E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..
Advertisement

Gundeninda GudiGantalu Today episode 20th: ఇకపోతే శృతి రవి ఇద్దరు రెస్టారెంట్లో పని చేసుకుంటూ ఉండగా ప్రభావతి అప్పుడే ఫోన్ చేస్తుంది.. ఎవరు ఫోన్ అని శృతి అడుగుతుంది. మీనా వదిన చేసిన వంట మా అమ్మకు వద్దంట ఇవాళ స్పెషల్ గా ఏదైనా తీసుకురావాలి అని అంటుంది. ఆంటీ మీనా వంటని కాదన్నా అంటే ఏదో జరిగిందని అర్థమవుతుంది. మీనా బాలుని ఎప్పుడెప్పుడు దిగజారియలా చేద్దామని ఆలోచిస్తూ ఉంటుంది కదా అలా ఏమన్నా జరిగింటుందని శృతి కంగారు పడిపోతూ ఉంటుంది. శృతి అన్న మాటలు విన్న రవి మా అమ్మ మళ్లీ అంత శాడిస్ట్ కాదు కానీ నువ్వు చెప్తుంటే నాకు కూడా కొంచెం అనుమానంగానే ఉంది అని శృతి రవి ఇద్దరు ప్రభావతిపై అనుమానం వ్యక్తం చేస్తారు.. ఏదో జరుగుతుంది అని వీళ్ళిద్దరూ అనుకుంటారు. మీనా మాత్రం కన్నీళ్లు పెట్టుకుంటూనే ఈవెంట్ మేనేజర్ మోసంని ఓనర్ కి చెప్పాలని అనుకుంటుంది. చదువు రాదు అని మీనాన్ని దారుణంగా మోసం చేసిన మేనేజర్ పని ఎలాగైనా చూడాలి అని అనుకుంటుంది.

ఓనర్ మాటకు మీనా షాక్..

మీనా ఫంక్షన్ హాల్ ఓనర్ దగ్గరికి వెళ్తుంది. ఆ ఓనర్ గారు నాకు న్యాయం చేయండి అని ఎంతగా బతిమిలాడుతుందో అది చూసిన అందరికీ కన్నీళ్లు వస్తాయి.. మీనా అంతగా బ్రతిమలాడం చూసిన ఎవరైనా సరే ఒక్కసారిగా షాక్ అవుతారు సర్ నాకు ఇచ్చింది లక్ష రూపాయలు మాత్రమే కానీ ఆ మేనేజరు 10 లక్షలు ఇచ్చేసినట్లు చెప్తున్నాడు. నేనేం చేయాలో నాకు అర్థం కావట్లేదు ఓనర్ గారు మీరు నాకు న్యాయం చేయండి అంటూ బ్రతిమలాడుతుంది మీనా.. ఓనరు ఆ మేనేజర్ ని పిలువు ఏం జరిగిందో తెలుసుకోవాలి అని అంటాడు.. మీనా బాధని అర్థం చేసుకున్న ఓనర్ మేనేజర్ ని తిడతాడు. కానీ తను మాత్రం నేను కరెక్ట్ గా నీకు ఇచ్చాను అని ఓనరు నువ్విలా చేయడం తప్పు అమ్మ డబ్బులు ఇచ్చినా కూడా ఇవ్వలేదని ఎందుకు అంటున్నావు అని అనగానే మీనా షాక్ అవుతుంది. చింతామణికే ఆర్డర్ ఇస్తావు కదా… మరి కొత్త వాళ్లకి ఎందుకు ఆర్డర్ ఇచ్చావు అని మేనేజర్ ను ఓనర్ అడగ్గానే మీనా కి మేనేజర్ పై అనుమానం వస్తుంది. తను ఏమీ చెప్పలేకుండా మేనేజర్ వెళ్లిపోవడంతో మీనా బాధ పడిపోతుంది.

నిజం తెలుసుకున్న మీనా..

Advertisement

ఓనర్ చింతామణి కి ఇవ్వకుండా మీనాకు ఇచ్చారు అని అనగానే మీ నాకు ఇదంతా చింతామణి ప్లాను అని అర్థమవుతుంది.. మీనా చేసిన ఒకే ఒక్క తప్పు ఆ మేనేజర్ ని గుడ్డిగా నమ్మి డబ్బులు తీసుకోకుండా పనిచేయడమే. అతను కూడా చింతామణి మనిషి అని తెలుసుకున్న మీనా ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎలాగైనా సరే చింతామణి కి బుద్ధి చెప్పాలని అనుకుంటుంది.. చింతామణికి నేను ఏం ద్రోహం చేశానని నన్ను ఇలా ఆడుకుంటుంది అని నేను అనుకుంటుంది. ఏది ఏమైనా కూడా చింతామణి మరోసారి తనని దెబ్బ కొట్టింది అని చాలా బాధపడిపోతుంది మీనా.. నేనెవరికీ ఏ పాపం చెయ్యకపోయినా నన్ను ఇలా చేస్తారు అని నేను అస్సలు ఊహించలేదు అని మీ నా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఈ సమస్య నుంచి నువ్వే గట్టి ఎక్కించాలి అని దేవుడిని ప్రార్థిస్తుంది..

