BigTV English

Fire Element :- బతుకు బడిని నేర్పే అగ్ని ఎన్ని రకాలు?

Fire Element :- బతుకు బడిని నేర్పే అగ్ని ఎన్ని రకాలు?


Fire Eelement :- నీరు, నిప్పు లేకుండా మనిషి జీవితం ఉండదు . మనిషి మనుగుడకి అగ్ని అవసరం. ఆధ్యాత్మిక దృష్టి తో చూస్తే అగ్ని మనకు చాలా రూపాల్లో కనిపిస్తుంది. ఏ మతంలోనైనా ఏదో రూపంలో అగ్నిదేవుడ్ని పూజిస్తారు. అది ఉన్న ప్రదేశాన్ని వేరు వేరు పేర్లతో పిలుచుకుంటారు.

క్రోధాగ్ని: కోపం వల్ల పుట్టేది క్రోధాగ్ని. కళ్లల్లో మాత్రమే ఇది ఎక్కువగా కనిపిస్తుంది. శివుడు త్రినేతం తెరిస్తే కలిగేది అగ్ని రూపం. క్రోదాగ్నికి భస్మం అయిపోతారు..


జఠరాగ్ని: భూమి మీద ఉన్న ప్రతీ జీవి కడుపులో ఆహార జీర్ణానికి తోడ్పడుతుంది. ఆహార అరుగుదలకి ఉపయోగపడుతుంది.

దావాగ్ని: ఇది ఎండు పుల్లల రాపిడి, ఘర్షణ వల్ల పుట్టేది దావాగ్ని. అడవులలో రేగే దావానలం కారణం దావాగ్ని. పచ్చని అడవి దావాగ్నిలో బూడదవుతుంది.

ఆరణి : ఎండు పుల్లల రాపిడితో మధించి అగ్నిని పుట్టించేవారు. ఇది పవిత్రమైంది. యజ్ఞంతో పుట్టే అగ్ని పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది.

వజ్రాగ్ని: ఇంద్రుని వజ్రాయుధంలో ఉండే అగ్ని. మెరుపులు, పిడుగులు అగ్నికి రూపాలే. పురాణాల్లో మెరుపు ఇంద్రుని వజ్రాయుధంగా భావిస్తారు. పిడుగు వజ్రాయుధా ఘాతమనీ అంటారు.

జ్ఞానాగ్ని: ఆత్మలో నిత్యం కలిగే అగ్నే జ్ఞానాగ్ని. జ్ఞానం అనే అగ్ని. సీతాదేవి అగ్ని ప్రవేశం ఆలకించి చూస్తే ఈ జ్ఞానాగ్ని అంటే ఏంటో మనకు అర్ధమవుతుంది. కోరికలు పుట్టడం వల్లే మనిషి దేవుడికి దూరమవుతాడు.

బడబాగ్ని: సాగరం అడుగుభాగంలో పుట్టే అగ్ని బడబాగ్ని లేదా బ్రహ్మాగ్ని. సముద్రంలో బడబాగ్ని పుడితే ఏం జరుగుతుందో అందరికి తెలుసు.

Related News

Vastu Tips:ఇంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ పోయి..సంతోషంగా ఉండాలంటే ?

Raksha Bandhan 2025: 16 రోజుల పాటు రాఖీ తీయకూడదట ! హిందూ సాంప్రదాయం ఏం చెబుతోందంటే ?

Shravana Shukrawar 2025: శ్రావణ శుక్రవారం ఇలా చేస్తే.. అప్పుల బాధలు తొలగిపోతాయ్

Rakhi Festival 2025: రాఖీ పండగ రోజు.. ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సిన పరిహారాలు ఇవే !

Koti Shivalingala Temple: కోటి శివలింగాలు ఒకే చోట చూడాలనుకుంటున్నారా? అయితే ఈ ఆలయానికి వెళ్లండి

Lakshmi Devi: మీ ఇంట్లో ఈ మూడు మొక్కలను ఎండకుండా చూసుకోండి, అలా ఎండితే లక్ష్మీదేవి కరుణించదు

Big Stories

×