Big Stories

Bhu Varahaswamy Temple:- సొంతంటి కలను నెరవేర్చే భూ వరాహస్వామి

- Advertisement -

Bhu Varahaswamy Temple :- భక్తులను కాపాడేందుకు శ్రీమహా విష్ణువు ఎత్తిన అవతారాల్లో మూడోది వరాహవతారం. కర్ణాటకలోని హేమావతి నది ఒడ్డున ఉంది ఈ ప్రతిష్టాత్మకం ఆలయం. సొంతిల్లు కల నెరవేరాలనుకునే వారు ఒక్కసారి భూవరాహ స్వామిని దర్శిస్తే చాలన్న విశ్వాసం ఉంది. రెండు వేల ఐదువందల సంవత్సరాల చరిత్ర ఉన్న ఆలయాన్ని రాజు వీర భల్లాలకి ఒక కుక్క చూపించిందని పురాణాలు చెబుతున్నాయి. కుందేలను వేటాడుతున్న కుక్కకు వెంబడించగా… ఒక ప్లేస్ కు రాగానే సీన్ రివర్స్ అయింది.. ఈ విచిత్రాన్ని గమనించిన మహారాజుకి అక్కడేదో వాతావరణం భిన్నంగా అనిపించిందట. ఆ ప్రాంతాన్ని తవ్వి చూడగా ప్రళయ వరాహస్వామి బయటపడ్డాడని..చరిత్ర చెబుతోంది. ఇందుకు సంబంధించి శిలా ఫలకం ఇదే విషయాన్ని చెబుతోంది.

- Advertisement -

బయటకి మాములుగా కనిపించే ఆలయం లోపల ఊహించని విధంగా ఉంటుంది. పదిహేను అడుగల ఎత్తులో సుఖాసనాన్ని తలపించే విధంగా వరాహస్వామి విగ్రహం దర్శనమిస్తుంది. ఒక కాలు భూమిని తాకినట్టు కనిపిస్తుంది. నల్లని రాయి రూపంలో విగ్రహం ఉంటుంది. వరాహం అంటే పంది. భూదేవి విగ్రహం మూడున్నర అడుగుల ఎత్తున ఉంటుంది. వరాహస్వామి పై చేతులు శంఖం మరియు డిస్కస్ పట్టుకొని ఉన్నాయి. ఇంత భయంకరంగా కనిపించే విగ్రహాన్ని గౌతమ మహర్షి ప్రతిష్టాంచడాని పురాణం చెబుతోంది. విగ్రహాం చూసేందుకు భయానకంగా ఉన్నా భక్తులకి అభయమిస్తుంది.

ఆలయం పక్కనే ఉన్న హేమావతి నది ఉంది. ప్రవాహం ఎక్కువగా ఉండే నదిలో పుణ్యస్నానాలు అంత శ్రేయస్కరం కాదు. వర్షా కాలంలో ఈ నదిలోని నీరు ఆలయం గోడను తాకుతూ వెళ్తుంది. ప్రతీ ఏటా మే నాటికి నదీ మట్టం తగ్గుతుంది. ఆసమయంలోనే వార్షిక ఉత్సవాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఆలయం దగ్గర మట్టి పూజ, ఇసుక పూజ చేస్తుంటారు. స్వామి వారి దగ్గర మట్టిని పూజించి ఇస్తారు. దాన్ని ఇంటికి తీసుకొచ్చి ఉంచుకుని ఇల్లు కట్టుకునే ప్రాంతంలో వాడితే మంచి జరుగుతుందని నమ్మకం. ఇటుకలకి కూడా పూజ చేసి ఇస్తుంటారు. వాటిని మన ఉండే చోట పెడితే సొంతిల్లు ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసంతో ఫాలోఅవుతుంటారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News