News

OTT Movie : ప్రియురాలు పక్కనుండగా ఇవేం పాడు పనులు భయ్యా ? అల్టిమేట్ ట్విస్టులు… ఎక్స్ట్రా ఆర్డినరీ పవర్స్

OTT Movie : స్టూడెంట్ ప్రైవేట్ ఫోటో లీక్… టీచర్ చేసే సైకో పనికి మెంటలెక్కల్సిందే

OTT Movie : స్విమ్మింగ్ పూల్ లో శవం… బర్త్ డే రోజు దిమ్మతిరిగే గిఫ్ట్… ఇలాంటి సర్ప్రైజ్ ఇస్తే డైరెక్ట్ గా పరలోకానికే

OTT Movie : భార్యతో పాటు కోడలినీ వదలని మూర్ఖుడు… కొడుకు రీ ఎంట్రీతో ఫ్యామిలీ టెర్రర్… ట్విస్టులతో అదరగొట్టే సైకో థ్రిల్లర్

OTT Movie : మర్డర్ల చుట్టూ తిరిగే మైండ్ బ్లోయింగ్ స్టోరీ… హత్య కేసులో అనుకోని ట్విస్ట్… IMDbలో 7.9 రేటింగ్

Big Stories

×