ప్రభావతికి రాక్షస ఆనందం..

ప్రభావతి వాళ్ళు రవి ఇంట్లోకి రాగానే బిర్యానీ తెచ్చావా అని అడుగుతారు. నేనే దగ్గరుండి వంటని ప్రిపేర్ చేసేది తీసుకొచ్చాను అని రవి అంటాడు. ప్రభావతి అంతా ఆనందంగా ఉంది అంటే ఏదో జరిగి ఉంటుంది అని రవి శృతి తో పాటుగా సత్యం కూడా అనుమానపడతాడు. మీనా ఓడిపోయిందని సంతోషంలో ఉన్న ప్రభావతి నా ప్రత్యర్థులు ఓడిపోయారు అని నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటుంది. అది కచ్చితంగా మీనా అనే అని మీనా కి అర్థం అయిపోతుంది.. ఇక అందరూ కలిసి కూర్చుని తింటూ ఉండగా ప్రభావతి మాత్రం మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది అని చాలా సంతోషంగా ఉంటుంది. తన రాక్షస ఆనందం చూసి సత్యం షాక్ అవుతాడు.. రోహిణికి మీనా పరిస్థితి గురించి నిజం చెప్తుంది కానీ రోహిణి మాత్రం తన గురించి నిజం చెప్తే ఎక్కడ తనకి జీవితకాలం శిక్ష వేస్తుందని భయపడిపోతూ ఉంటుంది..

గుండెలు పగిలేలా ఏడ్చినా మీనా..

Advertisement

మీనా ఒంటరిగా కూర్చుని బాధపడుతూ ఉండగా శృతి రవి సత్యం ముగ్గురు కూడా మీ నాకు ఏదో అయింది ఎందుకు ఇంత బాధ పడిపోతుంది అని ఆలోచిస్తారు. అసలు ఏమైందో తెలుసుకోవాలి అని మీనా దగ్గరికి వెళ్తారు. ఆర్డరు పూర్తి చేశావు కదా అమ్మ ఏమైనా సమస్య వచ్చిందా అని సత్యం అడుగుతాడు. నాకే సమస్య రాలేదు మావయ్య ఆర్డర్ బాగానే పూర్తి చేశాను బాగొచ్చింది అని అక్కడ వాళ్ళందరూ మెచ్చుకున్నారు. కానీ నాకు కొంచెం తలనొప్పిగా ఉంది అందుకే నేను తినలేను మీరు వెళ్లి తినండి అని సీరియస్ అవుతుంది మీనా. ఆ మాట వినగానే అందరికీ కాస్త అనుమానం వచ్చినా కూడా మీనా ఎందుకో బాధ పడిపోతుంది అని అనుకుంటారు. ప్రభావతి మాత్రం నాకు చాలా ఆనందంగా ఉంది ఇవాళ చాలా సంతోషంగా కడుపునిండా తిన్నాను అని గంతులు వేస్తూ ఉంటుంది. సత్యం కి మాత్రం ప్రభావతి మీద అనుమానం ఉంటుంది. ఏది ఏమైనా కూడా మీ నాకు ఏమైందో తెలుసుకోవాలి అని అనుకుంటారు.

నిజం దాచిన మీనా..

చింతామణి చేసిన మోసంలో తను దారుణంగా మోసపోయాను అని బాధపడిపోతూ ఉంటుంది. మీనా. అయితే అప్పుడే బాలు ఫోన్ చేస్తే ఆయనకు నిజం తెలిస్తే బాధపడతాడు అని బాధపడుతుంది. ఏమైంది మీనా కి ఏదో జరిగింది అని బాలు ఆలోచిస్తూనే ఉంటాడు. కానీ మీనా మాత్రం నాకేమీ కాలేదండి నేను భోజనం కూడా చేశాను అని అబద్ధం చెప్తుంది.. రేపు మీరు వస్తారు కదా అంత మాట్లాడుకుందాం అని చెప్పగానే బాలుకి మీనా కి ఏదో సమస్య వచ్చింది అని భయపడిపోతూ ఉంటాడు. ఇక తర్వాత బాలు వచ్చినట్లు ఊహించుకుంటుంది తన సమస్యను బాలుతో చెప్పి తీర్చుకోవాలని అనుకుంటుంది.. ఉదయం లేవగానే మీ నాకు డబ్బులు ఇచ్చినా అతను ఫోన్ చేస్తాడు.. అలాగే మీనా దగ్గర పని చేసిన వాళ్ళు కూలి డబ్బులు కావాలి అని అడగడానికి రాగానే మీనా కంగారు పడిపోతూ ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Related News

బిగ్ బాస్ సీజన్ 10కి ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే?

డైరెక్టర్ అనిల్ రావిపూడి కాలర్ పట్టుకున్న సుడిగాలి సుధీర్.. ఏం జరిగింది?

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Big Stories

Advertisement
×